
వాషింగ్టన్/బాగ్దాద్: ఇటీవల అమెరికా దాడుల్లో హతమైన ఉగ్రసంస్థ ఐసిస్ అధినేత అల్‌బకర్ బాగ్దాదీ గురించి ఐసిస్‌లోని కీలక సభ్యుడే ఉప్పందించాడు. బాగ్దాదీ తలపై రూ. 177 కోట్ల బహుమతిని అమెరికా గతంలో ప్రకటించింది. బాగ్దాదీ సిరియాకి వచ్చిన విషయాన్ని ఐసిస్ కీలక సభ్యుడే అమెరికాకు తెలిపాడు. ఈ నేపథ్యంలో అమెరికా ఇస్తామన్న రూ. 177 కోట్ల నగదు పూర్తిగాగానీ, ఎక్కువ మొత్తంలోగానీ అతడికే దక్కే అవకాశం ఉంది. ఆ వ్యక్తి జాతీయతనుగానీ మరే వివరాలనుగానీ అతడి భద్రత రీత్యా వెల్లడించలేదు. గతంలో ఇతడే బాగ్దాదీ లోదుస్తులను, రక్తపు శాంపిల్‌ను అమెరికాకు అందించాడు. వీటి ఆధారంగానే మరణించింది బాగ్దాదీదేనని డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారించుకున్నారు.