ISIS Chief Abu Bakr al-Baghdadi
-
'అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం'
బీరుట్: ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. గత వారం సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఐసిస్ కొత్త ఛీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్ హష్మీని నియమించినట్లు ఆడియో రూపంలో వెల్లడించింది. అలాగే ఉత్తర సిరియా ప్రాంతంలో ఆదివారం కుర్దు సేనలతో కలిసి అమెరికా జరిపిన దాడుల్లో అల్ బాగ్దాదీ అత్యంత సన్నిహితుడు, సంస్థ అధికార ప్రతినిధి హసన్ అల్ ముజాహిర్ కూడా మృతి చెందినట్లు ఆడియో సందేశంలో పేర్కొంది. అయితే ఆడియోలో మాట్లాడిన అబూ హమ్జా అల్ ఖురేషీ ‘ఎక్కువ సంతోషించకండి’ అంటూ అమెరికాకు ఒక హెచ్చరికను జారీచేశాడు. త్వరలోనే బాగ్దాదీ చావుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆడియోలో స్పష్టం చేశారు. గత వారం ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకొని జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఎనిమిది హెలికాప్టర్లను ఉపయోగించి అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో 90 నిమిషాలు పాటు ఈ దాడులు జరిపినట్లు అమెరికా రిలీజ్ చేసిన వీడియోలో బహిర్గతమయింది. -
బాగ్దాదీ జాడ చెప్పినందుకు రూ.177 కోట్లు!
వాషింగ్టన్/బాగ్దాద్: ఇటీవల అమెరికా దాడుల్లో హతమైన ఉగ్రసంస్థ ఐసిస్ అధినేత అల్‌బకర్ బాగ్దాదీ గురించి ఐసిస్‌లోని కీలక సభ్యుడే ఉప్పందించాడు. బాగ్దాదీ తలపై రూ. 177 కోట్ల బహుమతిని అమెరికా గతంలో ప్రకటించింది. బాగ్దాదీ సిరియాకి వచ్చిన విషయాన్ని ఐసిస్ కీలక సభ్యుడే అమెరికాకు తెలిపాడు. ఈ నేపథ్యంలో అమెరికా ఇస్తామన్న రూ. 177 కోట్ల నగదు పూర్తిగాగానీ, ఎక్కువ మొత్తంలోగానీ అతడికే దక్కే అవకాశం ఉంది. ఆ వ్యక్తి జాతీయతనుగానీ మరే వివరాలనుగానీ అతడి భద్రత రీత్యా వెల్లడించలేదు. గతంలో ఇతడే బాగ్దాదీ లోదుస్తులను, రక్తపు శాంపిల్‌ను అమెరికాకు అందించాడు. వీటి ఆధారంగానే మరణించింది బాగ్దాదీదేనని డీఎన్ఏ పరీక్షలో నిర్ధారించుకున్నారు. -
బాగ్దాదీని ఎలా గుర్తించారంటే..?
బీరట్: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) చీఫ్ అబు బాకర్-అల్- బాగ్దాదీని హతమార్చేందుకు అమెరికా పక్కా వ్యూహంతో పనిచేసింది. అబు బాకర్‌ను మట్టుబెట్టడానికి ముందు కుర్దీష్ నేతృత్వంలోని సిరియా డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) సహాయంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా అతడే అని నిర్ధారించుకుంది. రహస్య వర్గాల ద్వారా అబు బాకర్ లోదుస్తులను సేకరించి డీఎన్ఏ పరీక్ష చేయించినట్టు ఎస్డీఎఫ్ సీనియర్ సలహాదారు పొలట్ కాన్ ట్విటర్లో వెల్లడించారు. అబు బాకర్ ఆచూకీ తెలపడంతో ఎస్డీఎఫ్ ఏవిధంగా సహాయపడిందో ఆయన వివరించారు. ‘ఎస్డీఎఫ్ రహస్య బృందాలు అబు బాకర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్లాయి. అతడి లోదుస్తులను తీసుకొచ్చి డీఎన్ఏ పరీక్ష చేయించాం. వంద శాతం అతడే అని ధ్రువీకరించుకున్నాకే ఆ సమాచారాన్ని అమెరికా దళాలకు చేరవేశాం. చివరివరకు సమర్థవంతంగా పనిచేసి ఆపరేషన్ విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించామ’ని పొలట్ కాన్ వెల్లడించారు. ఎస్డీఎఫ్ ఇచ్చిన సమాచారం ‘ఆపరేషన్ కైలా ముల్లర్’లో ఎంతో ఉపయోగపడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అబు బాకర్‌ను పట్టుకునేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏతో మే నెల 15 నుంచి పనిచేస్తున్నట్టు చెప్పారు. (చదవండి: ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం) -
ఆపరేషన్ కైలా ముల్లెర్
-
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
వాషింగ్టన్: ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా అమెరికా సైన్యం కన్నుగప్పి దాడులకు పాల్పడుతున్న మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది బాగ్దాదీ.. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా చనిపోయాడని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. బాగ్దాదీ మరణించాక ఆ దాడి ప్రాంతం నుంచి అత్యంత విలువైన డాక్యుమెంట్లను అమెరికా సేనలు స్వాధీనంచేసుకున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ, అంతర్జాతీయ సంబంధాల వివరాలు వాటిలో ఉన్నట్లు సమాచారం. ట్రంప్, అమెరికా సైనికాధిపతుల పర్యవేక్షణలో జరిగిన ఘటన క్షణ క్షణం నాటకీయంగా సాగినవైనమిది. బాగ్దాదీ స్థావరం ఇటీవల ఇరాక్ నుంచి వాయవ్య సిరియాకి మారింది. ఒక నెలక్రితం కుర్దుల నుంచి కచ్చితమైన సమాచారమందింది. ఆ గ్రామంలోనే బాగ్దాదీ ఉంటున్నట్లు రెండు వారాల క్రితం అమెరికా సేనలు నిర్ధారించుకున్నాయి. వాయవ్య సిరియాలోని స్థావరంపై దాడికి మూడు రోజుల ముందే ట్రంప్‌కి సమాచారం ఉంది. రష్యా, ఇరాక్, టర్కీ దేశాల అనుమతితో వాయు సేనలు సాగాయి. ఆపరేషన్ కైలా ముల్లర్ బాగ్దాదీని పట్టుకోవడం కోసం బాగ్దాదీ చేతిలో తీవ్ర చిత్రహింసలపాలై, అత్యాచారానికి గురై హతమైన అమెరికా మానవహక్కుల కార్యకర్త 26 ఏళ్ళ కైరా ముల్లర్ పేరుని ఈ ప్లాన్‌కి పెట్టారు. అసలేం జరిగింది? వర్జీనియాలో ఒక రౌండ్ గోల్ఫ్ ఆట ముగించుకొని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు వైట్ హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’కి అధ్యక్షుడు ట్రంప్ చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, అమెరికా భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్లు సిట్యుయేషన్ రూమ్‌కి వచ్చారు. బాగ్దాదీపై సైనిక రహస్యదాడిని వీడియోలో వీక్షించేందుకే సిద్ధమయ్యారు. గంటల్లో అంతా బూడిద గ్రామంపై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లను గ్రామస్తులు గమనించారు. అమెరికా హెలికాప్లర్లు, సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే వారందరినీ అమెరికా సైనికులు మట్టుబెట్టారు. ఆ తర్వాత బాగ్దాదీ ఉంటున్న ఇంటి ముఖద్వారాన్ని బాంబులతో పేల్చారు. సైన్యం దాడి విషయం తెల్సి బాగ్దాదీ వెంటనే రహస్య సొరంగ మార్గం ద్వారా భూగృహం(బంకర్)లోకి చొరబడ్డాడు. ఆయనను బంకర్ చివరివరకు అమెరికా సైనిక సేనలు, సైనిక శునకాలు తరిమాయి. బయటపడే మార్గం లేకపోవడంతో తన శరీరానికున్న బాంబుల జాకెట్‌ను పేల్చుకుని బాగ్దాదీ చనిపోయాడు. పిచ్చివాడిలా అరుచుకుంటూ.. అమెరికా సైనికులు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో బాగ్దాదీ అరుచుకుంటూ, ఏడ్చుకుంటూ పరిగెత్తాడని ట్రంప్ వెల్లడించారు. అమెరికా సైనిక కే9 శునకాలు తరుముతుండడంతో చివరకు సొరంగంలోని బంకర్ చివరి అంచులకు చేరి తన ముగ్గురు పిల్లలతో సహా బాంబులతో పేల్చుకుని కుక్కచావు చచ్చాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దాడి వీడియో ప్రత్యక్షప్రసారాన్ని చూస్తున్న అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ -
ఐసిస్ చీఫ్ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ,
వాషింగ్టన్ : ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్-బాగ్దాదిని అమెరికా దళాలు మట్టుబెట్టినట్లు ఆదివారం వార్తలు ప్రసారమయ్యాయి. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధ్రువవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది చనిపోయిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే, అతన్ని తమ బలగాలు మట్టుబెట్టలేదని చెప్పారు. ‘ఐసిస్ స్థావరాలపై మా భద్రతా బలగాలు దాడులు చేస్తున్న సమయంలో బాగ్దాది భయపడిపోయాడు. ఒక పిరికివాడిలా తనకు తాను ఆత్మాహుతి దాడి చేసుకుని చనిపోయాడు’అని ట్రంప్ వివరణ ఇచ్చారు. అయితే ఈ దాడిలో బాగ్దాదితో పాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించాడు. ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ వేలమంది ప్రాణాలను తీసింది. కానీ, దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడని ట్రంప్ పేర్కొన్నారు. (చదవండి : ఐసిస్ అధినేత అల్ బాగ్దాది హతం?) -
'బాగ్దాది పిరికివాడు.. అందుకే చనిపోయాడు'
-
శిథిలాలే మిగిలాయి...!
మోసుల్ తిరిగి ఇరాక్ వశమైంది. ఐసిస్‌ను తరిమేశారు... కచ్చితంగా ఇది విజయమే. కానీ ఇప్పుడు ఏముందక్కడ? ఎటుచూసినా శిథిలాలే. యుద్ధం మిగిల్చిన గాయాలే. పూర్తిగా నేలమట్టమైన భవనాలు కొన్ని, సగం కూలినవి మరికొన్ని. కాలిబూడిదైన కార్లు... జాడలేని రోడ్లు. నీళ్లు లేవు, కరెంటు లేదు, కనీస వసతులేవీ లేవు. బడి, గుడి, ఆసుపత్రి... అన్నీ నేలమట్టమే. 12వ శతాబ్దంలో నిర్మించిన... మోసుల్కు తలమానికంగా నిలిచిన చారిత్రక ఆల్ నూరీ మసీదు కాలాన్ని తట్టుకొని ఠీవిగా నిలిచింది. మసీదు ఆవరణలోని 150 అడుగుల అల్ హబ్దా మినార్... మోసుల్ అనగానే గుర్తొచ్చే కట్టడం. ఇప్పుడుక్కడ మినార్ ఆనవాళ్లు కూడా లేవు. ఇరాక్ కరెన్సీ పైనా, పాత చిత్రాలు, వీడియోల్లో మాత్రమే మనం దీన్ని చూడగలం. జూన్ 22న ఐసిస్ దీన్ని పేల్చివేసింది. మొత్తం 44 జిల్లాల్లో పశ్చిమ మోసుల్‌లోని ఆరు జిల్లాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముక్కుపుటల అదిరిపోయే దుర్వాసన. బాంబు పేలుళ్లలో ముక్కలైన మానవ కళేబరాలు... కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నాయి. శిథిలాల కింద చిక్కిచనిపోయిన వారి పార్థివదేహాలదీ అదే పరిస్థితి. జనంతో కళకళలాడిన ఇరాక్‌లోని రెండో పెద్ద నగరం మోసుల్... మూడేళ్లలో చిధ్రమైపోయింది. మూడేళ్ల కిందట ఐసిస్ చేతుల్లోకి... పద్దెనిమిది లక్షల జనాభాగల మోసుల్ ఇరాక్‌లో ఉత్తరాన ఉంటుంది. సిరియా, టర్కీ సరిహద్దులకు సమీపంలోగల ఈ పట్టణాన్ని 2014 జూన్‌లో ఉగ్రవాద సంస్థ ఐసిస్ కైవసం చేసుకుంది. మోసుల్‌లోని అల్ నూరీ మసీదు నుంచి ఐసిస్ చీఫ్ అబూబాకర్ అల్ బగ్దాదీ తనను తాను ‘ఖలీఫా’గా ప్రకటించుకున్నాడు. ఇరాక్, సిరియాలలో ఐసిస్ ఆధీనంలో ఉన్న భూభాగంలో అతిపెద్ద పట్టణం మోసుల్. దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 10 వేల మంది సైనికులను మొహరించి ఇరాక్ 2016 అక్టోబరులో పోరు ముమ్మరం చేసింది. అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు వీరికి మద్దతుగా నిరంతరం గగనతల దాడులు చేశాయి. బాంబుల వర్షం కురిపించాయి. పోరు ఉధృతమవ్వడంతో ఐసిస్ ఉగ్రవాదులు టిగ్రిస్ నదిని ఆనుకొని ఉండే... జనసమ్మర్ధమైన ఓల్డ్‌సిటీని కేంద్రంగా చేసుకొని పోరాడారు. నగరానికి పశ్చిమాన ఉండే ఓల్డ్‌సిటీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. మానవ కవచాలుగా స్థానికులను వాడుకున్నారు. వారిని మానవబాంబులుగా మార్చి... ఇరాకీ బలగాలపైకి విసిరేసే వారు. శిథిలాల్లో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ... మొత్తం మీద 9 నెలల్లో ‘ఆపరేషన్ మోసుల్’ను పూర్తిచేశారు ఇరాక్ సైనికులు. నిర్వాసితులు తొమ్మిది లక్షలు... మోసుల్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన పోరులో వేలాది మంది అమాయకుల ప్రాణాలుపోయాయి. ఎటువైపు నుంచి ఏ తూటా దూసుకొస్తుందో, ఎప్పుడు పైనుంచి బాంబులు పడతాయో తెలియదు. బతికుంటే చాలునని కట్టుబట్టలతో ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇలాంటి నిర్వాసితులు తొమ్మిది లక్షల మంది ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. బంధువుల ఇళ్లలో, శరణార్థి శిబిరాల్లో వీరు తలదాచుకుంటున్నారు. వీరందరి జీవితాలు మళ్లీ గాడిలో పడాలంటే ఏళ్లు పట్టొచ్చు. ఏడాది కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకే... 6,500 కోట్ల రూపాయలకు పైగా కావాలని ఐరాస చెబుతోంది. గృహనిర్మాణం, ఇతర సాయానికి మరింత పెద్ద మొత్తమే కావాలి. ఇరాక్‌కు అందే అంతర్జాతీయ సాయంపై మోసుల్ పునర్నిర్మాణం ఆధారపడి ఉంటుంది. మోసుల్ పాలనపై కూడా అంతర్గతంగా విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. కుర్దుల ప్రాబల్యం కలిగిన ప్రాంతాన్ని కుర్థిస్తాన్గా గుర్తించి పాలనలో స్వేచ్ఛనిచ్చినట్లే... మోసుల్‌లో మెజారిటీగా ఉన్న సున్నీలకు అవకాశం ఇవ్వాలనే వాదన ఉంది. షియా, సున్నీలు, కుర్దులకు మధ్య విభేదాలు ఇరాక్ సుస్థిరతపై ప్రభావం చూపొచ్చనే ఆందోళన కూడా నెలకొంది. అంతం అనలేం... ఉచ్చదశలో ఉన్నపుడు... 2015లో ఐసిస్ ఆధీనంలో ఇరాక్, సిరియాల్లో కలిపి లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండేది. కోటి జనాభా దీని పాలన పరిధిలో ఉండేది. బలగాలు క్షీణించడం, కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోవడం, ఆదాయాలు పడిపోవడం... ద్వారా ఐసిస్ క్రమేపీ బలహీనపడుతూ వస్తోంది. మోసుల్‌ను విముక్తం చేయడం ద్వారా ఇరాక్ ఈ పట్టణానికి సమీపంలోని చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కూడా... ఐసిస్‌కు మరో ఎదురుదెబ్బ. తమ ఆధీనంలోకి భూభాగంలో 60 శాతాన్ని ఐసిస్ కోల్పోయింది. 25 లక్షల మంది ప్రజలు ఇంకా ఐసిస్ పాలనలో ఉన్నారు. ఇరాక్‌లో పరిమిత ప్రాంతమే ఇప్పుడు ఐసిస్ చేతిలో ఉంది. అయితే సిరియాలో ఐసిస్‌కు రాజధానిగా పరిగణించే రక్కా నగరంతో పాటు పలు పట్టణాలు ఈ ఉగ్రసంస్థ ఆధీనంలోనే ఉన్నాయి. రక్కాను సిరియా బలగాలు ఇప్పటికే దిగ్భందించాయి. దాదాపు రెండువేల మంది తీవ్రవాదులు రక్కా సిటీ సెంటర్ కేంద్రంగా సిరియా సైన్యంతో పోరాడుతున్నారు. ఒకప్పుడు నెలకు 520 కోట్ల రూపాయల దాకా ఉన్న ఐసిస్ ఆదాయం ఇప్పుడు 104 కోట్లకు పడిపోయింది. ఐసిస్‌పై పోరాటంలో ప్రపంచదేశాలు కలిసికట్టుగా పనిచేస్తే... ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రభూతం ఐసిస్ కోరలు పీకవచ్చు. భూభాగాన్ని కోల్పోతున్న ఐసిస్ ఇప్పటికే చాలాచోట్ల గెరిల్లా దాడులకు దిగుతోంది. కారు బాంబులు, మానవ బాంబులతో నరమేధం సాగిస్తూ... మరోరకంగా ఉనికిని చాటుకుంటోంది. సానుభూతిపరులను రెచ్చగొట్టి పాశ్చాత్యదేశాల్లో దాడులకు తెగబడేలా చేస్తోంది. రక్కా కూడా విముక్తమైతే ఐసిస్‌పై చావుదెబ్బ పడ్డట్లే. శిథిలాల్లో 20 రోజులు... ఆ కుర్రాడికి దాదాపు పదేళ్లు ఉంటాయి. నడుము పైభాగంగా బ్యాండేజి చుట్టి ఉంది. 20 రోజులకు శిథిల భవనంలోని బేస్మెంట్లో చిక్కుకుపోయాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. సోమవారం బయటపడ్డ ఇతను ‘చాలా నొప్పిగా ఉంది. నడవలేకపోతున్నాను’ అనడం వీడియోలో కనిపిస్తోంది. అంతకుమించి వివరాలు తెలియలేదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్