ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ, | ISIS Founder Abu Bakr Al Baghdadi Killed Himself During US Raid Said Donald Trump | Sakshi
Sakshi News home page

ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ,

Published Sun, Oct 27 2019 8:03 PM | Last Updated on Mon, Oct 28 2019 12:38 PM

ISIS Founder Abu Bakr Al Baghdadi Killed Himself During US Raid Said Donald Trump - Sakshi

ఐసిస్‌ స్థావరాలపై మా భద్రతా బలగాలు దాడులు చేస్తున్న సమయంలో బాగ్దాది భయపడిపోయాడు. ఒక పిరికివాడిలా తనకు తాను ఆత్మాహుతి దాడి చేసుకుని చనిపోయాడు

వాషింగ్టన్‌ : ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్‌) ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్‌ అల్‌-బాగ్దాదిని అమెరికా దళాలు మట్టుబెట్టినట్లు ఆదివారం వార్తలు ప్రసారమయ్యాయి. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారికంగా  ధ్రువవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది చనిపోయిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే, అతన్ని తమ బలగాలు మట్టుబెట్టలేదని చెప్పారు. 

‘ఐసిస్‌ స్థావరాలపై మా భద్రతా బలగాలు దాడులు చేస్తున్న సమయంలో బాగ్దాది భయపడిపోయాడు. ఒక పిరికివాడిలా తనకు తాను ఆత్మాహుతి దాడి చేసుకుని చనిపోయాడు’అని ట్రంప్‌ వివరణ ఇచ్చారు. అయితే ఈ దాడిలో బాగ్దాదితో పాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు ట్రంప్‌ వెల్లడించాడు. ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ వేలమంది ప్రాణాలను తీసింది. కానీ, దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడని ట్రంప్‌ పేర్కొన్నారు. 


(చదవండి : ఐసిస్‌ అధినేత అల్ బాగ్దాది హతం?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement