washigton
-
అమెరికాలో ఇండియన్ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్ ఎంబసీ (దౌత్య కార్యాలయం)లో విషాదం చోటు చేసుంది. కార్యాలయం ప్రాంగణంలో ఓ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నిన్న (శుక్రవారం) ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మృతి చెందిన అధికారికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడిచలేదు.‘‘భారత రాయబార కార్యాలయ ప్రాంణంలో 18 సెప్టెంబర్ 2024 (బుధవారం) రోజు సాయంత్రం ఓ అధికారి మరణించినట్లు మేము ధృవీకరిస్తున్నాం. మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి పంపిచడానికి సంబంధిత ఏజెన్సీలు, కుటుంబ సభ్యులతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక.. కుటుంబం గోప్యత కోసం మరణించిన అధికారికి సంబంధించి అదనపు వివరాలను వెల్లడించటం లేదు. ఈ విషాద సమయంలో ఆ అధికారి కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం’ అని పేర్కొంది.మరోవైపు.. ఈ ఘటపై స్థానిక పోలీసులు, సిక్రెట్ సర్వీస్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మ హత్య చేసుకున్నా? లేదా హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చదవండి: లెబనాన్ పేజర్ల పేలుళ్ల కేసులో కేరళ టెక్కీ ప్రమేయం! దర్యాప్తులో ఏం తేలిందంటే.. -
కొట్టేశానోచ్! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!
ఒక దొంగ మంచి ఖరీదైన వస్తువు కొట్టేశానన్న ఆనందంలో ముందు వెనుక చూడకుండా పారిపోయేందుకు యత్నించి బొక్క బోర్లాపడి అడ్డంగా దొరికి పోయాడు. ఈ ఘటన యూఎస్‌లోని వాషింగ్టన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో లూయిస్ విట్టన్ స్టోర్ అనే లగ్జరీ షాపుకి ఒక దొంగ వచ్చాడు. అతను ఆ షాపులో సుమారు రూ. 14 లక్షలు ఖరీదు చేసే వస్తువుని దొంగలించి పారిపోయేందుకు యత్నించాడు. ఐతే ఆ షాపుకి బయటవైపుగా క్లీన్‌గా ఉన్న అద్దాన్ని గమనించకుండా బయటకు దారి అదే అనుకుని ఆ అద్దం గుండా వెళ్లిపోవాలనుకున్నాడు. అంతే ఆ దొంగ ఆ అద్దానికి గుద్దుకుని ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాడు. అతను 17 ఏళ్ల యువకుడని పోలీసులు చెప్పారు. ఈ బెల్లేవ్ నగరంలో ఇటీవల 50కి పైగా ఇలాంటి రిటైల్ దోపిడి, షాప్ చోరి కేసులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. వారంతా తమను గుర్తుపట్టరన్న ధైర్యంతో చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు పోలీసులు బెల్లేవ్ నగరానికి వచ్చి ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే మరిన్ని కేసులు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
'ఆటా' కొత్త అధ్యక్షునిగా భువనేశ్ బుజాల
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా భువనేశ్ బుజాల పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీ నివాసి అయిన భువనేశ్ 2004వ సంవత్సరం నుంచి ఆటాలో ఉత్సాహంగా పాలుపంచుకొంటున్నారు. 2014లో జరిగిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌లో కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన నాశ్విల్లే నగరంలో జనవరి 16న జరిగిన 'ఆటా' కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారు. డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్‌గా జయంత్ చల్లా, కాశీ విశ్వనాధ్ కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హనుతిరుమల్ రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి, రామ్ అన్నాడీ , రవీందర్ గూడూర్, రింద సామ, శరత్ వేముల, సుధీర్ బండారు & విజయభాస్కర్ తూపల్లి ఎన్నికయ్యారు. ఇక ఆటా ప్రెసిడెంట్‌గా భువనేశ్ భూజాల, సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, ట్రెజరర్‌గా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రెజరర్‌గా విజయ్ కుందూరు ఎన్నిక అయ్యారు. నష్విల్లె నగరంలో జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ప్రెసిడెంట్‌గా మధు బొమ్మినేని ఎన్నికయ్యారు. ఇక ప్రెసిడెంట్ భువనేశ్ మాట్లాడుతూ.. ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తున్నామని చెప్పారు. ఆపదలో ఉన్న తెలుగు వారు ఆటా సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆటా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా ఎల్లప్పుడూ పెద్ద పీఠ వేస్తుందని పేర్కొన్నారు. మన మాతృభూమిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ నిర్వహణ కార్యక్రమంలో అమెరికాలో పుట్టిపెరిగిన మన పిల్లలను భాగస్వాములను చేయడానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆయన బోర్డును కోరారు. యూత్ కమిటీ ఏర్పాటు చేశారు. మొట్ట మొదటసారిగా ఆటా కన్వెన్షన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1 నుంచి 3 తేదీలలో నిర్వహిస్తున్నామని అందరూ తప్పక పాలుపంచుకోవాలన్నారు. కోవిడ్-19 సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవీ విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్ల, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డిని బోర్డు అభినందించింది. నాశ్విల్లే నగరంలో ఆతిధ్యం ఇచ్చిన ఆటా సభ్యులకు బోర్డు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఆటాకి తోడ్పాటునందిస్తున్న లోకల్ ఆర్గనైజషన్స్ను బోర్డు కొనియాడింది. -
అమెరికా చరిత్రలో చెత్త అధ్యక్షుడిగా ట్రంప్
వాషింగ్టన్: ‘డొనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోయారు’ అని ప్రముఖ హాలీవుడ్ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతవారం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తూ సోమవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఓ విఫలుడని వ్యాఖ్యానించారు. అంతేగాక దాడికి కారణమైన ట్రంప్ మద్దతుదారులను నాజీలతో పోలుస్తూ ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తోటి అమెరికన్లకు, నా మిత్రులకు ఇటీవల మన దేశంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనల గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను పుట్టి, పెరిగింది ఆస్ట్రియాలో. అక్కడ 1938లో జరిగిన క్రిస్టల్లానాచ్ గురించి (దీన్నే నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్) నాకు తెలుసు. జర్మనీకి చెందిన నాజీలు ఆస్ట్రియాలోని యూదుల ఇళ్లపై దాడికి చేసి పెను విధ్వంసానికి కారణమయ్యారు. (చదవండి: యూఎస్: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం) ఇప్పుడు అమెరికాలోని ప్రౌడ్ బాయ్స్ (ట్రంప్ మద్దతుదారుల గ్రూప్) కూడా అదే చేశారు. ఇటీవల క్యాపిటల్ భవనంపై వారు జరిపిన దాడిలో భవనం అద్దం పగిలింది. అయితే అది కేవలం అద్దం మాత్రమే కాదు.. అమెరికా కాంగ్రెస్ చట్ట సభ్యుల ఆలోచన కూడా. ఈ దాడితో వారంతా దేశ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారు’ అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూసేవారెవరూ అధ్యక్షుడిగా ఉండలేరని, ఎన్నికల్లో విజయం సాధించలేరన్నారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా రానున్న కొత్త నేత జో బైడెన్‌కు మద్దతు పలకాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, 'టర్మినేటర్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ ఫ్యామిలీ ఆస్ట్రియా నుంచి అమెరికాకు వలస వచ్చింది. ఆపై ఆయన 2003లో కాలిఫోర్నియా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందినప్పటికీ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ పలుమార్లు ఆయన విమర్శల పాలైన సంగతి తెలిసిందే. (చదవండి: నా కొడుకు వస్తే సర్వనాశనమే: ట్రంప్ తల్లి) My message to my fellow Americans and friends around the world following this week's attack on the Capitol. pic.twitter.com/blOy35LWJ5 — Arnold (@Schwarzenegger) January 10, 2021 -
యూఎస్: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన సమయంలో ప్రవాస భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విన్సెంట్ జావియర్ పాలతింగాల్ (54) ట్రంప్ మద్దతుదారులతో కలిసి మన జాతీయ జెండాని ప్రదర్శించాల్సిన అవసరమేమొచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ విన్సెంట్ మాత్రం తన చర్యని పూర్తిగా సమర్థించుకుంటున్నారు. పలు మీడియా సంస్థలు ఫోన్ ద్వారా ఆయనని ఇంటర్వ్యూ చేసిన సమయంలో అడిగిన ప్రశ్నలకు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చారు. (యూఎస్‌లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం) అందరూ భావిస్తున్న ట్టుగా ట్రంప్ మద్దతుదారులందరూ మూర్ఖులు కాదని నిరూపిం చడానికే తాను జెండా పట్టుకొని వెళ్లానని అంటున్నారు. ‘సాధారణంగా ఎవరైనా నిరసన ప్రదర్శనలకి వెళితే తమ జాతీయ జెండానే మోసుకెళ్తారు. ట్రంప్‌కి ఇప్పటికీ అంతర్జాతీయంగా మద్దతు ఉంది. ఎందరో భారతీయులు ఆయన అభిమానులుగా ఉన్నారు’’ అని విన్సెంట్ చెప్పారు. ట్రంప్ మద్దతుదారులు అందరూ శాంతియుతంగానే నిరసన ప్రదర్శన నిర్వహించారని, కానీ ఆయన ప్రతిష్టని దిగజార్చడానికి 50 మంది వరకు లెఫ్టిస్టులు నిరసన కారుల్లో కలిసిపోయి బీభత్స కాండ సృష్టించారని ఆరోపించారని విన్సెంట్ అడ్డగోలు వాదనలు చేశారు. వామపక్షాలంటే ద్వేషం : విన్సెంట్ స్నేహితులు విన్సెంట్ జేవియర్ భారత్‌లో ఉండగా కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారని ఆయన స్పేహితులు చెప్పారు. లెఫ్ట్ పార్టీల పట్ల తీవ్ర ద్వేషభావం ఉండేది. రాజకీయ కారణాలతోనే ఆయన దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారని, సాఫ్ట్వేర్ సంస్థని నెలకొల్పి ఆ దేశంలోనే స్థిరపడిపోయారని విన్సెంట్ స్నేహితులు వివరించారు. అమెరికా వెళ్లాక కూడా ఆయన కొన్ని మళయాళీ సంస్థల్లో చురుగ్గా ఉంటూ ట్రంప్ మద్దతుదారుడిగా ఉన్నారు. మువ్వన్నెల జెండా పట్టుకొని నిరసనకు వెళ్లడంతో భారతీయుల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో జెండా పట్టుకొని ఉన్న ఫోటోలను తొలగించారు. -
ఆటా అధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) డీసీ రిజీయన్ నిర్వహకులు అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలను వాషింగ్టన్ సమీపంలోని చిన్మయ సోమనాథ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్సాస్ రాష్ట్రంలోని మన్షాట్టన్ నగర మేయర్ ఉషారెడ్డి, ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పబ్లిక్ స్కూల్ సభ్యులు రచన సిజెమోర్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ ఉషారెడ్డి మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు. ఇక స్త్రీ, పురుష భేదం లేకుండా మహిళలు, బాలికలు అన్ని రంగాల్లో తమ కలలను సాకారం చేసే దిశగా వారిని ప్రోత్సహించాలనన్నారు. అనంతరం ఆటా సంఘం అధ్యక్షులకు, సంఘ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇక రచన సిజెమోర్ మాట్లాడుతూ.. దక్షిణాసియా మహిళలందరూ సమాజా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా అటా సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అటా సంఘ స్థానిక తెలుగు అసోసియేషన్ నాయకురాలు సుధ కొండపు, క్యాపిటల్ ఏరియా అధ్యక్షులు సాయి సుధ పలడుగు, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సోసైట్ అధ్యక్షురాలు పుష్యమి దువూరి, తెలంగాణ అభివృద్ధి ఫోరం అధ్యక్షురాలు డాక్టర్ ప్రభావతి రెడ్డి స్కాలర్, కుచిపుడి డాన్స్ అకాడమీకి చెందిన లక్ష్మి బాబు, సాయికాంత రాపర్ల, డ్యాన్స్ టీచర్ శ్రీలేఖా పల్లె, ఆయా రంగాలలో, సమాజ సేవలో రాణిస్తున్న సంఘం నాయకురాలు మిస్ ఇండియా డీసీ స్నేహ మిశ్రా, భారతీ సంధ్య బైరెడ్డిలతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళ నాయకులను ఆహ్వనించారు. అంతేగాక ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి రాఫెల్ టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కుట్టు మిషిన్లు అందించడానికి ఏబీవీ ఫౌండేషన్(abvfoundarion.org)కు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారంత మహిళ సాధికారతను ప్రోత్సహించడానికి బ్యూటీషియన్ కుర్చీలను కూడా అందజేశారు. ఆటా సంఘం నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు.. శీరిష కొంపల్లి, శ్రీలేఖ పల్లె, దీపికా బూజల, నందిని యెదులా, ప్రసన్న కొమటిరెడ్డి గీతా బోజ్జలకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా డీసీ అధికారులు భువనేశ్వర్ బూజల, అధ్యక్షుడు జయ చల్లాలకు ధన్యవాధాలు తెలిపారు. అంతేగాక ఈ కార్యక్రమానికి హజరై విజయవంత చేసిన వాలంటీర్లకు ఇతర సంఘ నాయకులకు, నిర్వహకులకు ఆటా సంఘం నిర్వహకులు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. -
డ్రగ్స్ తయారీ కేసులో ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్టు
వాషింగ్టన్: ఉత్తర అమెరికాలోని ఓ కళాశాల ల్యాబ్‌లో మాదక ద్రవ్యాలను ఉపయోగించి మెత్‌ను తయారు చేశారని ఇద్దరు కెమిస్ట్రీ ప్రొఫెసర్లను శుక్రవారం పోలీసులు ఆరెస్టు చేశారు. ప్రొపెసర్లు ఇద్దరు ఆర్కాన్సాస్ కళాశాలకు చెందిన వారని పోలీసులు తెలపారు. వివరాలు.. హెండర్సన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఆర్కాన్సాస్ కళాశాల ప్రొఫెసర్లు టెర్రీ డేవిడ్ బాటెమన్, బ్రాడ్లీ అలెన్ రోలాండ్లు మెథాంపేటమిన్ తయారు చేశారని, ఇందుకోసం మాదక ద్రవ్యాల పరికరాలను కూడా వాడినట్లు సమాచారం రావడంతో వారిని అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే దీనిపై కళాశాల ప్రతినిధి టీనా హాల్ మాట్లాడుతూ.. వారిద్దరు గత అక్టోబర్ 11 నుంచి అధికారిక సెలవులలో ఉన్నారని తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం కళాశాల సైన్స్ ల్యాబ్ నుంచి ఏదో కెమికల్ వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించామని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా ల్యాబ్‌లో మాదక ద్రవ్యాల సామాగ్రిని ఉపమోగించి మెథాంపేటమిన్ అనే కొత్త కెమికల్ డ్రగ్‌ను తయారు చేసినట్లుగా తెలింది. దీంతో కెమికల్ డ్రగ్ వల్ల కళాశాల క్యాంపస్ ఆవరణం అంతా దుర్వాసనా రావడంతో మూడు రోజుల పాటు కళాశాలను మూసివేశామన్నారు. ఇక ల్యాబ్‌ను శుభ్రం చేయించి తిరిగి అక్టోబర్ 29 కళాశాలను తిరిగి ప్రారంభించామని టీనా హాల్ మీడియాకు తెలిపారు. -
నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!
వాషింగ్టన్: అమెరికా పోలీసులకు ఓ విచిత్ర సంఘటన ఎదురైంది. అదివారం రాత్రి 52ఏళ్ల వృద్దుడు అధిక వేగంతో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు విచారించగా.. అతడు చెప్పిన సమాధానం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే...ఫ్లొరిడాకు చెందిన జాన్ ఎర్ల్ పికార్డ్(52) 88 కిలోమీటర్ల స్పీడు లిమిట్ ఉన్న రహదారిపై 144 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుని నిలదీయగా.. తాను భార్యను మోసం చేస్తున్నానని, అందుకే తొందరగా ఇంటికి వెళ్లేందుకు స్పీడ్‌గా వెళుతున్నానంటూ సమాధానం ఇచ్చాడు. అయితే వృద్దుడు డ్రైవింగ్ చేస్తున్న ఆ రహదారిపై 88 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి కానీ.. అతను 144 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాడు. దీంతో పరిమితికి మించి రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అరెస్టు చేసే సమయంలో అతని టీ షర్ట్ జేబులో కోకైన్ గంజాయి ప్యాకెట్ కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు. కాగా దానిని పికార్డ్ 50 డాలర్లకు కొనుగోలు చేసినట్లు స్వయంగా ఒప్పుకోవడంతో ఆదనంగా అతనిపై మాదకద్రవ్యాల కేసు నమోదు చేశారు. -
ఐసిస్ చీఫ్ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ,
వాషింగ్టన్ : ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్-బాగ్దాదిని అమెరికా దళాలు మట్టుబెట్టినట్లు ఆదివారం వార్తలు ప్రసారమయ్యాయి. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధ్రువవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది చనిపోయిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే, అతన్ని తమ బలగాలు మట్టుబెట్టలేదని చెప్పారు. ‘ఐసిస్ స్థావరాలపై మా భద్రతా బలగాలు దాడులు చేస్తున్న సమయంలో బాగ్దాది భయపడిపోయాడు. ఒక పిరికివాడిలా తనకు తాను ఆత్మాహుతి దాడి చేసుకుని చనిపోయాడు’అని ట్రంప్ వివరణ ఇచ్చారు. అయితే ఈ దాడిలో బాగ్దాదితో పాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించాడు. ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ వేలమంది ప్రాణాలను తీసింది. కానీ, దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడని ట్రంప్ పేర్కొన్నారు. (చదవండి : ఐసిస్ అధినేత అల్ బాగ్దాది హతం?) -
'బాగ్దాది పిరికివాడు.. అందుకే చనిపోయాడు'
-
మోదీ అలా చెప్పగానే..
వాషింగ్టన్: తమ దేశం నుంచి ఎలాంటి దాడులు ఇండియాపై చేయబోమని పాకిస్థాన్ హామీ ఇవ్వాలని అమెరికా కోరింది. తమ పొరుగు దేశంలోనే ఉగ్రవాదం పెంచిపోషిస్తున్నారని అమెరికా కాంగ్రెస్స్ లో మోదీ ప్రసంగం చేసిన అనంతరమే పాక్ ను అమెరికా ఈ డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'ఇండియాపై ఎలాంటి దాడులు జరగబోవని పాకిస్థాన్ హామీ ఇవ్వాలి. ఇలా చేయడం పాకిస్థాన్, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తీసుకునే చర్యల్లో మరో మెట్టు అవుతుంది' అని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. ఎలాంటి ఉగ్రవాదానికి తాము తావు ఇవ్వబోమని పాక్ స్పష్టం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే, అన్ని రకాల ఉగ్రవాదాలు పాకిస్థాన్‌లోనే పెంచిపోషిస్తున్నారని మాత్రం తాను అనబోనని, అదే సమయంలో అలాంటి ఛాయలకు పాక్ అవకాశం ఇవ్వకూడదని అన్నారు. భారత్, పాకిస్థాన్లతో తమ సంబంధాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. కానీ ఉగ్రవాదం నిరోధం విషయంలో మాత్రం తమది ఒకే వైఖరి అని చెప్పారు. -
సీరీజ్ ముంగిట 'సూర్యోదయం'!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఏడున్నరేళ్ల క్రితం ప్రయోగించిన 'డాన్' ఉపగ్రహం ఎట్టకేలకు సీరీజ్ మరుగుజ్జు గ్రహాన్ని చేరింది. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సీరీజ్ చుట్టూ కక్ష్యలోకి వెళ్లింది. 61 వేల కి.మీ. దూరం నుంచే ఉపగ్రహాన్ని సీరీజ్ గురుత్వాకర్షణ శక్తితో లాక్కుందని, అయాన్ థ్రస్టర్(మోటారు)ను మండించి వేగాన్ని నియంత్రించుకుంటూ 'డాన్' సీరీజ్ కక్ష్యలోకి చేరింది. సీరీజ్ కక్ష్యలోకి చేరాక డాన్ నుంచి సంకేతాలు అందాయని కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ తెలిపింది అయితే, సీరీజ్కు చీకటివైపు నుంచి కక్ష్యలోకి చేరినందున, వచ్చే నెల నుంచే ఆ గ్రహం పగటి భాగం డాన్‌కు కనిపిస్తుందని, అందువల్లే అప్పటి నుంచే డాన్ ఫొటోలు తీసి పంపనుందని పేర్కొంది. అంగారక, గురు గ్రహాల మధ్య అతిపెద్ద ఖగోళ వస్తువైన సీరీజ్ను 1801లో కనుగొన్నారు. ఈ గ్రహం ఉపరితలంపై నీరు ఉందని, దానితో వ్యోమగాములు ఆక్సిజన్ తయారుచే సుకోవచ్చని భావిస్తున్నారు. సౌరకుటుంబం ఏర్పడినప్పుడు గురు గ్రహం ప్రభావం వల్ల ఇది పూర్తిస్థాయి గ్రహంగా ఏర్పడలేదని, దీనిపై పరిశోధనతో గ్రహాల ఆవిర్భావం గురించి తెలుసుకోవచ్చంటున్నారు.