వాషింగ్టన్: ఉత్తర అమెరికాలోని ఓ కళాశాల ల్యాబ్‌లో మాదక ద్రవ్యాలను ఉపయోగించి మెత్‌ను తయారు చేశారని ఇద్దరు కెమిస్ట్రీ ప్రొఫెసర్‌లను శుక్రవారం పోలీసులు ఆరెస్టు చేశారు. ప్రొపెసర్లు ఇద్దరు ఆర్కాన్సాస్ కళాశాలకు చెందిన వారని పోలీసులు తెలపారు. వివరాలు.. హెండర్సన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఆర్కాన్సాస్ కళాశాల ప్రొఫెసర్లు టెర్రీ డేవిడ్ బాటెమన్, బ్రాడ్లీ అలెన్ రోలాండ్లు మెథాంపేటమిన్ తయారు చేశారని, ఇందుకోసం మాదక ద్రవ్యాల పరికరాలను కూడా వాడినట్లు సమాచారం రావడంతో వారిని అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు.
అయితే దీనిపై కళాశాల ప్రతినిధి టీనా హాల్ మాట్లాడుతూ.. వారిద్దరు గత అక్టోబర్ 11 నుంచి అధికారిక సెలవులలో ఉన్నారని తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం కళాశాల సైన్స్ ల్యాబ్ నుంచి ఏదో కెమికల్ వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించామని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా ల్యాబ్‌లో మాదక ద్రవ్యాల సామాగ్రిని ఉపమోగించి మెథాంపేటమిన్ అనే కొత్త కెమికల్ డ్రగ్‌ను తయారు చేసినట్లుగా తెలింది. దీంతో కెమికల్ డ్రగ్ వల్ల కళాశాల క్యాంపస్ ఆవరణం అంతా దుర్వాసనా రావడంతో మూడు రోజుల పాటు కళాశాలను మూసివేశామన్నారు. ఇక ల్యాబ్‌ను శుభ్రం చేయించి తిరిగి అక్టోబర్ 29 కళాశాలను తిరిగి ప్రారంభించామని టీనా హాల్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment