వాషింగ్టన్: అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) డీసీ రిజీయన్ నిర్వహకులు అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలను వాషింగ్టన్ సమీపంలోని చిన్మయ సోమనాథ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్సాస్ రాష్ట్రంలోని మన్షాట్టన్ నగర మేయర్ ఉషారెడ్డి, ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పబ్లిక్ స్కూల్ సభ్యులు రచన సిజెమోర్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ ఉషారెడ్డి మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు. ఇక స్త్రీ, పురుష భేదం లేకుండా మహిళలు, బాలికలు అన్ని రంగాల్లో తమ కలలను సాకారం చేసే దిశగా వారిని ప్రోత్సహించాలనన్నారు. అనంతరం ఆటా సంఘం అధ్యక్షులకు, సంఘ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇక రచన సిజెమోర్ మాట్లాడుతూ.. దక్షిణాసియా మహిళలందరూ సమాజా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా అటా సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అటా సంఘ స్థానిక తెలుగు అసోసియేషన్ నాయకురాలు సుధ కొండపు, క్యాపిటల్ ఏరియా అధ్యక్షులు సాయి సుధ పలడుగు, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సోసైట్ అధ్యక్షురాలు పుష్యమి దువూరి, తెలంగాణ అభివృద్ధి ఫోరం అధ్యక్షురాలు డాక్టర్ ప్రభావతి రెడ్డి స్కాలర్, కుచిపుడి డాన్స్ అకాడమీకి చెందిన లక్ష్మి బాబు, సాయికాంత రాపర్ల, డ్యాన్స్ టీచర్ శ్రీలేఖా పల్లె, ఆయా రంగాలలో, సమాజ సేవలో రాణిస్తున్న సంఘం నాయకురాలు మిస్ ఇండియా డీసీ స్నేహ మిశ్రా, భారతీ సంధ్య బైరెడ్డిలతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళ నాయకులను ఆహ్వనించారు. అంతేగాక ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి రాఫెల్ టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కుట్టు మిషిన్‌లు అందించడానికి ఏబీవీ ఫౌండేషన్(abvfoundarion.org)కు విరాళంగా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వారంత మహిళ సాధికారతను ప్రోత్సహించడానికి బ్యూటీషియన్ కుర్చీలను కూడా అందజేశారు. ఆటా సంఘం నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు.. శీరిష కొంపల్లి, శ్రీలేఖ పల్లె, దీపికా బూజల, నందిని యెదులా, ప్రసన్న కొమటిరెడ్డి గీతా బోజ్జలకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా డీసీ అధికారులు భువనేశ్వర్ బూజల, అధ్యక్షుడు జయ చల్లాలకు ధన్యవాధాలు తెలిపారు. అంతేగాక ఈ కార్యక్రమానికి హజరై విజయవంత చేసిన వాలంటీర్లకు ఇతర సంఘ నాయకులకు, నిర్వహకులకు ఆటా సంఘం నిర్వహకులు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment