
డమాస్కస్:సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోగా 11 మంది దాకా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో పిల్లలు,మహిళలు ఉన్నట్లు సిరియా మీడియా వెల్లడించింది.
దాడుల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని తెలిపింది.ఇజ్రాయెల్‌లోని గోలాన్ హైట్స్ నుంచి మూడు మిసైల్స్ అపార్ట్‌మెంట్‌పైకి దూసుకువచ్చి ఈ దాడులు జరిపాయి.
ఇరాన్ మిత్రదేశమైన సిరియాపై కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. అక్టోబర్7 హమాస్ తమపై జరిపిన మెరుపు దాడుల తర్వాత సిరియాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది.
ఇదీ చదవండి: హెజ్బొల్లా చితికిపోయింది: అమెరికా
Comments
Please login to add a commentAdd a comment