బీరుట్: ఉగ్రమూక ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) బాంబుల మోతతో నిరంతరం దద్దరిల్లే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐసిస్- సిరియన్ కుర్దిష్ దళాల ఆధిపత్య పోరులో ముఖ్యంగా చిన్నారులు ఎన్నో దురవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రతీకార దాడుల్లో ధ్వంసమయ్యే భవనాలతో పాటు వారి బాల్యం కూడా శిథిలమవుతోంది. ఇందుకు అద్దం పట్టే ఫొటోలు ఎన్నెన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రపంచాన్ని కన్నీరు పెట్టించాయి.(ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!!)
తాజాగా ఓ సిరియన్- తండ్రీ కూతుళ్లకు సంబంధించిన వీడియో ఒకటి మరోసారి నెటిజన్ల హృదయాల్ని మెలిపెడుతోంది. బాంబు దాడులు, యుద్ధవిమానాల శబ్దాన్ని కూడా ‘నవ్వులాట’గా మార్చి కూతురిని సంతోషపెడుతున్న దృశ్యాలు మనసులను ద్రవింపజేస్తున్నాయి. బాంబు పేలిన తర్వాత.. మనం నవ్వాలి అంటూ తండ్రి.. తన చిన్నారి కూతురికి చెప్పటం.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నవ్వడం.. ఇదంతా చాలా సరదాగా ఉంది కదా మాట్లాడుకోవడం.. ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి.. ‘‘విషాదంలోనే సంతోషం వెదుక్కుంటున్న తండ్రీకూతుళ్లను సిరియాలో మాత్రమే చూడగలుగతాం. ఈ దృశ్యాలు గుండెను బరువెక్కిస్తున్నాయి. కనీసం ఈ చిన్నారి బాల్యం అయినా ఆనందంగా గడిస్తే బాగుండు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(ఎవరిదీ పాపం; కన్నీరు పెట్టిస్తున్న ఫొటో! )
Comments
Please login to add a commentAdd a comment