syria crisis
-
సిరియా నుంచి పారిపోయిన అసద్
-
ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!
రాఖా: సిరియా రాజధాని రాఖాలోని అల్-నైమ్ స్క్వేర్(ట్రాఫిక్ సిగ్నల్) ఒకప్పుడూ బహిరంగంగా మరణశిక్షలు అమలు పరిచే భయంకరమైన వేదిక. కానీ ఇప్పడూ అది ప్రేమికులు, కుటుంబాలు, స్నేహితులు సమావేశమయ్యే అందమైన ప్రదేశం. అయితే ఈ ప్రాంతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆక్రమణతో 2014 నుంచి 2017 వరకు ఆ ప్రదేశం రక్తం చిమ్ముతూ భయనకంగా ఉండేది. (చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను) అంతేకాదు ఆ ప్రాంతంలో జిహాదీలు స్క్వేర్‌లో తమ ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారని, మతభ్రష్టులు లేదా నేరస్థులుగా భావించే వారిపై ధ్వజమెత్తడం, శిలువ వేయడం, శిరచ్ఛేదం చేయడం వంటివి చేశారు. దీంతో అక్కడ స్థానికులు ఆ ప్రదేశాన్ని "రౌండబౌట్ ఆఫ్ హెల్" గా పిలిచేవారు. ఆ ప్రదేశంలోని స్థానికుడు హుస్సేన్ అనే వ్యక్తి తాను ఆ సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లడానికి కూడా చాలా భయపడేవాణ్లి అంటూ చెప్పుకొచ్చాడు. ఐఎస్ఐఎస్లు నగరాన్ని వదిలి వెళ్లిన తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వ కళావైభవాన్ని సంతరించుకుంది. అంతేకాదు ఇప్పుడిప్పుడే జిహాదీల చీకటియుగం నుంచి ప్రజలు బయటపడుతున్నారు. నిజానికి అల్-నైమ్ (స్వర్గం) అనేది ట్రాఫిక్ సర్కిల్‌తో చక్కగా రౌండ్ స్క్వేర్లా నిర్మించబడిన బహిరంగ ప్రదేశం. అక్కడ ఒకవైపు అందమైన పౌంటైన్లతో మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు మరోవైపు చక్కటి రెస్టారెంట్లతో సందడిగా ఉండే ఆహ్లాదకరమైన ప్రదేశం. కానీ ఇప్పటికీ సిరియావాసులకు ఆ ప్రదేశం వద్దకు రాగానే తాము అనుభవించిన నరకం, భయానక దృశ్యాలే కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) -
టీనేజ్‌లో తప్పటడుగు.. ఎట్టకేలకు యూకేకు?!
లండన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లో చేరి ప్రస్తుతం సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న షమీమా బేగం ఎట్టకేలకు యూకేలో అడుగుపెట్టనుంది. తన పౌరసత్వాన్ని రద్దు చేసిన బ్రిటన్ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధంకానుంది. ఈ మేరకు యూకే కోర్టు(కోర్ట్ ఆఫ్ అప్పీల్) గురువారం షమీమాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉత్తర సిరియాలో ఆశ్రయం పొందుతున్న ఆమె స్వదేశానికి తిరిగి వచ్చేందుకు, స్పెషల్ ఇమ్మిగ్రేషన్స్ అప్పీల్స్ కమిషన్ ముందు పౌరసత్వం గురించి తన వాదన వినిపించేందుకు అర్హురాలేనని స్పష్టం చేసిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన యూకే ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా షమీమా పౌరసత్వం పునరుద్ధరించలేమని, ఆమెను దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు తమను నిరాశకు గురిచేసిందని, అప్పీలుకు వెళ్లేందుకు అనుమతి కోరుతామని హోం ఆఫీస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (చదవండి : పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. గర్భిణిగా!) అసలేం జరిగిందంటే... బంగ్లాదేశ్- బ్రిటీష్ పౌరసత్వం కలిగిన షమీమా బేగం(20).. లండన్‌లోని బెత్నల్ గ్రీన్ అకాడమీలో చదువుకునేది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె ఐఎస్ సిద్ధాంతాలు, వీడియోల పట్ల ఆకర్షితురాలై.. పదిహేనేళ్ల వయసులో 2015లో తన తోటి విద్యార్థులు ఖతీజా సుల్తానా, అమైరా అబేస్‌లతో కలిసి లండన్ నుంచి సిరియాకు పారిపోయింది. పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పి పరారైన వీరు మొదట టర్కీకి వెళ్లి... అక్కడి నుంచి సిరియాలో ఐఎస్‌కు పట్టు ఉన్న రాకాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాకా చేరిన పది రోజుల తర్వాత అక్కడే ఇస్లాం స్వీకరించిన ఓ డచ్ వ్యక్తి(27)ని షమీమా పెళ్లి చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులైంది. సరైన తిండిలేక, పోషకాహార లోపం వల్ల రెండుసార్లు గర్భవిచ్చిత్తి కావడంతో శారీరంగా బలహీనపడిపోయింది.(‘నా కూతురిని బ్రిటన్‌కు తీసుకురావాల్సిందే..’) నన్ను రానివ్వండి ప్లీజ్.. ఈ నేపథ్యంలో ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునే క్రమంలో స్థానిక కుర్దిష్ వర్గాలు ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించాయి. దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 2019లో షమీమా కూడా వారికి చిక్కడం, ఆమె భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. అయితే అప్పటికే నిండు గర్భిణిగా ఉన్న ఆమె శరణార్థి శిబిరంలోకి చేరుకుంది. అప్పటికే పూర్తిగా నీరసించిన పోయిన షమీమా.. తప్పు తెలుసుకున్నానని, ఐసిస్ ఓడిపోతోందని, కాబట్టి తనకు పుట్టబోయే అయినా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అంతర్జాతీయ మీడియా వేదికగా తనను బ్రిటన్ వచ్చేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆమె అభ్యర్థనను తిరస్కరించిన బ్రిటన్.. తమ పౌరుల భద్రతా కారణాల దృష్ట్యా పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. కాగా అప్పటికే షమీమాకు పుట్టిన బిడ్డ నిమోనియాతో మరణించడంతో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. షమీమాను అరెస్టు చేయవచ్చు! ఇక పౌరసత్వ విషయంపై షమీమా తరఫున ఆమె లాయర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఆమెకు బ్రిటీష్- బంగ్లాదేశ్ ద్వంద్వ పౌరసత్వాలు ఉన్నందున ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించగా తాజాగా షమీమా యూకేకు వచ్చేందుకు అనుమతినిచ్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ బేగం వల్ల జాతీయ భద్రతకు భంగం వాటిల్లుతుందనే వాదనతో పరిగణనలోకి తీసుకుంటాం. అయితే పౌరసత్వం విషయంలో స్పెషల్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ కమిషన్ ముందు హాజరై, అప్పీలు చేసుకోవడమే ఆమె ముందున్న ఏకైక మార్గం. కాబట్టి ఆమెను యూకేలో అడుగుపెట్టేందుకు అనుమతినివ్వాలి’’అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేయడం సహా విచారించవచ్చని తెలిపింది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పు తమను నిరాశకు గురిచేసిందని, ఈ విషయంపై అప్పీలుకు వెళ్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కోర్టు తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు అమలైనా ప్రస్తుత పరిస్థితుల్లో సిరియా నుంచి ఆమె యూకే చేరుకోవడం అసాధ్యంతో కూడుకున్న పనే. -
నాన్నా.. ఎందుకలా నవ్వుతున్నావు?!
చిన్నారి సల్వా మరికొన్నాళ్లు.. పూర్తిగా ఊహ వచ్చేవరకు.. తండ్రి చెప్పిన అబద్ధాన్ని నిజం అని నమ్ముతూ హాయిగా నవ్వుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక అమాయకపు నవ్వు చాలదా.. పెద్దలు.. తాము ఆడుతున్న యుద్ధం అనే ఆటను ఆపేయడానికి! సల్వాకు మూడేళ్లు. ఆమె తండ్రి అబ్దుల్లా అల్–మొహమ్మద్. ఆ కుటుంబం సిరియాలోని ఇద్లిబ్ పట్టణంలో ఉంటోంది. ఉండటం కాదు. అదే వారి ఊరు. అదే వారి దేశం. సిరియాలో పదకొండేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఉన్నది రెండు కోట్ల జనాభా. బాంబులు, ఫిరంగుల దాడులలో ఇప్పటివరకు 3 లక్షల 70 వేల మందికి పైగా చనిపోయారు. ఇంటి పైకప్పులో ప్రాణాలు పెట్టుకుని నిద్ర లేస్తున్నారు బతికున్న సిరియన్లు. ఎప్పుడు ఏ బాంబు, ఏ ఫిరంగి నెత్తిపైన వచ్చిపడుతుందో తెలియదు. రోజూ గుప్పెడు మందైనా విగత జీవులై అరిచేతులు తెరుస్తున్నారు. చనిపోయిన వారిలో 13 వేల మందికి పైగా స్త్రీలు, 21 వేల మందికి పైగా చిన్నారులు. యుద్ధం ఇప్పట్లో ఆగేటట్లు లేదు. ప్రభుత్వాన్ని దించేందుకు పౌరులు, ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు సిరియా ప్రభుత్వ స్నేహ దేశాలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే పట్టుకుని శరణార్థులుగా వెళ్లిపోతున్నాయి సాధారణ సిరియన్ కుటుంబాలు. (ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!!) అయితే అబ్దుల్లా అల్-మొహమ్మద్ కుటుంబం మాత్రం ఇద్లిబ్ నుంచి కదలడం లేదు. ఏ క్షణాన గూడు కూలిపోతుందో తెలియదు. అయినా.. అక్కడే, ఆ ఇంట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశంలో విమానం ఉరిమిన ప్రతిసారీ ఇళ్లలోని చిన్నారులు ఉలిక్కిపడుతున్నారు. ఫిరంగులు వచ్చి గోడలకు చిల్లులు కొడుతున్నప్పుడు అమ్మానాన్నని హత్తుకుపోతున్నారు. సల్వా కూడా మొదట్లో ఆ శబ్దాలకు గుక్కపట్టి ఏడ్చేదే కానీ.. అబ్దుల్లా తన కూతురు భయపడకుండా ఉండటం కోసం ఓ ట్రిక్ కనిపెట్టాడు. బాంబు పడిన శబ్దం చెవుల్ని తాకగానే ఆయన పెద్దగా నవ్వేవాడు. ఇంటి గోడకు వచ్చి ఫిరంకి తగిలినప్పుడూ అంతే. పెద్ద నవ్వు. ‘‘ఎందుకు నాన్నా నవ్వుతున్నావ్?’ అని అడిగింది ఓ రోజు సల్వా.‘‘బయట పిల్లలెవరో ‘ఢాం’ అని పేలుస్తున్నారు. ఆ చప్పుళ్లకు నవ్వొస్తోంది’’ అని చెప్పాడు. ఇక అప్పట్నుంచీ బాంబు పడితే సల్వా కూడా నవ్వడం మొదలు పెట్టింది. అలా ఇద్దరూ నవ్వేవారు. ముఖాలు చూసుకుంటూ నవ్వేవారు. అదిప్పుడు ఆ తండ్రీ కూతుళ్లకు ఒక ఆట అయింది. రోజూ అంతే. ‘‘ఆ చప్పుడేంటో చెప్పుకో! అది విమానం విడిచిన బాంబా? ఫిరంగా?’’ అని తండ్రి కూతుర్ని అడుగుతాడు. ‘ఆ.. అది ఫిరంగి’ అంటుంది కూతురు.. పెద్దగా ఆలోచించకుండానే. చివరికి ఎలాగైందంటే.. విమానం కనిపిస్తే చాలు, సల్వా నవ్వడానికి సిద్ధం అయిపోయేది. ‘సల్వా బేటా.. విమానం ఎందుకు వస్తుంది?’’ అని అడుగుతాడు తండ్రి. ‘‘మనల్ని నవ్వించడం కోసం’’ అంటుంది కూతురు. (ఎవరిదీ పాపం; కన్నీరు పెట్టిస్తున్న ఫొటో! ) సల్వాకు ఏడాది వయసున్నప్పుడు ఇంటి బయట ఎవరో ‘ఈద్’కి బాణాసంచా కాలుస్తుంటే ఆ పేలుడుకి, కళ్లు జిగేల్మనిపించే నిప్పురవ్వలకు భయపడి పెద్దగా ఏడ్చేసింది. అప్పుడే చెప్పాడు అబ్దుల్లా.. అవి పిల్లలు ఆడుకునే ఆటలని. వాటికి భయపడకూడదని. నవ్వాలని. బాంబుదాడుల గురించి ఇప్పుడూ అదే చెబుతున్నాడు. సల్వా నమ్ముతోంది. నవ్వుతోంది. ఒక్కోసారి.. దూరాన్నుంచి బాంబు శబ్దాన్ని తనే ముందు పసిగట్టి.. ‘అబ్బాజాన్.. బాంబు పడబోతోంది, నవ్వడానికి సిద్ధంగా ఉండు’ అని తండ్రికే చెబుతోంది! వెంటనే కూతుర్ని దగ్గరకు తీసుకుని నవ్వుతాడు. నిజమేమిటో తెలిసీ, నిజమేమిటో తెలియని కూతురితో కలిసి నవ్వుతాడు. వీళ్లిలా నవ్వుతున్నపుడు కుటుంబ సభ్యులు తీసిన వీడియో ఇప్పుడు ప్రపంచం గుండెను బరువెక్కిస్తోంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 1997లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే ఇటాలియన్ సినిమా వచ్చింది. కామెడీ డ్రామా. మూడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల చేతికి చిక్కిన ఒక యూదు కుటుంబంలోని తండ్రీ కొడుకుల కథ అది. నిర్బంధ శిబిరాలలో కళ్లముందు జరుగుతున్న ఘోరాలకు కొడుకు బెదిరిపోకుండా ఉండడం కోసం.. అదంతా ఊరికే నవ్వు తెప్పించడానికి చేస్తున్నారని కొడుకుని నమ్మిస్తాడు. చివరి సీన్లో ఆ చిన్నారి.. చాటుగా ఉండి చూస్తున్నప్పుడు.. నాజీ సైనికులు తన తండ్రిని గోడచాటుకు తీసుకెళ్లడం కనిపిస్తుంది. తండ్రి వెనక్కి తిరిగి కొడుకువైపు చూసుకుంటూ వెళుతూ కన్ను కొడతాడు.. ఇదంతా ఆటలో భాగమే అన్నట్లు. తండ్రి అలా కనుమరుగు కాగానే తుపాకీ చప్పుళ్లు వినిపిస్తాయి. ప్రేక్షకులకు అర్థమౌతుంది. అతడిని చంపేశారని. కళ్లలోంచి నీళ్లు వస్తుండగా.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది మనకు.. అంత మంచి డైరెక్టర్ ఉన్నందుకు. ఇప్పుడూ అనిపించి తీరుతుంది. అబ్దుల్ అనే ఇంతమంచి తండ్రి ఉన్నందుకు. అయితే జీవితంలోని అందం మాత్రం.. చిన్నారుల అమాయకత్వంలోని నమ్మకమే. -
‘విషాదంలోనూ సంతోషం వెదుక్కుంటున్నారు’
-
ఈ దృశ్యాలు గుండెను బరువెక్కిస్తున్నాయి!
బీరుట్: ఉగ్రమూక ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) బాంబుల మోతతో నిరంతరం దద్దరిల్లే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐసిస్- సిరియన్ కుర్దిష్ దళాల ఆధిపత్య పోరులో ముఖ్యంగా చిన్నారులు ఎన్నో దురవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రతీకార దాడుల్లో ధ్వంసమయ్యే భవనాలతో పాటు వారి బాల్యం కూడా శిథిలమవుతోంది. ఇందుకు అద్దం పట్టే ఫొటోలు ఎన్నెన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రపంచాన్ని కన్నీరు పెట్టించాయి.(ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!!) తాజాగా ఓ సిరియన్- తండ్రీ కూతుళ్లకు సంబంధించిన వీడియో ఒకటి మరోసారి నెటిజన్ల హృదయాల్ని మెలిపెడుతోంది. బాంబు దాడులు, యుద్ధవిమానాల శబ్దాన్ని కూడా ‘నవ్వులాట’గా మార్చి కూతురిని సంతోషపెడుతున్న దృశ్యాలు మనసులను ద్రవింపజేస్తున్నాయి. బాంబు పేలిన తర్వాత.. మనం నవ్వాలి అంటూ తండ్రి.. తన చిన్నారి కూతురికి చెప్పటం.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నవ్వడం.. ఇదంతా చాలా సరదాగా ఉంది కదా మాట్లాడుకోవడం.. ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి.. ‘‘విషాదంలోనే సంతోషం వెదుక్కుంటున్న తండ్రీకూతుళ్లను సిరియాలో మాత్రమే చూడగలుగతాం. ఈ దృశ్యాలు గుండెను బరువెక్కిస్తున్నాయి. కనీసం ఈ చిన్నారి బాల్యం అయినా ఆనందంగా గడిస్తే బాగుండు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(ఎవరిదీ పాపం; కన్నీరు పెట్టిస్తున్న ఫొటో! ) -
‘వాళ్లు బానిసలు.. నేను అమరుడినవుతా’
లండన్: ఆత్మాహుతి దాడికి పాల్పడతానంటూ దక్షిణ లండన్ వీధుల్లో కత్తితో ఇద్దరిని గాయపరిచిన సుదేశ్ అమ్మన్(20) అనే వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన సుదేశ్ రెండు రోజుల క్రితమే విడుదలయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం నకిలీ ఆత్మాహుతి దాడి జాకెట్ ధరించి.. బాటసారులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ మధ్య వయస్కుడు, 20 ఏళ్ల యువతి గాయపడ్డారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) సానుభూతి పరుడిగా ఉన్న సుదేశ్ అమ్మన్‌ను 2018 డిసెంబరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోన్లో జరిపిన సంభాషణలు, చాట్స్ ఆధారంగా అతడిని అదే ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా తాను త్వరలోనే ఆత్మాహుతి దాడికి పాల్పడి.. అమరుడిగా మిగిలిపోతానని స్నేహితులకు చెప్పడం సహా అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను.. ఆమె తల్లిదండ్రులను తల నరికి చంపేలా ప్రోత్సహించడం వంటి మెసేజ్‌లు, సిరియాలోని యాజాదీ మహిళలు ఐసిస్ బానిసలు అని.. వారిపై సామూహిక అత్యాచారం చేసేందుకు తాను ఓ బృందాన్ని తయారు చేస్తున్నా అంటూ సోదరుడికి పంపిన ఫొటోలు, లండన్‌లోని తన ఇంట్లో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు గుర్తించారు. నేరం నిరూపితమైన క్రమంలో స్థానిక కోర్టు అతడికి శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అతడు జైలు నుంచి విడదలయ్యాడు. అయితే పోలీసులు సుదేశ్‌పై నిఘా ఉంచి.. రెండు రోజులుగా అతడిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మాహుతి జాకెట్ ధరించి.. దక్షిణ లండన్‌లోని వీధుల్లో కత్తితో సంచరిస్తున్న సుదేశ్‌ను గుర్తించారు. అతడు కత్తితో దాడులకు తెగబడిన క్రమంలో కాల్పులు జరిపారు. కాగా అతడి శవాన్ని పరిశీలించగా.. అతడు వేసుకున్నది నకిలీ జాకెట్ అని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. -
'అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం'
బీరుట్: ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. గత వారం సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఐసిస్ కొత్త ఛీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్ హష్మీని నియమించినట్లు ఆడియో రూపంలో వెల్లడించింది. అలాగే ఉత్తర సిరియా ప్రాంతంలో ఆదివారం కుర్దు సేనలతో కలిసి అమెరికా జరిపిన దాడుల్లో అల్ బాగ్దాదీ అత్యంత సన్నిహితుడు, సంస్థ అధికార ప్రతినిధి హసన్ అల్ ముజాహిర్ కూడా మృతి చెందినట్లు ఆడియో సందేశంలో పేర్కొంది. అయితే ఆడియోలో మాట్లాడిన అబూ హమ్జా అల్ ఖురేషీ ‘ఎక్కువ సంతోషించకండి’ అంటూ అమెరికాకు ఒక హెచ్చరికను జారీచేశాడు. త్వరలోనే బాగ్దాదీ చావుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆడియోలో స్పష్టం చేశారు. గత వారం ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకొని జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఎనిమిది హెలికాప్టర్లను ఉపయోగించి అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో 90 నిమిషాలు పాటు ఈ దాడులు జరిపినట్లు అమెరికా రిలీజ్ చేసిన వీడియోలో బహిర్గతమయింది. -
బాగ్దాదీ హతం: ఫొటోలు, వీడియో విడుదల
వాషింగ్టన్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని తమ సేనలు మట్టుబెట్టిన తీరు అభినందనీయమని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ అన్నారు. బాగ్దాదీని హతం చేసే క్రమంలో సాధారణ పౌరులెవరూ గాయపడకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. సిరియాలో మారణహోమం సృష్టించి.. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన బాగ్దాదీని అగ్రరాజ్య సైన్యం ఆదివారం అంతమొందించిన విషయం తెలిసిందే. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ తలదాచుకున్న బాగ్దాదీని అమెరికా సేనలు చుట్టుముట్టడంతో.. తనను పేల్చుకుని అతడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తునాతునకలైన శరీర భాగాల నుంచి డీఎన్ఏను ఘటనాస్థలిలోనే సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు అది బాగ్దాదీ మృతదేహమేనని ధ్రువీకరించారు. అనంతరం ఒసామా బిన్‌లాడెన్ తరహాలోనే బాగ్దాదీ శరీర భాగాలను సముద్రంలో కలిపేశారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!) ఇక బాగ్దాదీ చేతుల్లో చిత్రహింసలు అనుభవించి హత్యగావించబడిన అమెరికా మానవహక్కుల కార్యకర్త కైలా ముల్లర్ పేరిట చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పెంటగాన్ గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ ఫ్రాంక్ మెకెంజీ మాట్లాడుతూ... ‘ బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటలిజెన్స్ వర్గాలు కీలకంగా వ్యవహరించాయి. అతడు తలదాచుకున్న చోటును కచ్చితంగా కనిపెట్టగలిగాం. పక్కా ప్లాన్ ప్రకారం అతడి ఇంటిని చుట్టుముట్టి ప్రత్యేక బృందాల సహాయంతో అంతమొందించాం. ఇందులో హెలికాప్టర్ దాడులు ప్రముఖమైనవి. అవి సిరియాకు చేరుకున్న అనంతరం ఆపరేషన్ మరింత కఠినతరంగా మారినట్లు అనిపించింది. అయితే లక్ష్యాన్ని పక్కాగా ఛేదించడం(బాంబులు వేయడం)లో ఆ రెండు హెలికాప్లర్టు సఫలీకృతమయ్యాయి. సాధారణ పౌరులెవరూ గాయపడకుండా జాగ్రత్త వహించాయి. ఇంటలెజిన్స్, అమెరికా సైన్యం సహాయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశాం. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన ఉగ్రవాదిని సమూలంగా నాశనం చేశాం’ అని పేర్కొన్నారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!) -
ఎవరిపై.. ఎప్పుడు దాడిచేస్తామో తెలీదు: అమెరికా
వాషింగ్టన్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని హతమార్చి ఐసిస్ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీచేశామని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ అన్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పక్కా పథకం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయువ్య సిరియాలో అమెరికా సైన్యం బాగ్దాదీని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అమెరికా మానవ హక్కుల కార్యకర్త కైలా ముల్లర్ పేరిట చేపట్టిన రహస్య ఆపరేషన్‌లో అమెరికా సేనలు బాగ్దాదీని అంతం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మార్క్ మాట్లాడుతూ.. పాశవిక దాడులు, హత్యలకు.. నరమేధానికి కారణమైన బాగ్దాదీని హతం చేసే క్రమంలో ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు. బాగ్దాదీ అంతం తర్వాత కూడా సిరియాలో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని.. కొన్ని బాహ్య శక్తులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘సిరియాలో ఐసిస్‌ను ఓడించేందుకు 2014 నుంచి ప్రయత్నించాం. ఇందులో భాగంగా ఐసిస్ చర్యలకు అడ్డుకట్ట వేయడంతో అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో కొన్ని రోజుల క్రితం అమెరికా సేనలు వెనక్కి వచ్చాయి. అయితే ఏరివేయగా అక్కడ మిగిలిపోయిన కొంతమంది ఉగ్రవాదులు మరోసారి విధ్వంసానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సిరియన్ డెమొక్రటిక్ బలగాలు మాకు సహకరించాయి. దీంతో వాయువ్య సిరియాలో మేము పట్టుబిగించాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!) ఇక బాగ్దాదీ హతమైన నేపథ్యంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ అలెగ్జాండర్ మిల్లీ మాట్లాడుతూ... బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటలెజిన్స్, రక్షణ శాఖలు సమన్వయంతో పనిచేశాయని పేర్కొన్నారు. టర్కీ బార్డర్లో ఉన్న ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో బాగ్దాదీ జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ‘ ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు అమెరికా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వాటిని విడుదల చేయలేము. డీక్లాసిఫికేషన్(డాక్యుమెంటేషన్ ప్రాసెస్) చేసిన తర్వాత భవిష్యత్తులో అవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికా సైన్యం లక్ష్యం ఎక్కడున్నా.. ఎంత దుర్భేద్యమైనది అయినా దానిని ఛేదించడంలో ఏమాత్రం తడబడదు. టార్గెట్‌ను కొట్టి తీరుతుంది. మా దగ్గర ఎంతో గొప్పదైన సైన్యం ఉంది. ఎవరిపైనైనా.. ఎక్కడి నుంచైనా.. ఏ సమయంలోనైనా మేము దాడి చేయగలం. కాబట్టి ఉగ్రవాదులంతా అప్రమత్తంగా ఉండండి’ అని హెచ్చరించారు. అదే విధంగా సిరియాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు సిరియన్ డెమొక్రటిక్ బలగాలతో తాము కలిసి పనిచేస్తూనే ఉంటామని మిల్లే స్పష్టం చేశారు. -
ఐసిస్ చీఫ్ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!
వాషింగ్టన్ : సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు మట్టుబెట్టిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఉగ్రమూక నాయకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తనతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా బాంబులతో పేల్చివేశాడు. బాగ్దాదీ చేతిలో దారుణ అత్యాచారానికి గురై హత్య చేయబడిన అమెరికా సామాజిక వేత్త కైలా ముల్లర్ పేరిట... అమెరికా చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌లో సైన్యంతో పాటు సైనిక జాగిలాలు కూడా కీలక పాత్ర పోషించాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని పరిష గ్రామంలో తలదాచుకున్న బాగ్దాదీని వెంటాడాయి. అమెరికా ఆర్మీకి చెందిన 75వ రేంజర్ రెజిమెంట్ బలగాలతో పాటు కొన్ని శునకాలు కూడా బాగ్దాదీని వేటాడాయి. దీంతో దిక్కుతోచని బాగ్దాదీ తన ఇంటి లోపల గల రహస్య మార్గం గుండా పరుగులు తీస్తూ, కేకలు వేస్తూ శరీరానికి చుట్టుకున్న సూసైడ్ జాకెట్ పేల్చుకుని తనను తాను అంతం చేసుకున్నాడు.(చదవండి : క్రూరంగా అత్యాచారం చేశాడు.. అందుకే ఆ పేరు..) ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ తమ సైన్యం చేతిలో ఐసిస్ చీఫ్ కుక్కచావు చచ్చాడని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేకాదు అతడిని వెంటాడంలో అమెరికా సైనిక కే9 శునకాలు కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు. ఇక బాగ్దాదీని తరిమిన శునకం గాయపడటంతో దాని వివరాలను పెంటగాన్ గోప్యంగా ఉంచింది. కేవలం అది బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినదని, మెరుపు వేగంతో పరిగెత్తి శత్రువులను వెంటాడగలదని మాత్రమే పేర్కొంది. అయితే ట్రంప్ మాత్రం తమ వీర శునకం గురించి మాట్లాడుతూ... ‘ మా కెనైన్.. కొంతమంది దానిని కుక్క అంటారు.. మరికొంత మంది అందమైన కుక్క అంటారు... ఇంకొంత మంది ప్రతిభావంతమైన కుక్క అంటారు... తను గాయపడింది. ప్రస్తుతం దానిని వెనక్కి తీసుకువచ్చాం’ అని పేర్కొన్నారు. అయితే మంగళవారం మాత్రం దాని పేరు చెప్పకుండా కేవలం ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘ ఆ అందమైన శునకం ఫొటో ఇది. ఐసిస్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని పట్టుకోవడంలో, అతడిని హతమార్చడంలో కీలక పాత్ర పోషించింది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో 2011లో ఒసామా బిన్ లాడెన్‌ను తరిమిన కైరో అడుగుజాడల్లో కెనైన్ నడిచి మరో ఉగ్రవాదిని హతం చేయడంలో కీలకంగా వ్యవహరించిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!) We have declassified a picture of the wonderful dog (name not declassified) that did such a GREAT JOB in capturing and killing the Leader of ISIS, Abu Bakr al-Baghdadi! pic.twitter.com/PDMx9nZWvw — Donald J. Trump (@realDonaldTrump) October 28, 2019 -
క్రూరంగా అత్యాచారం చేశాడు.. అందుకే ఆ పేరు..
వాషింగ్టన్ : ‘అతడు హీరోలా కాదు. ఓ పిరికిపందలా ఏడుస్తూ.. భయంతో కేకలు వేస్తూ చచ్చాడు’ . సిరియాలో నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్- బాగ్దాదీని అగ్రరాజ్య సైన్యాలు మట్టుబెట్టిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్య ఇది. తమ సైన్యానికి చెందిన కుక్కలు వెంబడించడంతో ఓ టన్నెల్లోకి పరిగెత్తిన బాగ్దాదీ తనను తాను పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. బాగ్దాదీపై దాడి చేసి రాత్రి వేళలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య తమ సైన్యం అతడిని హతం చేసిందని పేర్కొన్నారు. కాగా సిరియాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన ఐఎస్ ఉగ్రమూక చీఫ్ బాగ్దాదీని అంతమొందించడానికి అమెరికా ఐదేళ్లుగా వేచిచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పక్కా ప్లాన్‌తో బాగ్దాదీని హతమార్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక బాగ్దాదీపై తమ సైనికులు విరుచుకుపడిన తీరును ట్రంప్ సహా అమెరికా భద్రతా సంస్థ సీనియర్ అధికారులు సిట్యూవేషన్ రూంలో నుంచి ప్రత్యక్షంగా వీక్షించినట్లు సమాచారం. రెండు రోజుల ముందే స్కెచ్ వేసి... పిల్లలు, మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన బాగ్దాదీని చంపే ఆపరేషన్‌కు అమెరికా అధికారులు కైలా ముల్లర్ అని నామకరణం చేశారు. సిరియాలో పనిచేస్తున్న సమయంలో అమెరికా సామాజిక కార్యకర్త కైలాను బాగ్దాదీ కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెపై అత్యంత క్రూరంగా అనేకమార్లు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌కు కైలా మ్యూలర్ అని పేరుపెట్టిన అధికారులు గురువారం నుంచే బాగ్దాదీని హతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంలోనూ సఫలీకృతమయ్యారు. శుక్రవారం తన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ వివాహ వార్షికోత్సవాన్ని జరపడం కోసం ట్రంప్ క్యాంప్ డేవిడ్‌కు వెళ్లారు. అనంతరం వెంటనే వర్జీనియాకు పయనమై మిలిటరీ ఆపరేషన్స్‌కు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించారు. తర్వాత బేస్‌బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆపరేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తైంది. సీక్రెట్ ఆపరేషన్ సాగిందిలా.. ఆదివారం వేకువ జామున అమెరికా సైన్యానికి చెందిన ఎనిమిది హెలికాప్టర్లు ఉత్తర ఇరాక్ నుంచి బయల్దేరాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో బాగ్దాదీ ఉన్నాడన్న సమాచారంతో మిడిల్ ఈస్ట్‌లో ప్రవేశించాయి. ఇరాక్, టర్కీ, రష్యా అధికారులతో సమన్వయమై ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలేవీ చెప్పకుండానే గగనతలాన్ని అదుపులోకి తెచ్చుకోవాలని అమెరికా అధికారులు సూచించారు. బాగ్దాదీ ఉన్న ప్రాంతానికి చేరుకోగానే అమెరికా సైన్యానికి చెందిన రోటార్ సీహెచ్-47 విమానాలు రెండు అల్- అసద్ ఎయిర్‌బేస్ కేంద్రంగా బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో తన చావు ఖాయమని భావించిన బాగ్దాదీ తమ అండర్ గ్రౌండ్ బంకర్లలోకి వెళ్లి తల దాచుకున్నాడు. అంతేకాదు అమెరికా సైనికులు తనను సమీపిస్తున్న క్రమంలో ఆత్మాహుతి దాడి జాకెట్ ధరించి ముగ్గురు అమాయక పిల్లల్ని తన వెంట తీసుకువెళ్లాడు. అయితే అమెరికా సైన్యానికి చెందిన జాగిలాలు బాగ్దాదీని వెంబడించడంతో బంకర్ టన్నెల్ చివరికి చేరగానే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో బాగ్దాదీతో పాటు ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!) చచ్చింది అతడే.. బంకర్ పేలిపోవడంతో బాగ్దాదీ హతమైనట్లు గుర్తించిన అమెరికా సైన్యం.. చనిపోయింది బాగ్దాదీ అన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు అతడి ఆనవాళ్లు సేకరించారు. ముక్కలైన మృతదేహం నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్ఏ సేకరించి పరీక్షించగా అది బాగ్దాదేనన్న విషయం స్పష్టమైంది. ఈ విషయం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ చచ్చింది అతడే. 15 నిమిషాల్లోనే ఫోరెన్సిక్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత బాగ్దాదీని మట్టుబెట్టి మా సైనికులు ఐసిస్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని, ఉగ్రవాదుల తదుపరి ప్రణాళికల గురించి వివరాలు సేకరించారు’ అని పేర్కొన్నారు. కాగా అమెరికా సైన్యం సిరియాలో బాగ్దాదీని అంతం చేసిన వెంటనే అమెరికా ఫైటర్ జెట్లు ఆరు రాకెట్లను ఆకాశంలోకి వదిలి తమ విజయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఈసారి లీక్ అవ్వలేదు.. ఒసామా బిన్‌లాడెన్ తరహాలోనే బాగ్దాదీని కూడా అంతమొందించామన్న ట్రంప్ ఈసారి మాత్రం తమ ప్రణాళికలు ఏమాత్రం బయటకు పొక్కలేదని వ్యాఖ్యానించారు. ‘ వాషింగ్టన్ లీకింగ్ మెషీన్. అయితే ఇప్పుడు లీకులు బయటికి రాలేదు. నేను రచించిన వ్యూహం కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది అమెరికా అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు. ఇక బాగ్దాదీని హతం చేయడం పట్ల ట్రంప్ మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉగ్రవాదిని అంతమొందించి అమెరికాను సురక్షితంగా ఉంచడంలో సఫలమయ్యారు’ అంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ఐసిస్ వంటి క్రూరమైన ఉగ్రమూకను నడిపిస్తున్న బాగ్దాదీని మట్టుబెట్టి అమెరికా ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక జారీ చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు ట్రంప్ ఎన్నికల వ్యూహంలో ఇదొక ఎత్తుగడ అని.. అందుకే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఆపరేషన్ నిర్వహించారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కాగా 2020లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. -
ఐసిస్ చీఫ్ హతం
-
ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!
బాగ్దాద్ : సిరియాలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్-అల్- బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అతడి ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారమే తోడ్పడిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు. సిరియాను నరకప్రాయం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వేళ్లూనుకుపోయిన ఉగ్రమూక ఐఎస్ చీఫ్‌ను అమెరికా సేనలు ఆదివారం హతం చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు సహా వేలాది మంది సిరియన్లను దారుణంగా హతమార్చిన అబు బాకర్ బాగ్దాదీని తమ సైన్యం చుట్టుముట్టడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ వేలాది మంది ప్రాణాలను తీసింది. కానీ.. దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబు బాకర్‌ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్ వర్గాలు, రష్యా, టర్కీ తదితర మిత్రదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇరాక్ భద్రతా అధికారులు ఈ ఆపరేషన్‌లో అబు బాకర్ ప్రధాన అనుచరుడు ఇస్మాయిల్ అల్-ఇతావీ ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ) కూరగాయల బస్సుల్లో వెళ్లేవాడు.. అబు బాకర్ జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో అతడి ప్రధాన అనుచరుడు ఇతావీ 2018 ఫిబ్రవరిలో టర్కిష్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని ఇరాక్ సేనలకు అప్పగించారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా... ‘ఐదు ఖండాలలో తన ఉన్మాదంతో విధ్వంసం సృష్టించిన అబు బాకర్ ఎల్లప్పుడూ మినీ బస్సుల్లోనే తన సహచరులతో సమావేశమయ్యాడు. కూరగాయలతో నిండిన ఆ బస్సుల్లో వారంతా దొంగచాటుగా గమ్యస్థానాలకు చేరుకునేవారు. ఇస్లామిక్ సైన్సెస్‌లో పీహెచ్డీ చేసిన ఇతావీ అబు బాకర్ ఐదుగురు ముఖ్య అనుచరుల్లో ఒకడు. అతడు 2006లో ఉగ్ర సంస్థ ఆల్ ఖైదాలో చేరాడు. 2008లో అమెరికా సేనలకు పట్టుబడటంతో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో ఇతావీ గురించి తెలుసుకున్న అబు బాకర్ తమతో చేతులు కలపాల్సిందిగా అతడిని కోరాడు. ఈ క్రమంలో మత పరమైన సూచనలు ఇవ్వడంతో పాటు ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను ఎంపిక చేయడంలోనూ ఇతావీ కీలక పాత్ర పోషించేవాడు. ఇందులో భాగంగా 2017లో తన సిరియన్ భార్యతో కలిసి పూర్తిగా సిరియాకే మకాం మార్చాడు. అయితే 2018లో టర్కీ అధికారులకు అతడితో పాటు నలుగురు ఇరాకీలు, ఒక సిరియన్ చిక్కాడు. దీంతో వాళ్లను మాకు అప్పగించారు. అప్పుడే ఇతావీ మాకు బాగ్దాదీ గురించిన రహస్యాలన్నీ చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సిరియాలోని ఇడ్లిబ్ అనే ప్రాంతంలో అబు బాకర్ తల దాచుకున్నాడని మాకు తెలిసింది. అయితే ఇడ్లిబ్‌పై పట్టు కలిగి ఉన్న, ఐఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే మరో ఉగ్రసంస్థ నుస్రా ఫ్రంట్ అబు బాకర్‌ను చంపేందుకు వెంటపడటంతో.. అతడు తరచుగా వివిధ ప్రాంతాలకు పయనమయ్యేవాడు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు, ముగ్గురు అనుచరులను ఎల్లప్పుడూ వెంటబెట్టుకునేవాడని ఇతావీ తెలిపాడు. అదే విధంగా అతడు ఏయే సమయాల్లో ఏ చోట తల దాచుకుంటాడనే విషయాన్ని కూడా మాకు చెప్పాడు. దీంతో మేము అమెరికా భద్రతా సంస్థ సెంట్రల్ ఇంటలెజిన్స్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుని... ఇడ్లిబ్ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సైన్యాలను మోహరించాలని సూచించాం. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా సీఐఏ డ్రోన్స్, సాటిలైట్స్‌తో ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పుడు అబు బాకర్ హతమయ్యాడు అని ఇరాక్ అధికారులు వెల్లడించారు. -
ఎవరిదీ పాపం; కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!
నాలుగేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. ఉగ్రమూకల దాడులతో నిరంతరం అల్లకల్లోలంగా ఉండే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. తాజాగా.... ఆధిపత్యపు పోరులో బాల్యం ఎలా శిథిలమవుతుందో తెలిపే ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరియాలో ఐఎస్‌ను రూపుమాపి.. అక్కడి నుంచి తమ దళాలను వెనక్కి రప్పించామని.. అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డమాస్కస్, రష్యా సైనికులు మాత్రం నేటికీ సిరియాలో ఉగ్రమూకలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని అరిహా పట్టణంలో ఐసిస్ ఉగ్రవాదులు స్థానికుల ఇళ్లపై బాంబులతో దాడి చేస్తూ నాలుగు వారాలుగా ఎంతో మంది చిన్నారులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు జరిగిన ఘర్షణలో భాగంగా బుధవారం రాత్రి ఓ ఇంటిపై బాంబుల వర్షం కురిసింది. ఈ ఘటనలో తల్లి సహా ఓ చిన్నారి మరణించగా.. తండ్రి, ఐదుగురు పిల్లలు భవన శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఉగ్రమూకలకు భయపడి చాలా సేపటి వరకు ఎవరూ వారి దగ్గరకు రాలేదు. ఈ క్రమంలో ఐదేళ్ల రీహమ్ కింద పడుతున్న తన చిన్నారి చెల్లెలు టౌకా(ఏడు నెలలు) షర్టు పట్టుకుని ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు రీహమ్ మరణించగా.. తన చేతుల్లో ఉన్న టౌకా కిందపడిపోయింది. ప్రస్తుతం తండ్రి, ముగ్గురు తోబుట్టువులతో పాటు టౌకా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలను బషర్ అల్ షేక్ అనే స్థానిక వార్తా పత్రిక ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. చెల్లెలి ప్రాణాలు కాపాడేందుకు పరితపిస్తున్న రీహమ్ ప్రయత్నం, ఆనక ఆమె మరణించిన తీరు మానవత్వమున్న ప్రతీ ఒక్కరి మనస్సును కదిలిస్తోంది. -
అమానుషం; షమీమా కొడుకు చనిపోయాడు..!
డమాస్కస్ : ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లో చేరి ప్రస్తుతం సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న బ్రిటన్ పౌరురాలు షమీమా బేగం కొడుకు మరణించాడని ఎస్డీఎఫ్ ప్రతినిధి తెలిపారు. నిమోనియా కారణంగా అతడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసి అమానుషంగా ప్రవర్తించారంటూ బ్రిటన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 2015లో సిరియాకు పారిపోయి ఐఎస్‌లో చేరిన బంగ్లాదేశీ- బ్రిటీష్ టీనేజర్ షమీమా బేగం(19).. అక్కడే తన సహచరుడి(డచ్ పౌరుడు)ని పెళ్లి చేసుకుంది. ఐఎస్ ఉగ్రవాదులు ఏరివేతలో భాగంగా షమీమా భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకోవడంతో గర్భవతి అయిన తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని.. బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే షమీమా వల్ల పౌరుల భద్రతకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నందని పేర్కొంటూ షమీమా పౌరసత్వాన్ని బ్రిటన్ ప్రభుత్వం రద్దు చేసింది.(చదవండి : పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!) ఈ నేపథ్యంలో తనతో పాటు షమీమాను కూడా నెదర్లాండ్‌కు తీసుకువెళ్లాలని ఆమె భర్త భావించాడు. అయితే అక్కడి చట్టాల ప్రకారం మైనర్‌ను పెళ్లి చేసుకుంటే వారి వివాహం చెల్లదనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో షమీమా సిరియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి జరా అని నామకరణం చేసింది. అయితే పౌష్టికాహారం లోపం వల్ల బలహీనంగా పుట్టిన అతడు ప్రస్తుతం నిమోనియాతో మరణించడంతో బ్రిటన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఆశ్రయం లేకుండా చేయడం నేరం. ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయడం ద్వారా చిన్నారి చావుకు కారణమయ్యారు. ఇది చాలా అమానుష చర్య’ అని బ్రిటన్ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.(షమీమా సంచలన వ్యాఖ్యలు) ఈ విషయాలపై స్పందించిన బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి జావీద్ మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా విచారకరం. అయితే అక్కడి క్యాంపుల్లో చాలా మంది ఆశ్రయం పొందుతున్నారు. చనిపోయింది షమీమా కొడుకో కాదో తేలాల్సి ఉంది. ఉగ్రవాదం కారణంగా యుద్ధ జోన్లలో ఉన్న వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ పిల్లాడి మరణాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు’ అని హితవు పలికారు. కాగా కొన్ని రోజుల క్రితం.. షమీమా పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన జావీద్.. ఆమెకు పుట్టబోయే బిడ్డ ఏనాటికీ బ్రిటీష్ పౌరుడు కాలేదని వ్యాఖ్యానించారు.(చదవండి : ఇంటికి వెళ్లాలని ఉంది) ఇక తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను క్యాంపుల నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్డీఎఫ్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోన్నసంగతి తెలిసిందే. అయితే ఐసిస్ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్డీఎఫ్ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో షమీమా వంటి సిరియా రెఫ్యూజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. -
తప్పు చేశానేమో.. షమీమా సంచలన వ్యాఖ్యలు..
ఢాకా : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లో చేరినందుకు పశ్చాత్తాప పడుతున్న తన కూతురిని వెంటనే స్వదేశానికి తీసుకురావాలంటూ అహ్మద్ అలీ అనే వ్యక్తి బ్రిటన్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. బంగ్లాదేశీ- బ్రిటీష్ టీనేజర్ షమీమా బేగం(19).. 2015లో సిరియాకు పారిపోయి ఐఎస్‌లో చేరింది. అనంతరం అక్కడే తన సహచరుడిని పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) బలపడటంతో.. ఐఎస్ ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఈ క్రమంలో షమీమా భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఎస్డీఎఫ్ దళాల రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న షమీమా ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సిరియాలో పరిస్థితులు బాగాలేని కారణంగా బిడ్డతో సహా, తనను బ్రిటన్‌కు తీసుకువెళ్లాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో ఆమె వల్ల పౌరుల భద్రతకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నందున షమీమా పౌరసత్వాన్ని రద్దు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాను మీడియా ముందుకు వచ్చి తప్పు చేశానేమో అంటూ షమీమా సంచలన వ్యాఖ్యలు చేసింది.(పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!) కావాలంటే అక్కడే శిక్షించండి.. ఈ నేపథ్యంలో తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసిన షమీమా తండ్రి అహ్మద్ అలీ... ‘ షమీమా ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే తను బ్రిటీష్ పౌరురాలు. కాబట్టి ఆమెను స్వదేశానికి తీసుకురావాల్సిన బాధ్యత బ్రిటన్ ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ షమీమా తప్పు చేసి ఉంటే.. ఆమెని లండన్‌కు తీసుకువచ్చి అక్కడే శిక్షించండి. కానీ తన పౌరసత్వాన్ని రద్దు చేయడం సరైంది కాదు. తప్పు చేయని వారు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు. సిరియా వెళ్లినపుడు తన వయస్సు 15 ఏళ్లు. తప్పుడు వ్యక్తుల ప్రభావంతో తను అలా చేసింది. చిన్న పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మనదే. అందుకే తనను బ్రిటన్‌కు తీసుకురావాల్సిందే అని డిమాండ్ చేశారు. కాగా బ్రిటన్ నుంచి తిరిగివచ్చిన అహ్మద్ అలీ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారు. ఇక తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను క్యాంపుల నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్డీఎఫ్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోన్నసంగతి తెలిసిందే. అయితే ఐసిస్ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్డీఎఫ్ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో షమీమా వంటి సిరియా రెఫ్యూజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.(చదవండి : ఇంటికి వెళ్లాలని ఉంది) -
పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!
మొన్న లియోనారా... నేడు షమీమా బేగం.. సిరియాలోని డెమొక్రటిక్ క్యాంపుల్లో ఆవాసం పొందుతున్న.. ఇలాంటి ఇంకెందరో టీనేజర్లు స్వదేశానికి వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించాలంటే చట్టపరంగా, రాజకీయపరంగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముస్లిం రాజ్య స్థాపనే ధ్యేయంగా సిరియా, ఇరాక్లలో నరమేధం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు వీరు ఒకప్పటి సానుభూతి పరులు. తెలిసీ తెలియని వయస్సులో వేసిన తప్పటడుగు ఇప్పుడు వీరికి, వీరి సంతానానికి పెనుశాపంగా మారింది. వారిద్దరితో పాటు.. షమీమా బేగం బంగ్లాదేశీ- బ్రిటీష్ టీనేజర్(19). లండన్‌లోని బెత్నల్ గ్రీన్ అకాడమీలో చదువుకునేది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే షమీమా ఐఎస్ సిద్ధాంతాలు, వీడియోల పట్ల ఆకర్షితురాలై.. 2015లో తన తోటి విద్యార్థులు ఖతీజా సుల్తానా, అమైరా అబేస్‌లతో కలిసి లండన్ నుంచి సిరియాకు పారిపోయింది. ఈ విషయం అప్పట్లో లండన్ పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పి పరారైన ఈ ముగ్గురు మొదట టర్కీకి వెళ్లి... అక్కడి నుంచి సిరియాలో ఐఎస్‌కు పట్టు ఉన్న రాకాకు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఖతీజా ఐసిస్- కుర్దిష్ వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో చనిపోయింది. అమైరా ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఈ క్రమంలో రాకా చేరిన పది రోజుల తర్వాత అక్కడే ఇస్లాం స్వీకరించిన ఓ డచ్ వ్యక్తి(27)ని షమీమా పెళ్లి చేసుకుంది. అప్పటిదాకా బాగానే గడిచిన ఆమె జీవితం పెళ్లి తర్వాత దుర్భరంగా మారింది. సరైన తిండిలేక, పోషకాహార లోపం వల్ల రెండుసార్లు గర్భవిచ్చిత్తి కావడంతో షమీమా ఆరోగ్యం క్షీణించింది. లండన్‌లో అయితే నా బిడ్డ భద్రంగా ఉంటుంది.. ఇదిలా ఉండగా ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు.. స్థానిక కుర్దిష్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదనుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. షమీమా కూడా వారికి చిక్కడం, ఆమె భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. ఈ విషయం గురించి షమీమా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రస్తుతం నిండు గర్భిణిని. నాలుగేళ్ల క్రితంలా ఇప్పుడు నాది చిన్నపిల్లల మనస్తత్వం కాదు. బ్రిటన్ వెళ్తే కనీసం నాకు పుట్టబోయే బిడ్డ అయినా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నరకబడిన ఓ మనిషి తలను మా డస్ట్‌బిన్‌లో మొదటిసారి చూసినపుడు నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ వ్యక్తికి అదే సరైన శిక్ష అని భావించాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఐసిస్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. వారిలో నిజాయితీ లేదు కాబట్టి ఓడిపోయేందుకు వారు అర్హులు. ఇక కాలిఫేట్(ఐసిస్ స్థాపించాలనుకున్న రాజ్యం పేరు) స్థాపన అసాధ్యం’ అని తన అనుభవాలను చెప్పుకొచ్చింది.(ఇంటికి వెళ్లాలని ఉంది) ఇక్కడకు తీసుకొచ్చి శిక్షిద్దాం.. తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్డీఎఫ్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఐసిస్ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్డీఎఫ్ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు తీసుకువచ్చిన తర్వాత.. ఐసిస్‌కు ఒకప్పుడు మద్దతుగా నిలిచిన కారణంగా షమీమా వంటి వారిని శిక్షించినా ఫర్వాలేదు గానీ.. వారికిప్పుడు కనీస సాయం అందించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాల్లాస్ అభిప్రాయపడ్డారు. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఏదేమైనా టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లయితే లియోనారా, షమీమాలాగే మరికొంత మంది ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ‘ఐఎస్’ ఎక్కడో కాకుండా ప్రేమ రూపంలోనో, డబ్బు ఆశ చూపిస్తూనో అది మన వీధిలోనే మన పిల్లల కోసం వల పట్టుకుని తిరుగుతుండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది! -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
వారం రోజుల్లో అధికారిక ప్రకటన : ట్రంప్
వాషింగ్టన్ : సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను మరో వారం రోజుల్లో అంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా ఉగ్రవాదులను అంతమొందించాలనే తమ ఆశయం నెరవేరుతుందని పేర్కొన్నారు. వాషింగ్టన్లో బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రంప్ ప్రసంగించారు. సుమారు 70 దేశాల ప్రతినిధులో ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ‘ అమెరికా, దాని మిత్ర దేశాలతో పాటు సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ కృషి కారణంగా.. ఐఎస్ పాలనలో ఉన్న సిరియా, ఇరాక్‌లోని చాలా ప్రాంతాలు విముక్తి పొందాయి. చాలా కష్టంతో కూడుకున్న ఈ పనిని పూర్తి చేసేందుకు ఆర్థిక, సైనిక సహకారాలు అందించి సిరియాకు అండగా నిలిచారు. ఇది సమిష్టి కృషి. ఐఎస్ ఉనికిని సమూలంగా రూపుమాపుతాం. ఇందుకు సంబంధించి వారం రోజుల్లోగా అధికారిక ప్రకటన చేస్తాను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా సిరియా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు గతేడాది డిసెంబరులో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఐఎస్‌ను పూర్తిగా ఓడించిన కారణంగా సైనిక దళాలను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు..‘‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ ’ అని ఆయన ట్వీట్ చేశారు. -
ఇంటికి వెళ్లాలని ఉంది
టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లయితే లియోనారా లాగే మరికొంత మంది ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సి ఉంటుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ‘ఐఎస్’ ఎక్కడో ఉంటుందని అనుకోకండి. ప్రేమ రూపంలోనో, డబ్బు ఆశ చూపిస్తూనో అది మన వీధిలోనే మన పిల్లల కోసం వల పట్టుకుని తిరుగుతుండవచ్చు. ఇప్పుడు తెలుస్తోంది.. అవును ఇప్పుడే తెలుస్తోంది.. నేను పెద్ద తప్పు చేశాను... ఆ తప్పు దిద్దుకునే మార్గం కోసం రోజూ వెదుకుతూనే ఉన్నాను.. ఇంటికి వెళ్లాలని ఉంది.. పూర్వపు జీవితం గడపాలని ఉంది.. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) లో భాగమైన ఓ జర్మన్ యువతి ఆవేదన ఇది. ఉగ్రవాదికి మూడో భార్యగా ఉంటూ 19 ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారినందుకు తీరని వేదన అనుభవిస్తున్న ఆమె.. విముక్తి లభిస్తే స్వదేశానికి వెళ్తానంటూ పశ్చాత్తాపపడుతోంది. ఇస్లాం స్వీకరించి.. సిరియాకు లియోనారా జర్మనీకి చెందిన యువతి. పదిహేనేళ్ల ప్రాయంలో ఇస్లాం మతం స్వీకరించింది. ఆ తర్వాత అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న జర్మన్ జీహాదిస్టు మార్టిన్ లెమ్కే (28) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం అతడి కుటుంబంతో కలిసి సిరియాకు పారిపోయింది. అయితే... సిరియాను వశం చేసుకునేందుకు ఐఎస్ సాగిస్తున్న మారణకాండను కళ్లారా చూసేంతవరకు .. ఆ ఉగ్రమూక పట్ల ఆమెకు సానుభూతి వైఖరే ఉంది. కానీ ఎప్పుడైతే అంతర్యుద్ధంలో తన కుటుంబం భాగస్వామ్యమైందో అప్పుడే తాను ఎంత పెద్ద తప్పు చేశానన్న విషయం లియోనారాకు బోధపడింది.భర్త, ఇద్దరు సవతులతో కలిసి లియోనారా మొదట ఐఎస్ రాజధాని రాకాలో నివాసం ఉండేది. ఆ సమయంలో భర్త తనను కేవలం ఒక పనిమనిషిగానే చూసేవాడు. వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అందరికీ సపర్యలు చేయడం ఇదే ఆమె రోజు వారీ దినచర్య. అలా నాలుగేళ్లుగా గృహిణిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న లియోనారా.. ఇద్దరు పిల్లలకు తల్లయింది. తన ఇంట్లో తానే ఓ పనిమనిషిలా కాలం వెళ్లదీసింది. వారానికో ఇంట్లో నివాసం బహిరంగ శిరచ్ఛేదనలు, అత్యాచారాలతో సిరియా ప్రజలకు భీతికొల్పుతున్న ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు.. స్థానిక కుర్దిష్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిరియాలో ప్రజాస్వామ్య పాలనే లక్ష్యంగా... ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదనుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. మరోవైపు తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.ఈ క్రమంలో ఎస్డీఎఫ్ నుంచి తప్పించుకునేందుకు లియోనారా కుటుంబం వారానికో ఇంట్లో తలదాచుకునేది. అయితే ఆ సమయంలో ఐఎస్ వీరి గురించి పట్టించుకునేది కాదు. ఐఎస్ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వారి కంటే కుర్దిష్దళాలే నయమని భావించి లియోనారా.. భర్త, ఇద్దరుపిల్లలు, భర్త రెండోభార్యతో కలిసి ఎస్డీఎఫ్ క్యాంపునకు బయల్దేరింది. ఇందులో భాగంగా వారు ఇరాక్ సరిహద్దులోని బాగోజ్ గ్రామానికి చేరుకున్నారు. అయితే తూర్పు సిరియాలో గస్తీ కాస్తున్న అమెరికా మద్దతు దేశాల బలగాలు లియోనారా భర్త మార్టిన్‌ను గత గురువారం అదుపులోకి తీసుకున్నాయి. నా భర్త ఉగ్రవాది కాదు ‘నా భర్త కంప్యూటర్లు రిపేర్ చేసేవాడు. అదే విధంగా కంప్యూటర్ విడిభాగాలు, ఫోన్లు ఐఎస్‌కు సరఫరా చేసేవాడని మాత్రమే నాకు తెలుసు. ‘రాకా’ను కోల్పోయిన ఐఎస్ మమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలని చూసింది. తినడానికి తిండి ఉండేది కాదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే అలా చూస్తూ ఉండటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. టీనేజ్‌లో నేను చేసిన తప్పు నా పిల్లల పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు నా సొంత ఇంటికి వెళ్లాలని ఉంది’ అంటూ లియోనారా తన పరిస్థితి గురించి అంతర్జాతీయ మీడియా ముందు మొరపెట్టుకుంటోంది.అయితే లియోనారా భర్త ఐఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించేవాడని, వేలాదిమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి అతడే సూత్రధారి అని జర్మన్ మీడియా అంటోంది. ఏదేమైనప్పటికీ లియోనారా గనుక నిజంగా పశ్చాత్తాపడితే మాత్రం ఆమెను స్వదేశానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. – యాళ్ల సుష్మారెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అవును.. నేను పెద్ద తప్పే చేశాను.. కానీ ..’
ఇప్పుడు తెలుస్తోంది.. అవును ఇప్పుడే తెలుస్తోంది.. నేను పెద్ద తప్పు చేశాను... ఆ తప్పు దిద్దుకునే మార్గం కోసం రోజూ వెదుకుతూనే ఉన్నాను.. ఇంటికి వెళ్లాలని ఉంది.. పూర్వపు జీవితం గడపాలని ఉంది.. ఇది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో భాగమైన ఓ జర్మన్ యువతి ఆవేదన. ఉగ్రవాదికి మూడో భార్యగా ఉంటూ 19 ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారినందుకు తీరని వేదన అనుభవిస్తున్న ఆమె.. విముక్తి లభిస్తే స్వదేశానికి వెళ్తానంటూ పశ్చాత్తాపపడుతోంది. ఇస్లాం స్వీకరించి.. సిరియాకు పయనం లియోనారా జర్మనీకి చెందిన యువతి. పదిహేనేళ్ల ప్రాయంలో ఇస్లాం మతం స్వీకరించింది. ఆ తర్వాత అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న జర్మన్ జీహాదిస్టు మార్టిన్ లెమ్కే(28) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం అతడి కుటుంబంతో కలిసి సిరియాకు పారిపోయింది. అయితే... సిరియాను వశం చేసుకునేందుకు ఐఎస్ సాగిస్తున్న మారణకాండను కళ్లారా చూసేంతవరకు .. ఆ ఉగ్రమూక పట్ల ఆమెకు సానుభూత వైఖరే ఉండేది. కానీ ఎప్పుడైతే అంతర్యుద్ధంలో తన కుటుంబం భాగస్వామ్యమైందో అప్పుడే తాను ఎంత పెద్ద తప్పు చేశానన్న విషయం లియోనారాకు బోధపడింది. గృహిణిగానే ఉంది! భర్త, ఇద్దరు సవతులతో కలిసి లియోనారా మొదట ఐఎస్ రాజధాని రాకాలో నివాసం ఉండేది. ఆ సమయంలో భర్త తనను కేవలం ఒక పనిమనిషిగానే చూసేవాడు. వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అందరికీ సపర్యలు చేయడం ఇదే ఆమె రోజూ వారీ దినచర్య. అలా నాలుగేళ్లుగా గృహిణిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న లియోనారా.. ఇద్దరు పిల్లలకు తల్లైంది. తన ఇంట్లో తానే ఓ పనిమనిషిలా కాలం వెళ్లదీసింది. వారానికో ఇంట్లో నివాసం.. బహిరంగ శిరచ్ఛేదనలు, అత్యాచారాలతో సిరియా ప్రజలకు భీతికొల్పుతున్న ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు... స్థానిక కుర్దిష్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిరియాలో ప్రజాస్వామ్య పాలనే లక్ష్యంగా... ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదునుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా తమ దేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ పశ్చిమ దేశాలకు విఙ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్డీఎఫ్ నుంచి తప్పించుకునేందుకు లియోనారా కుటుంబం వారానికో ఇంట్లో తలదాచుకునేది. అయితే ఆ సమయంలో ఐఎస్ వీరి గురించి పట్టించుకునేది కాదు. ఐఎస్ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వారి కంటే కుర్దిష్ దళాలే నయమని భావించిన లియోనార భర్త, ఇద్దరు పిల్లలు, భర్త రెండో భార్యతో కలిసి ఎస్డీఎఫ్ క్యాంపునకు బయల్దేరింది. ఇందులో భాగంగా ఇరాక్ సరిహద్దులోని బాగోజ్ గ్రామానికి చేరుకుంది. అయితే తూర్పు సిరియాలో గస్తీ కాస్తున్న అమెరికా మద్దతు దేశాల బలగాలు లియోనారా భర్త మార్టిన్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నాయి. నా భర్త టెక్నీషియన్ మాత్రమే..కాదు ఉగ్రవాది! ‘నా భర్త కంప్యూటర్లు రిపేర్ చేసేవాడు. అదే విధంగా కంప్యూటర్ విడిభాగాలు, ఫోన్లు ఐఎస్‌కు సరఫరా చేసేవాడని మాత్రమే నాకు తెలుసు. రాకాను కోల్పోయిన ఐఎస్ మమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలని చూసింది. తినడానికి తిండి ఉండేది కాదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే అలా చూస్తూ ఉండటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. టీనేజ్‌లో నేను చేసిన తప్పు నా పిల్లల పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాను.ఇప్పుడు నా సొంత ఇంటికి వెళ్లాలని ఉంది’ అంటూ లియోనారా తన పరిస్థితి గురించి అంతర్జాతీయ మీడియా ముందు మొరపెట్టుకుంటోంది. అయితే లియోనారా భర్త ఐఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించే వాడని, వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి అతడే సూత్రధారి అని జర్మన్ మీడియా అంటోంది. ఏదేమైనప్పటికీ లియోనారా గనుక నిజంగా పశ్చాత్తాపడితే మాత్రం ఆమెను స్వదేశానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లైతే లియోనారా లాగే మరికొంత మంది ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 3200 మంది నిజంగా జిహాదీలేనా? గతేడాది డిసెంబరు నాటికి సుమారు 36 వేల మందిపై దాడి చేసిన ఎస్డీఎఫ్.. ఓ చిన్నపాటి క్యాంపులో వారిని ఉంచి ఇబ్బందులకు గురిచేస్తోందని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆరోపిస్తోంది. ఇందులో 3200 మందిని జీహాదీలుగా భావించి వారిని నిర్బంధించిందనే వాదన కూడా వినిపిస్తోంది. -
నటి ఇషాపై సెటైర్లు.. ఎదురుదాడి
ముంబై : లక్షల మందిని పొట్టనపెట్టుకున్నా ఆరని జ్వాలలా రగులుతోన్న సిరియా సంక్షోభం.. గడిచిన మూడు నెలల్లో మరింత భయంకరంగా మారింది. సిరియన్-రష్యన్ దళాల సంయుక్త దాడుల్లో వందలాదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వేలమంది గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి ఇషా గుప్తా కూడా సిరియా సంక్షోభంపై ఓ ట్వీట్ చేశారు. అయితే నటి ట్వీట్‌పై కొందరు ట్రోలర్స్ సెటైర్లు గుప్పించారు. తిరిగి ఆమె ఎదురుదాడి చేయడంతో తోకముడిచారు. సిరియా అంతర్యుద్ధంలో గాయపడ్డ ఓ చిన్నారి ఫొటోను ట్వీట్ చేసిన ఇషా దానికి ‘‘ ఏ మతం, ఏ ప్రభుత్వం అన్నది అప్రస్తుతం. మానవత్వం మంటగలుస్తోంది. అకారణంగా చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఇది ఆగాలి. సిరియాలో నెత్తుటిధారను ఆపాలి..’ అని కామెంట్ చేశారు. ఇషా ట్వీట్‌పై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఏసీ రూమ్స్‌లో కూర్చొని కామెంట్లు పెట్టడంకాదు.. నువ్వే సిరియా వెళ్లి ఏమైనా చెయ్యరాదు..’ అని ఒకరు, ‘ప్రపంచంతో పోల్చుకుంటే చిన్నపిల్లల మరణాలు ఇండియాలోనే ఎక్కువ. నువ్వు సేవచెయ్యడానికి ఈ దేశం సరిపోదా?’ అని ఇంకొకరు.. రకరకాలుగా సెటైర్లు వేశారు. ట్రోలర్ల తీరుపై మండిపడ్డ ఇషా.. ‘మానవత్వానికి హద్దులు గీస్తూ మీ వైకల్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పిల్లలు చనిపోవడానికి, వేరేవాళ్లచేతిలో హత్యకు గురికావడానికి చాలా తేడాఉంటుందని గుర్తించాలి. లేదంటే సిరియా మాదిరే మీరూ చీకటి యుగంలో ఉన్నట్లేలెక్క’’ అని ఎదురుదాడిచేశారు. I don’t care which country or religion or government I have, humanity is dying. The children are dying and it needs to stop,now #SyriaIsBleeding pic.twitter.com/8EVPXgcScT — Esha Gupta (@eshagupta2811) February 25, 2018 Your dumbness is profound, there is a difference when you are KILLING them. That’s the problem with you trollers, good for nothing, even in Humanity you see borders. Even for children you see religion. This is what is called the dark age. #HumanRightsDiedInSyria #PrayForSyria https://t.co/tXrjJ8et5J — Esha Gupta (@eshagupta2811) February 27, 2018 -
ఆ సంక్షోభం ఇక ముగిస్తే మంచిది
వాషింగ్టన్ : గత అధ్యక్షులకు భిన్నంగా రష్యాతో మైత్రి కొనసాగించటం చర్చనీయాంశంగానే కాదు.. సొంత దేశంలోనే ట్రంప్‌పై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ ఈ ఇద్దరు అధ్యక్షులు సుమారు గంటన్నర సేపు ఫోన్లో మాట్లాడుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లోరిడా పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. సిరియా అంతర్యుద్ధం, నార్త్ కొరియా కవ్వింపు చర్యలపైనే వీరిద్దరు మాట్లాడుకున్నట్లు వైట్ హౌజ్ అధికారులు చెబుతున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ ఈ మధ్యే పుతిన్ ను కలిశారు. ఈ నేపథ్యంలో అంతర్యుద్ధ సంక్షోభానికి ముగింపు పలకాలంటూ వీరిద్దరు ఫోన్లో సుదీర్ఘ మంతనాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సిరియాలో ఉగ్రవాదులను ఏరివేసి, రాజకీయ సుస్థిరత నెలకొల్పడంతో పాటు, అంతర్యుద్ధం కారణంగా దేశం వదిలి వెళ్లిన సిరియన్లందరినీ వెనక్కి తేవడం వంటి అంశాలపై చర్చించారని తెలిపారు. వీటితోపాటు ఉక్రెయిన్ సంక్షోభాలు, పశ్చిమాసియాలో ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు, అల్-ఖైదా, ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లపై ఉమ్మడి పోరుపై చర్చించినట్లు వైట్‌హౌజ్ పేర్కొంది. -
బద్ధశత్రువుల కలయికతో కొత్త ప్రపంచం?
మాస్కో/వాషింగ్టన్: ఒక దేశం సంక్షోభంలో చిక్కుకుందంటే దానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా(+మిత్రదేశాలు), రష్యాలు కారణమవుతాయన్న సంగతి చెప్పనక్కర్లేదు. ఆధిపత్యభావజాలం, ఆయిల్ నిక్షేపాలు, ఆయుధాల వ్యాపారం.. లాంటి ఎన్నో దారుల్లో అగ్రరాజ్యాలు ఆయా దేశాల్లో కల్లోలం రేపుతాయని తెలిసిందే. అలా పెరిగి పెద్దదై, నాగరికతకు, మానవత్వానికి మాయని మచ్చలా తయారైందే సిరియా సంక్షోభం. ఒక్క సిరియానేకాదు మిడిల్ ఈస్ట్ లోని చాలా దేశాలు, ఆఫ్రికాలోని అన్నిదేశాలు, మిగతా ప్రపంచంలో కొన్నిదేశాల్లో నెలకొన్న పరిస్థితి వింటే మనిషన్న ఎవరికైనా బాధకలగకమానదు. ఇలాంటి స్థితిలో ప్రయోజనాలు పక్కనపెట్టి, ప్రపంచశాంతి కోసం పాటుపడటం అనే ప్రక్రియను అగ్రరాజ్యాలు మొదలుపెడతాయా? అంటే కష్టమనే చెప్పొచ్చు. కార్పొరేట్ సమీకరణాల నడుమ అభివృద్ధి చెందిన ఏ దేశమూ ఆ పని చేయదు. కానీ శాంతి నెలకొనాలని మనం అభిలాషించాల్సిందే. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల తాజా చర్చలు ఆ ఆశలను కొద్దిగా రేకెత్తిస్తున్నాయి. పుతిన్ మొదటి నుంచి ట్రంప్ కు మద్దతిస్తున్నట్లు వార్తలు వింటున్నాం. అయితే అమెరికా-రష్యాల అధినేతలుగా మాత్రం వాళ్లు ప్రస్తుతానికి బద్ధ శత్రువులే! రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సోమవారం అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డోనాల్ట్ ట్రంప్ కు ఫోన్ చేసి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు తెలపడంతోపాటు సిరియా సంక్షోభం, అమెరికా-రష్యాల ద్వైపాక్షిక సంబంధాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఇరుదేశాల సంబంధాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకుని సాధారణ స్థితికి తీసుకురావడం, సిరియా సంక్షోభానికి ముగింపు పలకండం లాంటి కీలక అంశాలపై ఇరునేతలు చర్చించినట్లు క్రెమ్లిన్(రష్యా అధికార కేంద్రం), ట్రంప్ కార్యాలయాలు మీడియాకు వెల్లడించాయి. సత్సంబధాల పునరుద్ధరణలో భాగంగా వాషింగ్టన్, మాస్కోల మద్య నిరంతర సంవాదాలు, తరచూ ఇరుదేశాధ్యక్షుల పర్యటనలు కొనసాగాలని పుతిన్, ట్రంప్ లు నిర్ణయించారని, ఈ ప్రక్రియలో ఎలాంటి భేషజాలకు తావు ఇవ్వకూడదని నేతలు భావిస్తున్నట్లు వారి ప్రతినిధులు పేర్కొన్నారు. 200 ఏళ్లకు పైగా కొనసాగుతోన్న అమెరికా- రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో త్వరలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. వచ్చే ఏడాదితో యూఎస్-రష్యా బంధం 210వ వార్షికోత్సవం జరగనుంది. ఇంకా ఖారారుకాని ఈ వేదికపైనుంచి పుతిన్, ట్రంప్ లు కొత్త ఒరవడికి శ్రీకారం చుడతారని, ఆ మేరకు మార్గనిర్దేశం చేస్తారని తెలిసింది. సమానత్వం, పరస్పర గౌరవం, ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు కలుగజేసుకోకుండా ఉండటం తదితర అంశాల ప్రాతిపదికన ఇద్దరు నేతలు చర్చలు జరుపుతారని క్రెమ్లిన్ వర్గాలు ప్రకటించగా, ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసి పోరాడుదామని ట్రంప్ పేర్కొన్నట్లు వాషింగ్టన్ లోని ఆయన కార్యాలయం తెలిపింది. అయ్యో.. సిరియా సిరియాలో అధికార బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 1000 గ్రూపులు పనిచేస్తున్నాయి. ఐసిస్ ఆ వెయ్యిలో ఒకటి. ఎన్నికల ప్రచారంలో ‘ఐసిస్ ను సృష్టించింది ఒబామా, హిల్లరీలే’నన్న ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని, అసద్ కు రష్యా దన్నుగా నిలవడంతో తన ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న భయంతోనే అమెరికా రెబల్ గ్రూపులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరాచేసిందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతారరు. అసద్ కు మద్దతిస్తోన్న రష్యా కూడా వైమానిక దాడులతో సిరియాలో ఘోర విధ్వంసాలకు పాల్పడింది. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్లు బరితెగించడంతో దాదాపు రెండు కోట్ల మంది సిరియన్ల బతుకులు కకావికలం అయ్యాయి. నాలుగేళ్లుగా ఉధృతంగా సాగుతోన్న యుద్ధం కారణంగా ఇప్పటికే 50 లక్షల పైచిలుకు సిరియన్లు సోంతదేశాన్ని విడిచచి శరణార్థులుగా వెళ్లిపోయారు. అలా వెళుతూ వెళుతూ సముద్రంలో మునిగి చనిపోయిన బాలుడు అయిలన్ కుర్ధీ ఫొటో ప్రపంచాన్ని ఎంతగా కదిలించిందో చూశాం. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, పుతిన్ సారధ్యంలోని రష్యాలు సిరియా సంక్షోభానికి ముగింపు పలికి, మున్ముందు ఇలాంటి దురాక్రమణలకు ఉపక్రమించకుండా ఉంటే ప్రపంచానికి కావాల్సిందేముంటుంది?