వాషింగ్టన్ : గత అధ్యక్షులకు భిన్నంగా రష్యాతో మైత్రి కొనసాగించటం చర్చనీయాంశంగానే కాదు.. సొంత దేశంలోనే ట్రంప్‌పై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ ఈ ఇద్దరు అధ్యక్షులు సుమారు గంటన్నర సేపు ఫోన్‌లో మాట్లాడుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఫ్లోరిడా పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సిరియా అంతర్యుద్ధం, నార్త్ కొరియా కవ్వింపు చర్యలపైనే వీరిద్దరు మాట్లాడుకున్నట్లు వైట్ హౌజ్ అధికారులు చెబుతున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ ఈ మధ్యే పుతిన్ ను కలిశారు. ఈ నేపథ్యంలో అంతర్యుద్ధ సంక్షోభానికి ముగింపు పలకాలంటూ వీరిద్దరు ఫోన్‌లో సుదీర్ఘ మంతనాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సిరియాలో ఉగ్రవాదులను ఏరివేసి, రాజకీయ సుస్థిరత నెలకొల్పడంతో పాటు, అంతర్యుద్ధం కారణంగా దేశం వదిలి వెళ్లిన సిరియన్లందరినీ వెనక్కి తేవడం వంటి అంశాలపై చర్చించారని తెలిపారు. వీటితోపాటు ఉక్రెయిన్ సంక్షోభాలు, పశ్చిమాసియాలో ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలు, అల్-ఖైదా, ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లపై ఉమ్మడి పోరుపై చర్చించినట్లు వైట్‌హౌజ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment