
వాషింగ్టన్ : సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను మరో వారం రోజుల్లో అంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా ఉగ్రవాదులను అంతమొందించాలనే తమ ఆశయం నెరవేరుతుందని పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రంప్ ప్రసంగించారు. సుమారు 70 దేశాల ప్రతినిధులో ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా... ‘ అమెరికా, దాని మిత్ర దేశాలతో పాటు సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ కృషి కారణంగా.. ఐఎస్ పాలనలో ఉన్న సిరియా, ఇరాక్‌లోని చాలా ప్రాంతాలు విముక్తి పొందాయి. చాలా కష్టంతో కూడుకున్న ఈ పనిని పూర్తి చేసేందుకు ఆర్థిక, సైనిక సహకారాలు అందించి సిరియాకు అండగా నిలిచారు. ఇది సమిష్టి కృషి. ఐఎస్ ఉనికిని సమూలంగా రూపుమాపుతాం. ఇందుకు సంబంధించి వారం రోజుల్లోగా అధికారిక ప్రకటన చేస్తాను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా సిరియా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు గతేడాది డిసెంబరులో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఐఎస్‌ను పూర్తిగా ఓడించిన కారణంగా సైనిక దళాలను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు..‘‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ ’ అని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment