గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే... గేయాలను రచించగలరంటాడో కవి ఎన్నో గాయాల దుఃఖాల నుంచే కదా.. అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది ఆ గాయాలన్నీ మరిచి చిద్విలాసాలను చిందించడానికి ఎంతటి సహృదయత కావాలి
నిత్య యుద్ధనేల సిరియాలో జరిగిన ఓ బాంబుదాడిలో కాలును కోల్పోయాడు మున్జీర్. యుద్ధంలో వెలువడిన నెర్వ్ గ్యాస్‌ని పీల్చుకున్నందుకు కాళ్లు, చేతులు లేని కొడుకు ముస్తఫాకి జన్మనిచ్చింది తల్లి జీనెప్. సిరియాలో యుద్ధం తీసుకెళ్లిపోయిన తమ సంతోషాన్ని వెతుక్కుంటూ సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో స్థిరపడిందా కుటుంబం.
ఓ ఆహ్లాద సమయాన ఆ తండ్రీకొడుకుల నవ్వులను క్లిక్‌మనిపించాడు టర్కిష్ ఫొటోగ్రాఫర్ మెహ్మత్ అస్లన్. సియెనా ఇంటర్నేషనల్ ఫొటో అవార్డ్స్ –2021లో ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ‘సిరియాలో ఏం జరుగుతుందో ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి చూపాలనుకున్నాను’అని చెప్పాడు అస్లన్.
Comments
Please login to add a commentAdd a comment