Photo Award
-
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు..
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు.. దానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం.. సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు.. మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్ (వెనుక వైపు ఫొటో).. ఈ చిత్రాలు.. 2022 డ్రోన్ ఫొటో పురస్కారాల్లో అర్బన్ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి. 116 దేశాల నుంచి 2,600 మంది ఫొటోగ్రాఫర్లు తమ ఎంట్రీలను పంపారు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్ -
వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం..సాక్షి ఫోటో జర్నలిస్టులకు సన్మానం
-
ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్ ఎంపిక
భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వన్ నేషన్ వన్ ఫ్లాగ్’పై నిర్వహించిన పోటీల్లో సాక్షి దినపత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్ కోల్లోజు శివకుమార్ పంపిన చిత్రం ఎంపికైంది. ఈనెల 19న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో శివకుమార్ అవార్డు అందుకోనున్నారు. -
సిరియాలో ఏం జరుగుతుందో ఈ ఒక్క ఫొటోతో..
గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే... గేయాలను రచించగలరంటాడో కవి ఎన్నో గాయాల దుఃఖాల నుంచే కదా.. అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది ఆ గాయాలన్నీ మరిచి చిద్విలాసాలను చిందించడానికి ఎంతటి సహృదయత కావాలి నిత్య యుద్ధనేల సిరియాలో జరిగిన ఓ బాంబుదాడిలో కాలును కోల్పోయాడు మున్జీర్. యుద్ధంలో వెలువడిన నెర్వ్ గ్యాస్‌ని పీల్చుకున్నందుకు కాళ్లు, చేతులు లేని కొడుకు ముస్తఫాకి జన్మనిచ్చింది తల్లి జీనెప్. సిరియాలో యుద్ధం తీసుకెళ్లిపోయిన తమ సంతోషాన్ని వెతుక్కుంటూ సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో స్థిరపడిందా కుటుంబం. ఓ ఆహ్లాద సమయాన ఆ తండ్రీకొడుకుల నవ్వులను క్లిక్‌మనిపించాడు టర్కిష్ ఫొటోగ్రాఫర్ మెహ్మత్ అస్లన్. సియెనా ఇంటర్నేషనల్ ఫొటో అవార్డ్స్ –2021లో ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ‘సిరియాలో ఏం జరుగుతుందో ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి చూపాలనుకున్నాను’అని చెప్పాడు అస్లన్. -
మన ఉత్తమ కమాటికి ఫొటో అవార్డు
లండన్: అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమస్యలపై ఆట్కిన్స్ సివెమ్ (సీఐడబ్లూఈఎం) నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో భారత్‌కు చెందిన ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ ఉత్తమ కమాటి తీసిన ఫొటోకు ఉత్తమ ఫొటో అవార్డు లభించింది. భారత్ లోని తీస్తా నది నుంచి ఓ పైపు ద్వారా సూదూరానున్న తమ పుచ్చకాయల పంటకు నీరు పెడుతున్న ఓ దంపతుల శ్రమైక జీవన చిత్రమిది. ఈ ఫొటోకుగాను కమాటికి లక్ష రూపాయల బహుమతిని అందజేశారు. మొత్తం 60 దేశాల నుంచి ఫొటోగ్రాఫర్లు, ఫిల్మ్‌మేకర్స్ నుంచి దాదాపు పదివేల ఫొటోలు పోటీకి రాగా అందులో 111 ఫొటోలను ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల కింది వీటికి ఉత్తమ, ద్వితీయ, తృతీయ ఫొటో అవార్డులను ప్రకటించారు. నగరంలోని దక్షిణ కెన్సింగ్ఘన్లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వేదికపై ఈ 111 ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన జూలై పదవ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ‘చార్టర్డ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (సీఐడబ్లూఈఎం)’ 2007లో ఈ అంతర్జాతీయ అవార్డును ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా పేరుపొందిన బ్రిటన్ బహుళార్థక ఇంజనీరింగ్ కంపెనీ ‘ఆట్కిన్స్’ అవార్డులకు ఆర్థిక సహాయం చేస్తుండడంతో ఈ అవార్డుకు ‘ఆట్కిన్స్ సివెమ్’ అని పేరుపెట్టారు.