
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది. దాంతో అలర్ట్ అయిన ఇజ్రాయెల్ దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తుంది. బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ తీవ్రంగా విరుచుపడుతున్నట్టు సమాచారం. ఈ దాడికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది.
అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. దీంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 400లకు మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇక తాజా పరిస్ధితిపై అమెరికా వైట్ హౌస్ స్పంధించింది. ఇరాన్ దాడిపై బైడెన్, కమలా హారిస్ సమీక్షిస్తున్నారు. మిస్సైళ్ల దాడి నుంచి సామాన్య ప్రజలను రక్షించాలని బైడెన్ అమెరికా ఆర్మీని ఆదేశించారు.