భారత వైమానిక దళం ‘సుదర్శన్ ఎస్-400’ రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. భారతదేశం తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి రష్యాతో కలిసి ‘సుదర్శన్ ఎస్-400’ను తయారుచేసినట్లు చెప్పారు.
ఈ మేరకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ..‘సుదర్శన్ ఎస్-400 రక్షణ క్షిపణి పరీక్ష విజయవంతం అయింది. శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసింది. విమానాలపై అటాక్ చేసి అవి ముందుకు కదలకుండా నిరోధించింది. ఈ వ్యవస్థ వల్ల భారత వైమానిక రక్షణ దళం మరింత పురోగమించింది. రష్యా-భారత్ కలిసి వీటిని ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్‌లు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో రెండు స్క్వాడ్రన్‌లు సిద్ధం అవుతాయి’ అన్నారు.
ఇదీ చదవండి: ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్!
సుదర్శన్ ఎస్-400 ఐదు స్క్వాడ్రన్‌ల కోసం గతంలో రెండు దేశాలు రూ.35,000 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎంఆర్-సామ్ క్షిపణి వ్యవస్థ భారత వైమానిక రక్షణ దళంలో చేరింది. దాంతోపాటు ‘ఇజ్రాయెలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్’ క్షిపణి వ్యవస్థ సైతం ఎయిర్‌ఫోర్స్‌లో చేరింది. తాజాగా ఎస్-400 కూడా వాటికి తోడవడంతో వైమానిక దళం గేమ్ ఛేంజర్‌గా మారిందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కుషా’తో మరింత సమర్థవంతమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు భద్రతపై గతంలోనే కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment