మాస్కో: ఉక్రెయిన్ తమపైకి భారీ సంఖ్యలో డ్రోన్ల దాడికి పాల్పడిందని రష్యా పేర్కొంది. శనివారం రాత్రి మొత్తం 158 డ్రోన్లను కూల్చేశామని రష్యా ఆర్మీ తెలిపింది. ఇందులో రాజధాని మాస్కోపైకి రెండు, పరిసరప్రాంతాలపైకి మరో దూసుకువచ్చిన తొమ్మిది డ్రోన్లు కూడా ఉన్నాయంది. సరిహద్దులకు సమీపంలోని ఉక్రెయిన్ బలగాలు ప్రస్తుతం తిష్ట వేసిన కస్క్ ప్రాంతంలో 46 డ్రోన్లు, బ్రియాన్‌స్‌్కలో 34, వొరెనెజ్‌లో 28 డ్రోన్లతోపాటు, బెల్గొరోడ్‌పైకి వచి్చన మరో 14 డ్రోన్లను కూలి్చనట్లు వివరించింది. సుదూర ట్వెర్, ఇరనొవో సహా మొత్తం 15 రీజియన్లపైకి ఇవి దూసుకొచ్చాయని తెలిపింది.
మాస్కో గగనతలంలో ధ్వంసం చేసిన డ్రోన్ శకలాలు పడి ఆయిల్ డిపోలో మంటలు రేగాయని మేయర్ చెప్పారు. బెల్గొరోడ్ రాజధాని ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణితో 9 మందికి గాయాలయ్యాయి. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్ రిజియన్‌లోని పివ్‌నిచ్‌నె, వ్యింకా పట్టణాలు తమ వశమయ్యాయని రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది. కురకోవ్ నగరంపై రష్యా క్షిపణి దాడుల్లో ముగ్గురు చనిపోగా మరో 9 మంది క్షతగాత్రులయ్యారు. శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన 11 క్షిపణుల్లో ఎనిమిదింటిని కూలి్చవేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఖరీ్కవ్‌పై రష్యా ఆర్మీ ఆదివారం చేపట్టిన దాడుల్లో 41మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment