![Russian missiles hit agriculture facility in Odesa - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/26/Untitled-6.jpg.webp?itok=sXHFBVuZ)
కీవ్: ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై డ్రోన్లు, క్షిపణులతో సోమవారం రష్యా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పోర్టు మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. రష్యా ప్రయోగించిన 12 కాలిబర్ మిస్సైళ్లలో పదకొండింటిని, రెండు పీ–800 ఓనిక్స్ క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.
ఉక్రెయిన్ ధాన్యాన్ని నల్ల సముద్రం మీదుగా ఓడల ద్వారా తరలించే ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. అప్పటి నుంచి ఒడెసా ఓడరేవు లక్ష్యంగా పదేపదే దాడులకు దిగుతోంది. ఫలితంగా ధాన్యం గోదాములు, ఆయిల్ డిపోలు, షిప్పింగ్, నిల్వ సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment