odessa
-
ఒడెసా పోర్టుపై రష్యా భీకర దాడులు
కీవ్: ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై డ్రోన్లు, క్షిపణులతో సోమవారం రష్యా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పోర్టు మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. రష్యా ప్రయోగించిన 12 కాలిబర్ మిస్సైళ్లలో పదకొండింటిని, రెండు పీ–800 ఓనిక్స్ క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ ధాన్యాన్ని నల్ల సముద్రం మీదుగా ఓడల ద్వారా తరలించే ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. అప్పటి నుంచి ఒడెసా ఓడరేవు లక్ష్యంగా పదేపదే దాడులకు దిగుతోంది. ఫలితంగా ధాన్యం గోదాములు, ఆయిల్ డిపోలు, షిప్పింగ్, నిల్వ సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తి చెప్పిన సంచలన విషయాలు
-
మహా విషాదంపై రైల్వే మంత్రి క్లారిటీ
-
ఒప్పందం జరిగి 24 గంటలు గడవనేలేదు.. ఒడెస్సా పోర్ట్‌పై రష్యా దాడి
కీవ్: ఆహార సంక్షోభాన్ని అడ్డుకునేందుకు నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాలను చేరవేసేలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అయితే.. ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ మరుసటి రోజే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు ఈ నౌకాశ్రయమే కీలకం కాగా.. దానిపైనే దాడులు జరగటం గమనార్హం. శుక్రవారం నాటి ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్‌లో నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సాతో పాటు మరో రెండు రేవుల నుంచి ఎగుమతులు ప్రారంభంకావాల్సి ఉంది. తాజాగా ఆయా ఓడ రేవులపై మాస్కో క్షిపణులు దాడి చేశాయంటూ స్థానిక ఎంపీ ఒలెక్సీ గొంచరెంకో విమర్శలు చేశారు. మొత్తం నాలుగు మిసైల్స్ ప్రయోగించగా.. వాటిలో రెండింటిని అడ్డుకున్నట్లు చెప్పారు. ఒడెస్సా పోర్టుపై దాడి ఘటనలో పలువురు గాయపడినట్లు వెల్లడించారు. ఒడెస్సాలో ఆరు పేలుడు ఘటనలు జరిగాయన్నారు. ‘ఒడెస్సా పోర్టుపై మాస్కో దళాలు దాడులు చేశాయి. ఒప్పందం చేసుకుని ఒక్క రోజు గడవకముందే ఈ ఘటన జరగటంతో ఒప్పందాల విషయంలో రష్యా వైఖరి స్పష్టమవుతోంది. ఒడెస్సాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయండి. రష్యాకు బలప్రదర్శన మాత్రమే అర్థమవుతుంది.’ అని ట్వీట్ చేశారు. మరోవైపు.. ధాన్యం ఎగుమతుల ఒప్పందం విషయంలో ఏదైనా విఘాతం కలిగితే.. తద్వారా ఏర్పడే ఆహార సంక్షోభానికి రష్యాదే పూర్తి బాధ్యత అని ఉక్రెయిన్ విదేశాంగ ప్రతినిధి ఓలెగ్ నికొలెంకో పేర్కొన్నారు. ఐరాస, తుర్కియేలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడేందుకు రష్యాకు 24 గంటలూ పట్టలేదంటూ మండిపడ్డారు. మరోవైపు.. ఈ దాడిని ఖండించారు ఐరోపా సమాఖ్య విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి జోసెప్ బోరెల్. ఒప్పందం జరిగిన మరుసటి రోజునే కీలక పోర్ట్‌పై దాడి చేయటం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల పట్ల రష్యా వైఖరి స్పష్టమవుతోందన్నారు. ఇదీ చదవండి: రెండేళ్ల క్రితమే మృతి.. ప్రతినెలా ఓనర్‌కు రెంట్ చెల్లిస్తున్న మహిళ! -
చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం! రష్యా బలగాలకు అడ్డుగా..
Build Barricades To Stop Russian Invasion: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నిరవధికంగా సాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అతలాకుతలమై పోయింది. అంతేగాక ప్రధాన నగరాలను ఒక్కొకటిగా రష్యా బలగాలు మోహరించడమే కాక కైవసం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరమైన ఒడెస్సాలో రష్యా దాడి చేయనుందంటూ తరుచుగా సైరన్లు మోగుతున్నాయి. దీంతో ఆ నగరంలోని సిటీ సెంటర్‌ను అడ్డుకునేందుకు స్థానికులు ఇసుకుతో బారికేడ్లను నిర్మించేందుకు ఉపక్రమించారు. ఆ బారికేడ్ నిర్మాణం పనుల్లో పదకొండేళ్ల పిల్లలు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ చిన్నారులు తమ నగరంలో రష్యా దళాలు ప్రవేశించనివ్వమని, నిర్మాణం సజావుగా సాగుతోందని చెబుతున్నారు. అయితే ఓడరేవు నగరం ఖేర్సన్ను రష్యా బలగాలు గురువారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మైకోలైవ్ నగర కేంద్ర నుంచి రష్యా దళాలు ప్రవేశించకుండా స్థానిక వేటగాళ్లు నిలువరించడమే కాకుండా సఫలమయ్యారు కూడా. ఈ మేరకు ఉక్రెయిన్‌లో కొన్ని నగరాల్లోని ప్రజలు తమ పోరాటంతో కొంత మేర విజయాన్ని సాధించాయనే చెప్పాలి. రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో దాదాపు 750 మందికి పైగా పౌరులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు పోరాటం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.2 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ను విడిచిపెట్టారు కూడా. (చదవండి: పారిపోలేదు!..నేను ఇక్కడే ఉన్నా! పోరాడుతున్నా: జెలెన్ స్కీ) -
ఒబామా పర్యటనకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత
రాయగఢ్: విశాఖపట్నం-రాయ్‌పూర్ రైల్వేలైన్ మార్గంలో ఒడిషాలోని రాయగఢ వద్ద రైలు పట్టాలను శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడగా, ఈ రైలు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయగఢ సమీపంలోని మునిగుడ రైల్వే స్టేషన్ వద్ద మావోయిస్టులు అత్యాధునిక ఐఈడీని ఉపయోగించి పట్టాలను పేల్చివేశారని, ఓ మీటరు మేరకు పట్టాలు ధ్వంసమయ్యాయని, ఐఈడీ ఎక్కువ శక్తివంతమైనది కాకపోవడం వల్ల ఎక్కువ నష్టం సంభవించలేదని రాయగఢ ఎస్పీ శివ సుబ్రమణి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు.