హౌతీల దాడి.. భారత యుద్ధనౌక సాహసం | Gulf Of Aden Houthis Attack: Indian Navy Rescues Crew From Ship, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Gulf Of Aden Houthis Attack: నడిసంద్రంలో హౌతీల దాడి.. భారత యుద్ధనౌక డేరింగ్‌ రెస్క్యూ

Published Thu, Mar 7 2024 2:28 PM | Last Updated on Thu, Mar 7 2024 2:49 PM

Gulf of Aden Houthis Attack: Indian Navy rescues crew from ship - Sakshi

గల్ఫ్‌ ఆఫ్‌ అడెన్‌లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి.. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి పలువురిని భారత యుద్ద నౌక కాపాడింది. 

గల్ఫ్‌ ఆఫ్‌ అడెన్‌లో యెమెన్‌ హౌతీ రెబల్స్‌ జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్‌ నుంచి బయల్దేరిన వాణిజ్య నౌక ఘోరంగా దెబ్బతింది.  ఇద్దరు అక్కడికక్కడే  మరణించగా.. గాయపడిన వాళ్లతో పాటు మిగిలిన సిబ్బంది బిక్కుబిక్కుమంటూ నౌకలోనే గడిపారు. ఆ సమయంలో శరవేగంగా స్పందించిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా.. 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను  సైతం అందించింది. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది.

ఇందుకోసం ఐఎన్‌ఎస్‌లోని హెలికాప్టర్‌, బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో.. ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్నివారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహరా కాస్తోంది.  

ఇదిలా ఉంటే..  యూరప్‌తో ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌ను కలిపే  ఈ ప్రధాన మార్గంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నవంబర్‌ చివరి వారం నుంచి హౌతీలు ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. జనవరి నుంచి ప్రతిగా అమెరికా వైమానిక దాడులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా  సముద్రయాన రంగంతో పాటు వర్తక వాణిజ్యలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement