INS Kolkata
-
దటీట్ భారత్ నేవీ.. 40 గంటల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
ఢిల్లీ: భారత నావికాదళం మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిపి నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను పట్టుకుంది. వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 14న అరేబియా సముద్రంలో ఎంవీ రుయెన్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నౌనకు రక్షించేందుకు భారత నేవీ రంగంలోకి దిగింది. నౌక రక్షణ కోసం ఆపరేషన్ చేపట్టింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నౌకను రక్షించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోగా.. నౌకలోని 17 మంది సిబ్బంది సురక్షింతంగా ఉన్నట్టు నేవీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ కోల్కత్తా, యుద్ధనౌక ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, P8I పెట్రోలింగ్ విమానాలు ఉపయోగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్ పూర్తిగా భారత నావికాదళం ఆధీనంలో ఉన్నట్టు పేర్కొంది. Indian Navy warship INS Kolkata has taken 35 sea pirates in custody on board and started sailing towards the Indian west coast along with the 17 crew members of the merchant vessel MV Ruen. Indian Navy had forced the pirates to surrender after a major operation on high seas:… pic.twitter.com/CvZ6cC8NtR — ANI (@ANI) March 17, 2024 ఇదిలా ఉండగా.. ఈ నెల 15వ తేదీన భారత నేవీ ఆపరేషన్ చేపట్టే ముందు సముద్రపు దొంగలను లొంగిపోవాలని సూచించింది. లేకపోతే వారిపై దాడులు ప్రారంభించాలని మెరైన్ కమాండోలకు నేవీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమాలియా సముద్రపు దొంగలు నేవీ అధికారులపై కాల్పులు జరిపారు. అనంతరం ఏ మాత్రం బెదరకుండా రెస్క్యూ కొనసాగించిన నేవీ సముద్రపు దొంగలు లొంగి పోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది. #IndianNavy thwarts designs of Somali pirates to hijack ships plying through the region by intercepting ex-MV Ruen. The ex-MV Ruen, which had been hijacked by Somali pirates on #14Dec 23, was reported to have sailed out as a pirate ship towards conducting acts of #piracy on high… pic.twitter.com/gOtQJvNpZb — SpokespersonNavy (@indiannavy) March 16, 2024 ఇక,అంతకుముందు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నౌకను సైతం ఇండియన్ నేవీ రక్షించింది. భారత నావికాదళం అరేబియా సముద్రంలో జరిగిన సంఘటనలను తక్షణమే పరిష్కరించడం, వాణిజ్య నౌకలను రక్షించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. దీంతో, భారత నావికాదళంపై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. -
హౌతీల దాడి.. భారత యుద్ధనౌక సాహసం
గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి.. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పలువురిని భారత యుద్ద నౌక కాపాడింది. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో యెమెన్ హౌతీ రెబల్స్ జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్ నుంచి బయల్దేరిన వాణిజ్య నౌక ఘోరంగా దెబ్బతింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. గాయపడిన వాళ్లతో పాటు మిగిలిన సిబ్బంది బిక్కుబిక్కుమంటూ నౌకలోనే గడిపారు. ఆ సమయంలో శరవేగంగా స్పందించిన ఐఎన్ఎస్ కోల్‌కతా.. 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను సైతం అందించింది. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. #IndianNavy's swift response to Maritime Incident in #GulfofAden. Barbados Flagged Bulk Carrier MV #TrueConfidence reported on fire after a drone/missile hit on #06Mar, approx 54 nm South West of Aden, resulting in critical injuries to crew, forcing them to abandon ship.… pic.twitter.com/FZQRBeGcKp — SpokespersonNavy (@indiannavy) March 7, 2024 ఇందుకోసం ఐఎన్‌ఎస్‌లోని హెలికాప్టర్, బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో.. ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్నివారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహరా కాస్తోంది. ఇదిలా ఉంటే.. యూరప్‌తో ఆసియా, మిడిల్ ఈస్ట్‌ను కలిపే ఈ ప్రధాన మార్గంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నవంబర్ చివరి వారం నుంచి హౌతీలు ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. జనవరి నుంచి ప్రతిగా అమెరికా వైమానిక దాడులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన రంగంతో పాటు వర్తక వాణిజ్యలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
భారత్ అమ్ములపోదిలో భయంకర అస్త్రం బరాక్-8
-
ప్రత్యర్థులు భయపడేలా సైనిక సంపత్తి
రక్షణ దళాలను ఆధునీకరిస్తాం: ప్రధాని మోడీ స్వదేశీ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కోల్‌కతా’ జాతికి అంకితం ముంబై: మన దేశంపై ప్రత్యర్థులెవరూ కన్నెత్తి చూసే ధైర్యం చేయలేని స్థాయిలో సైనిక దళాలను ఆధునీకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ‘యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో గెలుపొందడం ఇప్పుడు అంత కష్టం కాదు. అత్యాధునిక ఆయుధ పాటవం ఉన్న సైనిక వ్యవస్థ ఉంటే చాలు.. యుద్ధంలో గెలుపు నిశ్చయమైనట్లే. మన దగ్గర శక్తి సామర్ధ్యాలు ఉంటే.. ఎవరూ మనల్ని సవాలు చేసే ధైర్యం చేయలేరు. శక్తిమంతమైన సైనిక వ్యవస్థనే అతిపెద్ద యుద్ధ నిరోధకం’ అన్నారు. ఆయుధ, సైనిక సామర్ధ్యం విషయంలో విదేశాల్తో పోల్చుకుని మనం వెనకబడి ఉన్నామని ఏ సైనికుడు భావించకూడని స్థాయిలో.. రక్షణ దళాలను ఆధునీకరిస్తామని తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అతిపెద్ద, అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కోల్‌కతా’ను శనివారం ఆయన జాతికి అంకితం చేశారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ.. ఈ సందర్భంగా నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ మేథోపరమైన సామర్ధ్యానికి ‘ఐఎన్ఎస్ కోల్‌కతా’ను ప్రతీకగా మోడీ అభివర్ణించారు. అంతర్జాతీయ వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో తీర ప్రాంత రక్షణకు ప్రాధాన్యత పెరిగిందని, పొడవైన తీర రేఖ కలిగిన భారత్.. అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశ నౌకా వాణిజ్య ప్రయోజనాలకు ఐఎన్ఎస్ కోల్‌కతా కాపాడగలదని, విదేశీ నౌకా వాణిజ్య వేత్తల్లో భద్రతపై విశ్వాసం పాదుకొల్పగలదని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో 49% ఎఫ్‌డీఐలను సమర్ధిస్తూ.. ‘ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్న రక్షణ రంగ యంత్ర పరికరాలను.. కొన్నేళ్లలో ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరాలన్నదే నా లక్ష్యం’ అన్నారు. ‘ముంబై నుంచి మాట్లాడుతున్నా కాబట్టి.. చత్రపతి శివాజీని గుర్తుచేసుకోవడం సమంజసం. నౌకాదళం వ్యవస్థీకృతమైంది ఆయన కాలంలోనే’ అని మోడీ గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ నౌకదళానికి శుభాకాంక్షలు తెలిపారు. ఐఎన్ఎస్ కోల్‌కతా ప్రత్యేకతలు ► ఇది మాజెగావ్ డాక్‌యార్డ్‌లో తయారైంది. ► క్షిపణి విధ్వంసక వ్యవస్థ కలిగిన మొదటి కోల్‌కతా క్లాస్ యుద్ధనౌక. ► దీని బరువు 6,800 టన్నులు, పొడవు 164 మీటర్లు. వెడల్పు 18 మీటర్లు. ► 4 గ్యాస్ టర్బైన్ జనరేటర్ల సాయంతో 4.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. ► ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల ఈ క్షిపణులు 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ► ఇందులో ఇజ్రాయెల్ తయారీ ‘ఎంఎఫ్ స్టార్’ రాడార్‌ను ఏర్పాటు చేశారు. ఇది శత్రు క్షిపణులను 250 కి.మీల దూరం నుంచే గుర్తిస్తుంది. అంతేకాదు, ఒకే సమయంలో వందల లక్ష్యాలను పరిశీలించి.. క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలదు. రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఈపీసీ మహారాష్ట్రలో మరో రెండు కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. నవసేవలో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఎస్ఈజెడ్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేందుకు త్వరలో రాష్ట్రాలకు అనుమతిస్తామని వెల్లడించారు. ఎగుమతుల్లో వృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. అనంతరం షోలాపూర్‌లో షోలాపూర్- రాయచూర్ విద్యుత్ సరఫరా లైన్లను జాతికి అంకితం చేశారు. ఆ తరువాత పూణె- షోలాపూర్‌ల మధ్య 4 లేన్ల రహదారిని మోడీ ప్రారంభించారు. -
ఐఎన్ఎస్ కోల్‌కతా జాతికి అంకితం
ముంబయి : భారత నేవీ అమ్ముల పొదిలో మరో యుద్ధ నౌక చేరింది. ఐఎన్ఎస్ కోల్‌కతాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం జాతికి అంకితం చేశారు. ముంబయిలోని నౌకాస్థావరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నౌకను నేవీకి అప్పగించారు. దేశంలోనే ఇది అతి పెద్ద నౌక. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధనౌక బరువు 7,500 టన్నులు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ భారతదేశాన్ని కాచి కాపాడాతున్నది సైనిక దళాలే అన్నారు. యుద్ధానికి సిద్ధమే కానీ, కయ్యానికి కాలు దువ్వమని ఆయన తెలిపారు. ఇకపై నేవీ సైనిక బలం మరింత పెరిగిందన్నారు. ఐఎన్ఎస్ కోల్‌కతా తయారీతో మన దేశ పరిజ్ఞానాన్ని చాటి చెప్పామని నరేంద్ర మోడీ ప్రశంసించారు. నౌకను తయారు చేసిన శాస్త్రవేత్తలను అభినందించకుండా ఉండలేక పోతున్నానని ఆయన అన్నారు. భారత దేశ రక్షణలోత్రివిధ దళాలు ముఖ్యమైనవని, దేశాన్ని కాపాడుతున్నది సైనిక బలగాలేనని తెలిపారు. సైనికులు దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని, అనుక్షణం సరిహద్దులో కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నారు. వారి సేవలు భారత ప్రజలు మరవలేనివని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో చత్రపతి శివాజి కూడా సముద్ర రక్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎన్ఎస్ కోల్‌కతా చేరికతో ఏ దేశం మనతో సవాల్ చేయలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు పాల్గొన్నారు. -
ఐఎన్ఎస్ కోల్‌కతా నౌకలో ప్రమాదం.. నేవీ అధికారి మృతి
ముంబై: ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో పేలుళ్ల సంఘటన మరచిపోకముందే.. భారత నౌకాదళంలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముంబై తీరప్రాంతం మజగావ్ డాక్‌యార్డ్‌లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒక నౌకాదళం అధికారి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. నిర్మాణ దశలో ఉన్న ఐఎన్ఎస్ కోల్‌కతా నౌకలో గ్యాస్ లీకవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు చెప్పారు. ముంబైలోనే కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ‘ఐఎన్ఎస్ సింధు రక్షక్’ జలాంతర్గామిలో వరుస పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. గత ఆగస్టులో జరిగిన ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగింది. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న జలాంతర్గామి సముద్రంలో సగం వరకు మునిగిపోయింది.