hauti rebel group
-
హౌతీల దాడి.. భారత యుద్ధనౌక సాహసం
గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి.. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పలువురిని భారత యుద్ద నౌక కాపాడింది. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో యెమెన్ హౌతీ రెబల్స్ జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్ నుంచి బయల్దేరిన వాణిజ్య నౌక ఘోరంగా దెబ్బతింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. గాయపడిన వాళ్లతో పాటు మిగిలిన సిబ్బంది బిక్కుబిక్కుమంటూ నౌకలోనే గడిపారు. ఆ సమయంలో శరవేగంగా స్పందించిన ఐఎన్ఎస్ కోల్‌కతా.. 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను సైతం అందించింది. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. #IndianNavy's swift response to Maritime Incident in #GulfofAden. Barbados Flagged Bulk Carrier MV #TrueConfidence reported on fire after a drone/missile hit on #06Mar, approx 54 nm South West of Aden, resulting in critical injuries to crew, forcing them to abandon ship.… pic.twitter.com/FZQRBeGcKp — SpokespersonNavy (@indiannavy) March 7, 2024 ఇందుకోసం ఐఎన్‌ఎస్‌లోని హెలికాప్టర్, బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో.. ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్నివారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహరా కాస్తోంది. ఇదిలా ఉంటే.. యూరప్‌తో ఆసియా, మిడిల్ ఈస్ట్‌ను కలిపే ఈ ప్రధాన మార్గంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నవంబర్ చివరి వారం నుంచి హౌతీలు ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. జనవరి నుంచి ప్రతిగా అమెరికా వైమానిక దాడులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన రంగంతో పాటు వర్తక వాణిజ్యలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే..
ఎర్ర సముద్ర సంక్షోభం నేపథ్యంలో సరుకు రవాణా వ్యయాలపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఎగుమతిదార్ల అవసరాలను పర్యవేక్షించాలని ఆర్థిక శాఖల విభాగానికి (డీఎఫ్ఎస్) వాణిజ్య శాఖ సూచించింది. వారికి రుణలభ్యతపై దృష్టి పెట్టాలని పేర్కొంది. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ నేతృత్వంలో బుధవారం జరిగిన అంతర్–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఎగుమతిదారుల సమస్యలను చర్చించారు. డీఎఫ్ఎస్, షిప్పింగ్, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. అరేబియా మహాసముద్రంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు రక్షణ శాఖ తెలిపిందని ఈ సందర్భంగా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే.. ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకలపై హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా వేరే మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుండటం వల్ల ఎగుమతిదారులకు వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అన్ని వివరాలను సేకరిస్తున్నామని, త్వరలోనే అంతర్–మంత్రిత్వ శాఖల గ్రూప్ మరోసారి సమావేశమవుతుందని అధికారి పేర్కొన్నారు. -
ఎర్ర సముద్రంలో అలజడి.. టెస్లాకు గట్టి దెబ్బ!
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో హౌతీలు సృష్టిస్తున్న అలజడుల దెబ్బ అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా (Tesla)కు గట్టిగా తగిలింది. తన బెర్లిన్ ఫ్యాక్టరీలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 11 వరకు చాలా కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టెస్లా ప్రకటించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఎర్ర సముద్రంలోని నౌకలపై జరుగుతున్న దాడుల ప్రభావం సరకు రవాణాపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీకి విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తిని నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు గాజాలోని హమాస్‌కు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో నౌకలు లక్ష్యంగా చేస్తున్న దాడులకు పర్యవసానంగా తగిలిన గట్టి దెబ్బగా దీన్ని భావిస్తున్నారు. ఎర్ర సముద్రంలో జరుగుతున్న సాయుధ దాడుల కారణంగా కేప్ ఆఫ్ గూడ్ హోప్ ద్వారా యూరప్, ఆసియా మధ్య రవాణా మార్గాలలో మార్పులు జరగడం తమ బెర్లిన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఉత్పత్తి నిలిపోవడానికి నిర్దిష్ట కారణాలను వెల్లడించనప్పటికీ ఫిబ్రవరి 12న పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించనున్నట్లు టెస్లా పేర్కొంది. ఎర్ర సముద్రంలో అలజడి కారణంగా ఇతర వాహన తయారీదారులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవచ్చని ఆటో పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లాతోపాటు చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ గీలీ, అతిపెద్ద ఫర్నీచర్ కంపెనీ ఐకియా సహా అనేక కంపెనీలు డెలివరీ ఆలస్యం గురించి ఇప్పటికే హెచ్చరించాయి. -
సౌదీ రాజు హత్యకు కుట్ర
అబుదాబి: సౌదీ అరేబియా రాజు హత్యకు కుట్ర జరిగినట్లు మలేసియా పోలీసులు తెలిపారు. గత వారం కింగ్ సల్మాన్ కౌలాలంపూర్‌లో పర్యటించారు. ఈ సమయంలో సల్మాన్‌ను హత్య చేసేందుకు మిలిటెంట్లు కుట్ర పన్నినట్లు చెప్పారు. మొత్తం నలుగురు మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరందరూ యెమన్లోని హౌతీ రెబెల్ గ్రూప్‌కు చెందిన వారిగా తెలిసింది. కౌలాలంపూర్ నగర శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని పత్రాలు పరిశీలించగా.. అవన్నీ నకిలీవని తేలినట్లు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ రవాణాతో కూడా వీరికి సంబంధాలున్నాయని తెలిపారు. విచారణలో సౌదీ రాజు సల్మాన్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారని ఐజీ ఖలీద్ అబూబకర్ వెల్లడించారు. నలుగురి వద్ద నుంచి 60 వేల యూఎస్ డాలర్లను స్వాధీనం చేసున్నట్లు తెలిపారు. హౌతీ రెబెల్ గ్రూప్ అరెస్టుకు ముందు ట్రక్కు బాంబు దాడిని ప్లాన్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కింగ్ సల్మానే లక్ష్యంగా వీరు కూడా దాడికి కుట్రపన్నినట్లు అబూబకర్ చెప్పారు.