Black Sea
-
హౌతీల దాడి.. భారత యుద్ధనౌక సాహసం
గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి.. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పలువురిని భారత యుద్ద నౌక కాపాడింది. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో యెమెన్ హౌతీ రెబల్స్ జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్ నుంచి బయల్దేరిన వాణిజ్య నౌక ఘోరంగా దెబ్బతింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. గాయపడిన వాళ్లతో పాటు మిగిలిన సిబ్బంది బిక్కుబిక్కుమంటూ నౌకలోనే గడిపారు. ఆ సమయంలో శరవేగంగా స్పందించిన ఐఎన్ఎస్ కోల్‌కతా.. 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను సైతం అందించింది. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. #IndianNavy's swift response to Maritime Incident in #GulfofAden. Barbados Flagged Bulk Carrier MV #TrueConfidence reported on fire after a drone/missile hit on #06Mar, approx 54 nm South West of Aden, resulting in critical injuries to crew, forcing them to abandon ship.… pic.twitter.com/FZQRBeGcKp — SpokespersonNavy (@indiannavy) March 7, 2024 ఇందుకోసం ఐఎన్‌ఎస్‌లోని హెలికాప్టర్, బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో.. ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్నివారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహరా కాస్తోంది. ఇదిలా ఉంటే.. యూరప్‌తో ఆసియా, మిడిల్ ఈస్ట్‌ను కలిపే ఈ ప్రధాన మార్గంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నవంబర్ చివరి వారం నుంచి హౌతీలు ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. జనవరి నుంచి ప్రతిగా అమెరికా వైమానిక దాడులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన రంగంతో పాటు వర్తక వాణిజ్యలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆ గుహలోకి వెళ్తే అంతే సంగతులు..!
ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో ఉన్న ఈ గుహ మృత్యుగుహగా పేరుమోసింది. క్రాస్నోయార్స్క్కు చెందిన గుహాన్వేషకులు కొందరు దీనిని 1968లో తొలిసారిగా గుర్తించారు. వెరియోవ్కినా అనే ఈ గుహ 7,293 అడుగుల లోతు ఉంటుంది. బయట నిలబడి దీని లోపలకు చూపు సారిస్తే, లోపలంతా చీకటిగా భయంగొలిపేలా కనిపిస్తుంది. దాదాపు గడచిన యాబై ఏళ్లలో ముప్పయిసార్లు గుహాన్వేషకులు ఈ గుహ లోపలి చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడంతో దీనికి మృత్యుగుహ అనే పేరు స్థిరపడింది. పలుసార్లు ఈ గుహలో గుహాన్వేషకుల మృతదేహాలు బయటపడ్డాయి. చివరిసారిగా 2021లో సెర్జీ కోజీవ్ అనే రష్యన్ గుహాన్వేషకుడి మృతదేహం ఈ గుహలో మూడువేల అడుగుల లోతు వద్ద కనిపించగా, దానిని వెలికితీశారు. గుహ లోపల దిగువకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోతాయి. ఈ పరిస్థితుల్లో అడుగు భాగానికి చేరుకునే ప్రయత్నంలో హైపోథెర్మియాకు లోనై గుహాన్వేషకులు మరణిస్తున్నారని, తగిన జాగ్రత్తలు లేకుండా, ఈ గుహ అడుగుభాగానికి చేరుకోవాలని ప్రయత్నించడమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!) -
అప్పటి దాకా ధాన్యం ఒప్పందం ఉండదు
మాస్కో: యుద్ధం కొనసాగుతున్న వేళ నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ ధాన్యం రవాణా కారిడార్‌ను పునరుద్ధరించాలంటే పశ్చిమ దేశాలు ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దీంతో, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా దేశాలకు ఎంతో కీలకమైన ఆహార ధాన్యాల సరఫరాపై నీలినీడలు అలుముకున్నాయి. టర్కీ, ఐరాస మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందం నుంచి జూలైలో వైదొలిగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు సోమవారం రష్యాలోని సోచిలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో ఆయన సమావేశమయ్యారు. రష్యా నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు గల అవరోధాలను తొలగిస్తామన్న వాగ్దానాలను పశ్చిమదేశాలు నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రికార్డు స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఓడల రాకపోకలు, బీమాకు సంబంధించిన అవరోధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. పశి్చమదేశాలు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో కొద్ది రోజుల్లోనే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఎర్డోగన్ చెప్పారు. -
నల్ల సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్.. రష్యా పనే..
కీవ్: రష్యా యుద్ధ విమానం నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను ఢీకొట్టింది. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో అమెరికా సైన్యం తమ డ్రోన్‌ను కిందకు దించింది. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్‌ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. తాజా సంఘటన గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షుడు జో బైడెన్‌కు తెలియజేశారు. నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్‌లో రష్యాకు చెందిన రెండు ఎస్‌యూ–27 ఫైటర్ జెట్లు ఎలాంటి రక్షణ లేకుండా విన్యాసాలు చేపట్టాయని, అందులో ఒక విమానం అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను ఢీకొట్టిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: ఆస్ట్రేలియాకు అమెరికా సబ్మెరైన్లు -
నల్ల సముద్రం మీదుగా ధాన్యం రవాణా
ఇస్తాంబుల్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ ఆహార కొరతను తీర్చే దిశగా కీలకమైన ముందడుగు పడింది. నల్ల సముద్రం మీదుగా నౌకల ద్వారా ఆహార ధాన్యాల రవాణా కొనసాగించేందుకు ఐక్యరాజ్యసమితి, తుర్కియెలతో రష్యా, ఉక్రెయిన్ను వేర్వేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. ఉక్రెయిన్ నౌకాశ్రయాలను రష్యా సైన్యం దిగ్బంధించింది. దీంతో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజా ఒప్పందం ద్వారా రష్యా, ఉక్రెయిన్ల నుంచి లక్షలాది టన్నుల ధాన్యంతోపాటు, రష్యా నుంచి ఎరువుల రవాణాకు మార్గం ఏర్పడింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, ఉక్రెయిన్ మౌలిక వనరుల మంత్రి ఒలెక్జాండర్ కుబ్రకోవ్‌లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, తుర్కియె రక్షణ మంత్రి హులుసి అకార్‌లతో వేర్వేరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం..నల్ల సముద్రం మీదుగా సరుకు నౌకల రవాణా సవ్యంగా సాగేలా తుర్కియె చూసుకుంటుంది. ఈ నౌకల ద్వారా ఆయుధాల రవాణా జరగకుండా తుర్కియె తనిఖీలు చేస్తుంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలు, మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు నూనె ఎగుమతి చేసే దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ఐదు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒప్పందంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. -
ఉక్రెయిన్‌కు కీలకం.. ఆ కారణంతోనే రష్యా వెనక్కి?
ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైన ప్రాంతం అది. పైగా.. ఉక్రెయిన్ కీలక ఆర్థిక ప్రాంతమైన ఒడెస్సా పోర్టుకు 150 కిలోమీటర్ల దూరంలోపే ఉంది. బ్లాక్ సీలో నౌకల కదలికలపై నిఘా పెట్టేందుకు వీలుండటం ఈ ద్వీపానికి ఉన్న ప్రత్యేకతలు. మరి అలాంటి ప్రాంతం నుంచి రష్యా ఎందుకు వెనక్కి వెళ్లింది?.. స్నేక్ ఐల్యాండ్.. ఉక్రెయిన్‌కు చెందిన ఈ ద్వీపం చాలా చిన్నదే. కానీ, చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ప్రాంతానికి. ఈ దీవి కోసం ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు.. అందునా 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 1788 జూలైలో రష్యాకు, టర్కీ చక్రవర్తికి మధ్య ఈ ద్వీపం కోసం యుద్ధాలు జరిగాయి. అందులో రష్యా గెలిచి ద్వీపాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. తర్వాత కూడా యుద్ధాలలో రష్యాకు, టర్కీకి మధ్య మారుతూ వచ్చింది. కొన్నేళ్లపాటు రొమేనియా ఆధీనంలోకి వెళ్లింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ద్వీపంపై టర్కీ దాడి చేయగా.. రెండో ప్రపంచ యద్ధంలో సోవియట్ యూనియన్, రొమేనియాల మధ్య యుద్ధం జరిగింది. 1944లో ఈ ద్వీపం సోవియట్ యూనియన్ ఆధీనంలోకి వచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో ఉక్రెయిన్ చేతిలోకి వచ్చింది. కారణం అదేనా.. పురాణాల ప్రకారం స్నేక్ ఐలాండ్ గ్రీకు వీరుడు, దేవుడిగా పూజించే అకిలెస్ సమాధి స్థలం అనే ప్రచారం ఉంది. అక్కడ ఒక ఆలయం కూడా ఉండేది. 1788లో రష్యా, టర్కీల మధ్య యుద్ధంలో, ఆ తర్వాతి యుద్దాల సమయంలో, రొమేనియా దాడి చేసినప్పుడు.. ఇలా ప్రతిసారి ఈ ద్వీపాన్ని ఆక్రమించుకున్న దేశాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ వచ్చింది. అందుకే ఈ ద్వీపానికి శాపం ఉందేమోనన్న ప్రచారమూ ఉంది. ఇప్పుడు కూడా స్నేక్ ఐలాండ్ పై దాడి చేసి బాంబులు కురిపించిన రష్యాకు చెందిన కీలకమైన మాస్కోవా యద్ధ నౌక కొద్దిరోజుల్లోనే దెబ్బతిని మునిగిపోయింది. దీని సమీపంలోనే రష్యాకు చెందిన ఇతర నౌకలూ దెబ్బతిన్నాయి. ఒక విమానంకూడా కూలిపోయింది. ఈ నేపథ్యంలోనే రష్యా బలగాలు వెనక్కి వెళ్లాయని భావిస్తున్నారు. అయితే రష్యా మాత్రం.. మానవతా కోణంలో ఆహార పదార్థాల రవాణాకు మార్గం సుగమం చేయాలన్న ఐరాస పిలుపునకు స్పందించే వైదొలిగామంటూ ప్రకటించుకుంది. ఈ మేరకు జూన్ 30వ తేదీన బలగాలను వెనక్కి పిలిపించుకుంది. అర కిలోమీటరు పొడవు, అంతకన్నా తక్కువ వెడల్పుతో నల్ల సముద్రంలో కొలువై ఉంది స్నేక్ ఐలాండ్. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక.. ముందుగా స్నేక్ ఐలాండ్ పైనే దాడి చేసి స్వాధీనం చేసుకున్నాయి రష్యా బలగాలు. అయితే రష్యా బలగాల నిష్క్రమణతో.. తాజాగా ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించుకుంది. స్నేక్ ఐలాండ్ లో సైనిక చర్య పూర్తయిందని, రష్యా దళాలను తరిమికొట్టి ఆ భూభాగాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించుకుని తిరిగి ఉక్రెయిన్ జెండాను ఎగురవేసింది సైన్యం. -
Russia Ukraine War: విదేశీ నౌకలకు సేఫ్ కారిడార్
కీవ్/దావోస్: నల్ల సముద్రంలోని ఓడ రేవుల నుంచి విదేశీ నౌకలు భద్రంగా బయటకు వెళ్లేందుకు వీలుగా సేఫ్ కారిడార్ తెరుస్తామని రష్యా రక్షణ శాఖ హామీ ఇచ్చింది. మారియూపోల్ నుంచి నౌకలు వెళ్లడానికి మరో కారిడాన్ ప్రారంభించనున్నట్లు రష్యా రక్షణశాఖ ప్రతినిధి మైఖేల్ మిజింజ్‌సెవ్ చెప్పారు. ఒడెసా, ఖేర్సన్, మైకోలైవ్‌తో సహా నల్లసముద్రంలోని ఆరు పోర్టుల్లో ప్రస్తుతం 16 దేశాలకు చెందిన 70 నౌకలు ఉన్నాయని అన్నారు. కారిడార్లు ప్రతిరోజూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. మారియూపోల్ పోర్టులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత పునఃప్రారంభమైనట్లు రష్యా సైన్యం తెలియజేసింది. నల్లసముద్రంలోని ఓడ రేవుల్లో రష్యా సైన్యం పాగావేసింది. నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. దీనివల్ల ఉక్రెయిన్ నుంచి విదేశాలకు ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రష్యా దిగివచ్చింది. ఉక్రెయిన్ ఆయుధ సామగ్రి ధ్వంసం: రష్యా ఉక్రెయిన్‌లోని పొక్రోవ్స్క్లో ఓ రైల్వేస్టేషన్ వద్ద ఉక్రెయిన్ ఆయుధ సామగ్రిని తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధ విమానాలతో రైల్వేస్టేషన్‌పై దాడి చేసినట్లు చెప్పారు. మైకోలైవ్ రీజియన్‌లోని దినిప్రొవ్‌స్కీలో ఉక్రెయిన్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను నేలమట్టం చేశామని వివరించారు. ఈ ఘటనలో11 మంది ఉక్రెయిన్ సైనికులు, 15 మంది విదేశీ నిపుణులు మరణించారని పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరిపినట్లు కొనాషెంకోవ్ వివరించారు. 500 టార్గెట్లపై విరుచుకుపడినట్లు తెలిపారు. లుహాన్స్క్, డొనెట్స్క్లో ప్రస్తుతం 8,000 మంది ఉక్రెయిన్ జవాన్లు తమ ఆధీనంలో ఉన్నారని వేర్పాటువాదుల ప్రతినిధి రొడియోన్ మిరోష్నిక్ చెప్పారు. వాస్తవాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి: పెస్కోవ్ క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని ఉక్రెయిన్ గుర్తిస్తుందని ఆశిస్తున్నామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం అన్నారు. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా పునఃప్రారంభం కావాలంటే రష్యాపై కొన్ని ఆంక్షలను పశ్చిమ దేశాలు సడలించాలని పెస్కోవ్ తెలిపారు. మళ్లీ వడ్డీ రేటు తగ్గించిన రష్యా సెంట్రల్ బ్యాంకు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి గాను రష్యా సెంట్రల్ బ్యాంకు రుణాలపై వడ్డీ రేటును 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేటును ఏకంగా 20 శాతం పెంచింది. అప్పటి నుంచి వడ్డీ రేటును మూడు పాయింట్లు తగ్గించడం ఇది మూడోసారి. -
రష్యా ప్రతీకార దాడులు
కీవ్/లండన్: నల్ల సముద్రంలో తమ కీలక యుద్ధనౌక మాస్క్వాను కోల్పోయిన రష్యా తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతోంది. శనివారం ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను ఉధృతం చేసింది. తీర్పు ప్రాంతంతోపాటు రాజధాని కీవ్‌పై దృష్టి పెట్టింది. కీవ్ పరిసరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. కీవ్ చుట్టుపక్కల ఇప్పటివరకు 1,000కి పైగా మరణించారని ఉక్రెయిన్ చెప్పింది. యుద్ధంలో 3,000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని, 10,000 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. గత 24 గంటల్లో 8 ప్రాంతాలపై రష్యా విరుచుకుపడినట్లు చెప్పింది. తూర్పున డొనెట్స్క్, లుహాన్స్క్, ఖర్కీవ్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డినిప్రోపెట్రోవ్స్క్, పొల్టావా, కిరోవోహ్రాడ్, దక్షిణాన మైకోలైవ్, ఖేర్సన్‌పై దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. కీవ్ సమీపంలోని డార్నియిట్స్కీపై భారీగా దాడులు జరిగాయి. ఎస్‌యూ–35 ఎయిర్‌క్రాఫ్ట్ బాంబుల వర్షం కురిపించింది. ఖర్కీవ్‌పై రాకెట్ దాడుల్లో ఏడు నెలల చిన్నారి సహా ఏడుగురు మరణించారు. ఒలెగ్జాండ్రియాలోని ఎయిర్‌ఫీల్డ్‌పై శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిని ప్రయోగించిందని నగర మేయర్ చెప్పారు. లుహాన్స్క్లో దాడుల్లో ఒకరు మరణించారు. సెవెరోండోన్టెస్క్, లీసీచాన్‌స్క్‌లో దాడుల్లో గ్యాస్ పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఒక చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమయ్యింది. రష్యాకు పరాభవం తప్పదు: జెలెన్స్కీ రష్యా దాడుల నుంచి దేశ ప్రజలను కాపాడుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. ఆక్రమణదారులకు పరాభవం తప్పదన్నారు. తమ దేశం ఎన్నటికీ రష్యా వశం కాబోదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు చాలవు రష్యాపై విధించిన ఆంక్షలు చాలవని జెలెన్స్కీ అన్నారు. రష్యా చమురును నిషేధించాలని ప్రపంచ దేశాలను కోరారు. యుద్ధం ఆగాలంటే అన్ని దేశాలు రష్యాతో ఆర్థిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని చెప్పారు. ► మారియూపోల్ పునర్నిర్మాణానికి సాయమందిస్తానని ఉక్రెయిన్ కుబేరుడు రినాట్ అఖ్మెటోవ్ ప్రకటించారు. దేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘మెటిన్‌వెస్ట్’ యజమాని అయిన అఖ్మెటోవ్కు మారియూపోల్‌లో రెండు ఉక్కు పరిశ్రమలున్నాయి. ► సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో వందలాది మంది రష్యాకు అనుకూలంగా భారీ ప్రదర్శన చేపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సూచించే ‘జెడ్’ అక్షరమున్న టీ షర్టులు ధరించారు. పుతిన్ చిత్రాలతో కూడిన ప్లకార్డులను చేబూనారు. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే తీర్మానానికి మద్దతుగా సెర్బియా ఓటేయడాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించని ఒకే ఒక్క యూరప్ దేశం సెర్బియా. యూకే ప్రధాని, మంత్రులపై రష్యా నిషేధం ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు పలువురు నేతలపై నిషేధం విధిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో యూకే ప్రభుత్వం రష్యాపై ఆంక్షలు విధించినందుకు ప్రతిచర్యగా ఈ నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నిషేధానికి గురైన వారిలో భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, హోంమంత్రి ప్రీతీ పటేల్ కూడా ఉన్నారు. రష్యా ప్రభుత్వం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఇలాంటి నిషేధమే విధించింది. -
ఐదడుగుల దూరంలో దూసుకెళ్లిన రష్యన్ విమానం
వాషింగ్టన్ : మరోసారి అమెరికా, రష్యా యుద్ధ విమానాల మధ్య ప్రమాదం తప్పింది. దాదాపు ఈ రెండు జెట్ విమానాలు ఒకే మార్గంలో ప్రయాణించాయి. అది కూడా దాదాపు 2గంటల 40 నిమిషాలపాటు. ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని, దాదాపు తమ విమానాన్ని ఢీకొట్టినంత పని రష్యా యుద్ధ విమానం చేసిందని పెంటగాన్ అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఈపీ-3 అనే గూఢచర్యం నిర్వంహించే విమానం ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్‌స్పేస్ నిఘా మిషన్‌లో భాగంగా ఎగురుతుండగా సరిగ్గా అదే మార్గంలో రష్యాకు చెందిన సుఖోయ్-27 యుద్ధ విమానం కూడా అమెరికా విమానం పక్కనే ఎగిరింది. అది కూడా ఎంత దగ్గరగా అంటే కేవలం ఐదు అడుగుల దూరంలో(1.5మీటర్లు) మాత్రమే. ఒకానొక దశలో ఈపీ-3 విమానం వెళ్లే మార్గంలోనే అతిదగ్గరగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో అమెరికన్ విమానం రష్యా విమానానికి రాసుకుపోయేంత పనైంది. సరిగ్గా నల్ల సముద్రంపైన ఎగురుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. -
సముద్రంలో పడవ మునక.. నలుగురి మృతి
ఇస్తాంబుల్(టర్కీ): టర్కీ సముద్ర తీరంలో పడవ మునిగి నలుగురు శరణార్థులు మృతిచెందారు. మరో 20 మంది గల్లంతయ్యారు. కోస్టుగార్డు సిబ్బంది మరో 38 మందిని రక్షించారు. శరణార్థులు యూరోపియన్ దేశాలకు వెళ్లడానికి ఏజియన్ సముద్ర మార్గం కష్టంగా ఉండటంతో వారు నల్ల సముద్రం ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోస్టుగార్డులు తెలిపారు. వలసదారులను అడ్డుకోవడానికి యూరోపియన్ యూనియన్ టర్కీ దేశం గత మార్చిలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ వలసలు ఆగటం లేదు. -
నల్ల సముద్రంలో కూలిన విమానం
92 మంది మృతి.. 10 మృతదేహాలు వెలికితీత • సోచీ నుంచి సిరియాకు వెళుతున్న రష్యా మిలటరీ విమానం • బయలుదేరిన రెండు నిమిషాలకే ప్రమాదం • విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు పుతిన్.. ఉగ్ర కోణాన్ని తిరస్కరించిన రష్యా • మృతుల్లో 64 మంది సంగీత బృందం, 9 మంది జర్నలిస్టులు మాస్కో: రష్యా మిలటరీ విమానం ఆదివారం ఉదయం నల్ల సముద్రంలో కుప్పకూలిపోయింది. సిరియాకు బయలు దేరిన టీయూ–154 విమా నంలో 92 మంది ప్రయాణిస్తున్నారు. దక్షిణ రష్యాలోని సోచీ పట్టణం నుంచి బయలుదేరిన రెండు నిమిషాలకే విమానం అదృశ్యమైందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఐగోర్ కొనషెన్కోవ్ చెప్పారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:55 నిమిషాల తర్వాత రాడార్‌కు సిగ్నల్స్ అందకుండాపో యాయని ఆయన తెలిపారు. అయితే ప్రమాదానికి కారణాలేంటి అనేది ఆయన వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థిని బట్టి విమానంలో ఉన్న వారు ఎవరూ బతికే అవకాశం లేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రదాడి అయి ఉండొచ్చని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఈ వాదనను రష్యా అధికారులు తోసిపుచ్చుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే సహాయక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. వీరికి కొద్ది సేవటికే దుర్ఘటన ప్రాంతంలో 10 మృతదేహాలు లభించాయి. సోచీ తీరానికి 1.5 కి.మీ దూరంలో 50 నుంచి 70 మీటర్ల లోతులో విమాన శకలాలను గుర్తించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని దిమిత్రీ మెద్వదేవ్‌ను ఆదేశించారు. ఒక రోజు సంతాప దినం ప్రకటించిన పుతిన్.. ప్రమాద కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఎక్కువ మంది సంగీత బృందం ప్రమాదానికి గురైన విమానం పశ్చిమ సిరియాలోని లటాకియా ప్రావిన్స్‌లోని హెమీమిమ్ ఎయిర్‌బేస్, రష్యా మధ్య నిరంతరం రాకపోకలు సాగిస్తుంది. ఆ ఎయిర్‌బేస్‌లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి పెద్ద ఎత్తున సంగీత బృందాన్ని తీసుకెళుతున్నారు. విమానం కూలిపోయిన సమయంలో దానిలో 84 మంది ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో రష్యా మిలిటరీకి చెందిన అధికారిక సంగీత బృందం అలెగ్జాండ్రోవ్ ఎన్సెంబుల్ సభ్యులు 64 మంది ఉన్నారు. ఈ బృందాన్ని రెడ్ ఆర్మీ కోయిర్ అని కూడా పిలుస్తారు. మిగిలిన ప్రయాణికుల్లో 9 మంది జర్నలిస్టులు, ఓ డాక్టర్, సర్వీస్‌మెన్ ఉన్నారు. 1983లో ఈ విమానం సేవలు ప్రారంభమయ్యాయని, 2014లో మరమ్మతులు చేశామని కొనషెన్కోవ్ తెలిపారు. ఉగ్రదాడి జరిగిఉండొచ్చు అన్న వాదనను రక్షణ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు విక్టర్ ఒజెరోవ్ ఖండించారు. సాంకేతిక లోపం వల్లో, సిబ్బంది తప్పిదం వల్లో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన ఆయన తెలిపారు. మోదీ సంతాపం రష్యా సైనిక విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ ద్వారా సంతాపం తెలిపారు. ‘ఈ రోజు జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతికి రష్యాతో పాటు భారత్ కూడా సంతాపం తెలుపుతోంది’అని మోదీ ట్వీట్ చేశారు. విమాన శకలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న సహాయక సిబ్బంది