ఐదడుగుల దూరంలో దూసుకెళ్లిన రష్యన్‌ విమానం | Russian Fighter Intercepted Our Jet : US Navy | Sakshi
Sakshi News home page

ఐదడుగుల దూరంలో దూసుకెళ్లిన రష్యన్‌ విమానం

Published Tue, Jan 30 2018 9:28 AM | Last Updated on Fri, Aug 24 2018 5:35 PM

Russian Fighter Intercepted Our Jet : US Navy - Sakshi

అమెరికా విమానానికి సమీపంగా దూసుకెళుతున్న రష్యా విమానం

వాషింగ్టన్‌ : మరోసారి అమెరికా, రష్యా యుద్ధ విమానాల మధ్య ప్రమాదం తప్పింది. దాదాపు ఈ రెండు జెట్‌ విమానాలు ఒకే మార్గంలో ప్రయాణించాయి. అది కూడా దాదాపు 2గంటల 40 నిమిషాలపాటు. ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని, దాదాపు తమ విమానాన్ని ఢీకొట్టినంత పని రష్యా యుద్ధ విమానం చేసిందని పెంటగాన్‌ అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన ఈపీ-3 అనే గూఢచర్యం నిర్వంహించే విమానం ఒకటి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌స్పేస్‌ నిఘా మిషన్‌లో భాగంగా ఎగురుతుండగా సరిగ్గా అదే మార్గంలో రష్యాకు చెందిన సుఖోయ్‌-27 యుద్ధ విమానం కూడా అమెరికా విమానం పక్కనే ఎగిరింది. అది కూడా ఎంత దగ్గరగా అంటే కేవలం ఐదు అడుగుల దూరంలో(1.5మీటర్లు) మాత్రమే. ఒకానొక దశలో ఈపీ-3 విమానం వెళ్లే మార్గంలోనే అతిదగ్గరగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో అమెరికన్‌ విమానం రష్యా విమానానికి రాసుకుపోయేంత పనైంది. సరిగ్గా నల్ల సముద్రంపైన ఎగురుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు జరుగుతునే ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement