intercepted
-
రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావడమే గానీ వెనక్కి రాలేం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రోజుకో వ్యూహంతో యుద్ధాన్ని మరింత ముమ్మరం చేస్తామే గానీ వెనక్కి తగ్గేదే లేదని ప్రగల్పాలు పలుకుతున్నారు. పైగా మా దళాలు వివిధ శక్తిమంతమైన క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్‌ని దద్ధరిల్లేలా చేస్తున్నారని కొద్దిరోజుల్లో విజయం సాధిస్తామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్‌లో రష్యా దళాల పరిస్థితి అందుకు చాలా విభిన్నంగా ఉందనడానికి సాక్ష్యం వారి ఫోన్ కాల్స్. రష్య బలగాలు తమ ఆవేదనను తమవారితో ఫోన్లో వెళ్లబోసుకుంటున్నారు. తమకు సరైన ఆహారం, నీరు లేదని వధించబడతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు పది నెలలుగా సాగుతున్న నిరవధిక యుద్ధంలో రష్యా గణనీయమైన నష్టాన్నే చవి చూసింది. అయినప్పటికీ రష్యా పెద్ద ఎత్తున సైనిక సమీకరణలతో సైనికులను రిక్రూట్ చేసుకుని యుద్ధం చేసేందకు సిద్ధమైంది. కానీ సైనికులు పోరాటం చేయలేక సరైన తిండిలేక నిసత్తువతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఒక సైనికుడు తన తల్లితో అమ్మ మాకు ఎవరూ సరైన ఆహారం అందించరని, నీటి కోసం గుమ్మడికాయాల నుంచి తీసిని నీటిని వడకట్టుకుని తాగుతున్నామని ఆవేదనగా చెబుతున్నాడు. అధ్యక్షుడు పుతిన్ గొప్పగా చెబుతున్న క్షిపణుల ఎక్కడ ఉన్నాయని కొందరూ సైనికులు ప్రశ్నిస్తున్నారు. తమ ఎదురుగా ఎత్తైన భవనం ఉందని, దానిని మన సైనికుల కొట్టలేరు ఎందుకంటే దాన్ని కూల్చడం కోసం కాలిబర్ క్రూయిజ్ క్షిపణి కావాలని చెప్పాడు. మరో రష్యా సైనికుడు తల్లి తన కొడుకు తనతో లేడని కన్నీళ్లు పెట్టుకుంది. మరోక పోన్ సంభాషణలో ఒక సైనికుడు తాము వెనక్కి వెళ్లేందుకు అనుమతి లేదని, పోరాడేందుకు సరైన ఆర్మీబలం, ఆయుధ బలం గానీ లేవని వాపోయాడు. ఇంకో రష్యా సైనికుడు తన భార్యతో ముగ్గురు సైనికులతో పారిపోయానని, లొంగిపోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. మరోక సైనికుడు మమ్మల్ని అందర్నీ చంపేస్తున్నారంటూ భయాందోళనతో చెప్పాడు. ఈ సుదర్ఘీ యుద్ధ రష్యన్ మిలటరీలో ధైర్యాన్నీ బలహీనపరిచింది. వారు కుటుంబాలకు చేసిన కాల్స్‌ని బట్టి వారంతా ఎంత నిస్సహాయ స్థితిలో పోరాడుతున్నారో అవగతమవుతోంది. (చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్! కారణం ఏంటంటే..) -
భారత విమానాన్ని వెంబడించిన పాక్ వాయుసేన
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన స్పైస్‌జెట్ విమానాన్ని పాక్ వాయుసేన విమానాలు వెంబడించాయి. ఈ ఘటన సెప్టెంబర్ 23న చోటుచేసుకున్నట్టు సివిల్ ఏవియేషన్ వర్గాల తెలిపాయి. వివరాల్లకి వెళితే.. సెప్టెంబర్ 23న ఢిల్లీ నుంచి కాబూల్‌కు 120 మంది ప్రయాణికులతో స్పైస్‌జెట్ విమానం బయలుదేరింది. మార్గమధ్యలో పాక్ గగనతలంలోకి ప్రవేశించగానే.. ఆ దేశ వాయుసేనకు చెందిన రెండు ఎఫ్-16 జెట్స్ స్పైస్‌జెట్ విమానాన్ని వెంబడించడం ప్రారంభించాయి. ఇరువైపుల నుంచి స్పైస్‌జెట్‌ను ముట్టండించాయి. పాక్ జెట్స్లోని పైలట్లు.. భారత విమానం ప్రయాణిస్తున్న ఎత్తును తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్లైట్ సర్వీసు వివరాలు సమర్పించాల్సిందిగా కోరారు. దీంతో స్పైస్‌జెట్ కెప్టెన్.. ఇది భారత్‌కు చెందిన విమానమని.. ప్రయాణికులతో కాబూల్ వెళ్తుందని వారికి తెలియజేశాడు. పాకిస్తాన్ ఏటీసీ అధికారులు.. స్పైస్‌జెట్ ఫ్లైట్ కోడ్‌ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా సమాచారం. సాధారణంగా ప్రతి విమానానికి ఒక కోడ్ ఉంటుంది.. అలాగే స్పైస్‌జెట్‌కు ‘SG’ అని ఉంటుంది. అయితే స్పైస్‌జెట్ కోడ్‌ను ‘IA’గా అర్థం చేసుకున్న పాకిస్తాన్ ఏటీసీ అధికారులు.. దానిని భారత ఆర్మీకి గానీ, వాయుసేనకు చెందినదని భావించారు. వెంటనే ఆ విమానాన్ని పరీక్షించడానికి ఎఫ్-16 విమానాలను రంగంలోకి దించారు. అయితే స్పైస్‌జెట్ కెప్టెన్ పాక్ వాయూసేన అనుమానాలను నివృత్తి చేసిన తర్వాత కూడా.. భారత విమానం పాక్ గగనతలం దాటి అఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించే వరకు ఎఫ్-16 విమానాలు వెనకాలే వచ్చాయి. కాగా, పాక్ గగనతలంలోకి భారత విమానాలపై నిషేధం లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై ఆ సమయంలో ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికుడు ఒకరు తన అనుభవాన్ని ఏఎన్ఐతో పంచుకున్నారు. ‘మేము ప్రయాణిస్తున్న విమానాన్ని వెంబడించిన పాక్ జెట్స్ ఫైలట్లు చేతి సైగల ద్వారా మా విమానాన్ని కిందికి దించాలని డిమాండ్ చేశారు. అలాగే స్పైస్‌జెట్ సిబ్బంది కూడా కిటికీలను కప్పివేయాలని.. నిశ్శబ్ధం పాటించాలని ప్రయాణికులను కోరార’ని తెలిపారు. అయితే ఆ ప్రయాణికుడు తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరాడు. కాబూల్‌లో విమానం క్షేమంగా ల్యాండ్ అయిన తర్వాత తిరుగు ప్రయాణం దాదాపు ఐదు గంటల పాటు ఆలస్యం అయింది. ఈ ఘటనపై కాబూల్‌లోని పాకిస్తాన్ ఎంబసీ అధికారులు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. -
ఐదడుగుల దూరంలో దూసుకెళ్లిన రష్యన్ విమానం
వాషింగ్టన్ : మరోసారి అమెరికా, రష్యా యుద్ధ విమానాల మధ్య ప్రమాదం తప్పింది. దాదాపు ఈ రెండు జెట్ విమానాలు ఒకే మార్గంలో ప్రయాణించాయి. అది కూడా దాదాపు 2గంటల 40 నిమిషాలపాటు. ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని, దాదాపు తమ విమానాన్ని ఢీకొట్టినంత పని రష్యా యుద్ధ విమానం చేసిందని పెంటగాన్ అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఈపీ-3 అనే గూఢచర్యం నిర్వంహించే విమానం ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్‌స్పేస్ నిఘా మిషన్‌లో భాగంగా ఎగురుతుండగా సరిగ్గా అదే మార్గంలో రష్యాకు చెందిన సుఖోయ్-27 యుద్ధ విమానం కూడా అమెరికా విమానం పక్కనే ఎగిరింది. అది కూడా ఎంత దగ్గరగా అంటే కేవలం ఐదు అడుగుల దూరంలో(1.5మీటర్లు) మాత్రమే. ఒకానొక దశలో ఈపీ-3 విమానం వెళ్లే మార్గంలోనే అతిదగ్గరగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో అమెరికన్ విమానం రష్యా విమానానికి రాసుకుపోయేంత పనైంది. సరిగ్గా నల్ల సముద్రంపైన ఎగురుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. -
600 కోట్ల హెరాయిన్ పట్టివేత
-
600 కోట్ల హెరాయిన్ పట్టివేత
పోర్బందర్: అక్రమంగా గుజరాత్ తీరంలోకి ప్రవేశించిన మరో పాకిస్థాన్ బోటును పట్టుకున్నారు. పాక్ నుంచి గుజరాత్ మీదుగా భారత్‌లోకి భారీఎత్తున మత్తుమందులు, శాటిలైట్ ఫోన్లు తదితరాలతో ప్రవేశిస్తున్న ఈ భారీ నావను నౌకాదళ అధికారులు సీజ్ చేశారు. భారత నౌకాదళ అధికారులు, కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్‌లోని పోరుబందర్ పోర్ట్‌లో ఈ నౌకను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు గత కొన్ని రోజులుగా నిఘాపెట్టినట్లు నౌకా దళ అధికారులు తెలిపారు. దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అధికారులు, దీనికి ఉగ్రచర్యలకు సంబంధం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 140 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని విలువ 600కోట్ల రూపాయల విలువ ఉంటుందని సమాచారం. అలాగే పాక్ నావకు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన భారత మత్స్యకారులను ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.