Russian flight
-
ఇంజన్ ఫెయిల్ : తప్పిన విమాన ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: ఓ అంతర్జాతీయ విమానంలో శనివారం ఆకస్మాత్తుగా సాంకేతిక సమస్య రావడం ఆందోళన కలిగించింది. అధికారుల అప్రతమత్తతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రష్యాకు చెందిన విమానం అత్యవసరంగా లాండ్ అయింది. 344మంది ప్రయాణీకులతో వియత్నాం నుంచి రష్యాకు వెళుతున్న రష్యన్ విమానం అత్యవసరంగా దిగిందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. అధికారులు అనుమతి మేరకు పూర్తి అత్యవసర ప్రోటోకాల్‌తో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫు క్వాక్ నుంచి రష్యాలోని నాల్గవ అతిపెద్ద నగరం యెకాటెరిన్ బర్గ్‌కు వెళుతున్న విమానం ఏబీజీ 8722 లో సాకేంతిక సమస్య రావడంతో అత్యవసరంగా దిగేందుకు ఢిల్లీ విమానాశ్రయం అధికారుల అనుమతిని కోరింది. దీంతో విమానాశ్రయ అధికారుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎనిమిది అగ్నిమాపక ఇంజీన్లు, అత్యవసర సేవల నిమిత్తం అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఎట్టకేలకు విమానం రన్‌వే నెం.11పై సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, సిబ్బంది, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఐదడుగుల దూరంలో దూసుకెళ్లిన రష్యన్ విమానం
వాషింగ్టన్ : మరోసారి అమెరికా, రష్యా యుద్ధ విమానాల మధ్య ప్రమాదం తప్పింది. దాదాపు ఈ రెండు జెట్ విమానాలు ఒకే మార్గంలో ప్రయాణించాయి. అది కూడా దాదాపు 2గంటల 40 నిమిషాలపాటు. ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని, దాదాపు తమ విమానాన్ని ఢీకొట్టినంత పని రష్యా యుద్ధ విమానం చేసిందని పెంటగాన్ అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఈపీ-3 అనే గూఢచర్యం నిర్వంహించే విమానం ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్‌స్పేస్ నిఘా మిషన్‌లో భాగంగా ఎగురుతుండగా సరిగ్గా అదే మార్గంలో రష్యాకు చెందిన సుఖోయ్-27 యుద్ధ విమానం కూడా అమెరికా విమానం పక్కనే ఎగిరింది. అది కూడా ఎంత దగ్గరగా అంటే కేవలం ఐదు అడుగుల దూరంలో(1.5మీటర్లు) మాత్రమే. ఒకానొక దశలో ఈపీ-3 విమానం వెళ్లే మార్గంలోనే అతిదగ్గరగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో అమెరికన్ విమానం రష్యా విమానానికి రాసుకుపోయేంత పనైంది. సరిగ్గా నల్ల సముద్రంపైన ఎగురుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. -
'ఇక ఖాళీ విమానాలే పంపిస్తాం.. నో ప్యాసింజర్స్'
మాస్కో: ఈజిప్టుకు అన్ని రకాల ఫ్యాసింజర్ విమానాల సర్వీసులను రష్యా నిలిపివేసింది. బాంబు దాడి వల్లే రష్యా విమానం గతవారం కూలిపోయిందని అమెరికాతోపాటు బ్రిటన్ కూడా చెప్పడంతో ప్రస్తుతానికి ఈ ఈజిప్టు, రష్యాల మధ్య సర్వీసులను ఆపేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఇది కొత్త సమస్యగా మారింది. గత నెల 31న బయలుదేరిన మెట్రోజెట్ ఎయిర్ బస్ 321-200 రష్యా విమానం కొద్ది సేపటికే కుప్పకూలి దాదాపు 224మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అనంతరం ఆ విమానాన్ని తామే కూల్చి వేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు అధికారికంగా అటూ ఈజిప్టుగానీ, రష్యాగానీ ఉగ్రవాద సంస్థ ప్రకటనను ఆమోదించలేదు. తాజాగా, అమెరికా, బ్రిటన్ దేశాలు బలమైన బాంబు దాడి మూలంగానే రష్యా విమానం కూలిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశాయి. పరోక్షంగా ఈజిప్టు కూడా శుక్రవారం సాయంత్రం బాంబు దాడివల్లే ఈ విమానం కూలిపోయినట్లు భావిస్తున్నామని అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు రద్దయ్యాయి. రష్యా నుంచి ఎలాంటి ప్రయాణికులతో కూడిని విమానాలను ఈజిప్టుకు పంపించబోమని కాకపోతే అక్కడ ఉన్న తమ దేశ వాసులను వెనక్కి రప్పించేందుకు మాత్రం ఖాళీ విమానాలను పంపిస్తామని స్పష్టం చేసింది. ఈజిప్టులో మొత్తం 40 వేలమంది రష్యన్లు ఉన్నట్లు సమాచారం. ముందస్తు భద్రతా దృష్ట్యానే సర్వీసులు రద్దు చేశాం తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని రష్యా స్పష్టం చేసింది.