
విమానం (ప్రతీకాత్మక చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: ఓ అంతర్జాతీయ విమానంలో శనివారం ఆకస్మాత్తుగా సాంకేతిక సమస్య రావడం ఆందోళన కలిగించింది. అధికారుల అప్రతమత్తతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రష్యాకు చెందిన విమానం అత్యవసరంగా లాండ్ అయింది. 344మంది ప్రయాణీకులతో వియత్నాం నుంచి రష్యాకు వెళుతున్న రష్యన్ విమానం అత్యవసరంగా దిగిందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. అధికారులు అనుమతి మేరకు పూర్తి అత్యవసర ప్రోటోకాల్‌తో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
వియత్నాంలోని ఫు క్వాక్ నుంచి రష్యాలోని నాల్గవ అతిపెద్ద నగరం యెకాటెరిన్ బర్గ్‌కు వెళుతున్న విమానం ఏబీజీ 8722 లో సాకేంతిక సమస్య రావడంతో అత్యవసరంగా దిగేందుకు ఢిల్లీ విమానాశ్రయం అధికారుల అనుమతిని కోరింది. దీంతో విమానాశ్రయ అధికారుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎనిమిది అగ్నిమాపక ఇంజీన్లు, అత్యవసర సేవల నిమిత్తం అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఎట్టకేలకు విమానం రన్‌వే నెం.11పై సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, సిబ్బంది, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment