Delhi airport runway
-
రోజుకు 90,000 మంది ప్రయాణం!
ముంబై: ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ నెల 1–10 తేదీల్లో రోజుకు 90,000 మంది ప్రయాణించారు. జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే నెల మధ్య కాలంతో పోలిస్తే ఇది అయిదురెట్లు అధికం. జూన్ చివరినాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు 62,000లకు చేరింది. కోవిడ్ పరిస్థితి మెరుగుపడడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కారణంగా దేశీయ ట్రాఫిక్ 2023 మార్చినాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో ఇందుకు మరో ఏడాది పడుతుంది. జూలైలో 22.9 లక్షల మంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. 2019 జూలైలో ఈ సంఖ్య 58 లక్షలు నమోదైంది. ఈ కాలంతో పోలిస్తే విమాన సర్వీసులు గత నెలలో 45% తగ్గి 20,800 ఉంది. సందర్శనీయ స్థలాలు తెరవడంతో టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ సామర్థ్యంలో 72.5 శాతం స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. చదవండి : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
ఇంజన్ ఫెయిల్ : తప్పిన విమాన ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: ఓ అంతర్జాతీయ విమానంలో శనివారం ఆకస్మాత్తుగా సాంకేతిక సమస్య రావడం ఆందోళన కలిగించింది. అధికారుల అప్రతమత్తతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రష్యాకు చెందిన విమానం అత్యవసరంగా లాండ్ అయింది. 344మంది ప్రయాణీకులతో వియత్నాం నుంచి రష్యాకు వెళుతున్న రష్యన్ విమానం అత్యవసరంగా దిగిందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. అధికారులు అనుమతి మేరకు పూర్తి అత్యవసర ప్రోటోకాల్‌తో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫు క్వాక్ నుంచి రష్యాలోని నాల్గవ అతిపెద్ద నగరం యెకాటెరిన్ బర్గ్‌కు వెళుతున్న విమానం ఏబీజీ 8722 లో సాకేంతిక సమస్య రావడంతో అత్యవసరంగా దిగేందుకు ఢిల్లీ విమానాశ్రయం అధికారుల అనుమతిని కోరింది. దీంతో విమానాశ్రయ అధికారుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎనిమిది అగ్నిమాపక ఇంజీన్లు, అత్యవసర సేవల నిమిత్తం అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఎట్టకేలకు విమానం రన్‌వే నెం.11పై సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, సిబ్బంది, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
ఢిల్లీ విమానాశ్రయంలో ఢీకొనబోయిన ఎయిరిండియా, ఇండిగో విమానాలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రెండు విమానాలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (ఏఐ156), రాంచీ నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో (6ఈ389) విమానాలు దాదాపు ఢీకొనబోయాయి. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతోపాటు పైలట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించి భారీ ప్రమాదాన్ని నివారించగలిగారు. ఢిల్లీ విమానాశ్రయంలోని రన్ –27, రన్ వే–28లు ఒక చివరన కలిసిపోయి ఉంటాయి. రన్ వే–27పై ఇండిగో విమానం దిగాల్సి ఉండగా, రన్ వే–28 నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకోవా ల్సి ఉంది. ప్రణాళిక ప్రకారం ఎయిరిండియా విమానం రన్ వే 28 నుంచి మొదలై, రెండు రన్ వేలు కలిసేచోట టేకాఫ్ తీసుకోవాలి. అలాగే ఇండిగో విమానం రన్ వే–27పై దిగాలి. కానీ ఇండిగో రన్ వే పైకి వచ్చాక ల్యాండిగ్‌కు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ టేకాఫ్‌కు వెళ్లింది. అప్పటికే ఎయిరిండియా విమానం కూడా గంటకు 185 కి.మీ వేగంతో టేకాఫ్ తీసుకోడానికి వెళ్తోంది. రెండు రన్ వేలు అవతలి చివరన కలిసి ఉన్నందున, రెండు విమానాలు టేకాఫ్ తీసుకొని ఉంటే గాలిలోనే ఢీకొనేవి. అయితే అప్రమత్తమైన ఏటీసీ సిబ్బంది, ఎయిరిండియా విమానాన్ని నిలిచిపోవాల్సిందిగా ఆదేశించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇండిగో విమానం ఎందుకు ల్యాండ్ కాకుండా మళ్లీ టేకాఫ్ తీసుకోవాల్సి వచ్చిందో విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. వేగంలోనూ విమానాన్ని సురక్షితంగా నిలిపి వేసిన పైలట్ మళ్లీ వెనక్కు తీసుకొచ్చారు.