రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: రష్యా ఆధీనంలో ఉన్న డొనెట్స్క్ లో పదే పదే దాడులు చేసి రెచ్చగొట్టినందుకు రష్యా కోపంతో భారీ క్షిపణులతో విచక్షణారహితంగా దాడి చేసి 1000 మంది ఉక్రెయిన్ బలగాలను బలిగొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు భారీ స్ట్రోక్ ఇచ్చింది పుతిన్ సైన్యం. కొద్దిరోజుల క్రితం రష్యా స్వాధీనం చేసుకున్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సాయుధులు కనీసం 35 సార్లు దాడులు చేశారు. దీంతో విసుగు చెందిన రష్యా బలగాలు భారీ మిసైళ్ళతో విరుచుకుపడి ఉక్రెయిన్ బలగాలపై దాడి చేసింది. ఈ భారీ విధ్వంసంలో కనీసం 1000 మంది ఉక్రెయిన్ సైన్యం నాశనమై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత కొంత కాలంగా క్యివ్ సైన్యం డొనెట్స్క్ లోని జనావాసాల మీద దాడులు చేస్తూ వాటిని రష్యా చేసిందని ఆరోపించే ప్రయత్నం చేస్తోందని, అందుకే వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది రష్యా రక్షణ శాఖ. ఈ ప్రమాదంలో ఒకేరోజు భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఉక్రెయిన్ వర్గాలు కూడా ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: ఔరంగజేబు వారసులెవరూ లేరిక్కడ!
Comments
Please login to add a commentAdd a comment