ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు
జెరూసలేం : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వైరం ముదిరింది. సిరియాలో ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతంపై బుధవారం అర్ధరాత్రి ఇరాన్ వరుసగా 20 క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, వీటిలో కొన్నింటిని రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ఎయిర్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌తో మధ్యలోనే కూల్చేసినట్లు తెలిపింది.
మరికొన్ని మిస్సైల్స్ గోలన్ ప్రాంతాన్ని తాకయని పేర్కొంది. దాడులకు ప్రతిగా డమాస్కస్‌లోని ఇరాన్ సైన్య స్థావరాల్లో డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించినట్లు వెల్లడించింది. 2015లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, రష్యాలతో ఇరాన్‌కు అణు ఒప్పందం కుదిరింది. బుధవారం ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిరియాలోని ఇరాన్ కీలకస్థావరాలు అన్నీ ధ్వంసమయ్యాయి. ఇరుదేశాల మధ్య వైరం మరింత పెరిగి యుద్ధానికి దారి తీస్తుందేమో ఆందోళనలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment