
టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై తమ దాడులు ముగిశాయని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగకపోతే మా దాడులు ముగిసినట్లేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు.
ఒకవేళ ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభిస్తే తాము మరింత తీవ్రంగా, శక్తివంతంగా స్పందిస్తామని తెలిపారు. కాగా, ఐక్యరాజ్యసమతి భద్రతామండలి బుధవారం(అక్టోబర్2) మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులపై సమావేశం నిర్వహించనుంది.
ఇరాన్ యుద్ధానికి దిగే దేశం కాదు: అధ్యక్షుడు
ఇరాన్ ప్రయోజనాలు, పౌరుల రక్షణలో భాగంగానే దాడులు చేశామని, ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment