సౌదీ అరేబియాపై క్షిపణి దాడి | Saudi Arabia intercepts missile fired from Yemen over Riyadh | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియాపై క్షిపణి దాడి

Published Sun, Nov 5 2017 7:48 AM | Last Updated on Sun, Nov 5 2017 12:31 PM

Saudi Arabia intercepts missile fired from Yemen over Riyadh - Sakshi

రియాద్‌ : కల్లోలిత యెమన్‌ నుంచి దేశ రాజధాని రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణిని సౌదీ అరేబియా నేల కూల్చింది. దీంతో కూలిన క్షిపణికి చెందిన శకలాలు రియాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేల కూలాయి. ఈ మేరకు సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌ మద్దతు కలిగిన షితే హుతి రెబెల్స్‌(షియా-సున్నీలు ఏర్పరచిన మతపరమైన రాజకీయ శ్రేణులు).. తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.

రియాద్‌పైకి వస్తున్న క్షిపణిని కూల్చేయడంతో కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఆవరణంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. భారీ ప్రాణం నష్టం కల్గేలా.. జనావాస ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని మిస్సైల్‌ దాడి జరిగిందని సౌదీ అధికారులు పేర్కొన్నారు. 1,200  కిలోమీటర్ల దూరం నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు చెప్పారు.

ఈ ఏడాది జులైలో కూడా యెమెన్‌ నుంచి సౌదీలోని మక్కా ప్రాంతంపై క్షిపణి దాడి జరిగింది. దీన్ని కూడా సౌదీ రక్షణ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement