వాషింగ్టన్: పోలాండ్ సరిహద్దు గ్రామం ప్రెజెవోడో సమీపంలో మిసైల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మిసైల్‌పై 'మేడ్ ఇన్ రష్యా' అని ఉండటంతో అంతా రష్యానే ఈ దాడికి పాల్పడిందని భావించారు. పోలాండ్ కూడా రష్యా రాయబారికి ఈ విషయంపై సమన్లు పంపింది.
అయితే ఈ ఘటనపై అమెరికా కీలక విషయం వెల్లడించింది. ఈ దాడికి పాల్పడింది రష్యా కాదని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పింది. రష్యా మిసైల్స్‌ను ఉక్రెయిన్ నిలువరించే క్రమంలో పొరపాటున ఓ మిసైల్ పొరుగుదేశమైన పోలాండ్ సరిహద్దులో పడిందని పేర్కొంది. ఉక్రెయిన్ ఫైరింగ్ వల్లే రష్యా మిసైల్ పోలాండ్‌లో పడినట్లు అమెరికా నిఘా అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం జీ20 సదస్సులో భాగంగా ఇండోనేషియా బాలిలో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. పోలాండ్ మిసైల్ ఘటన వెంటనే అప్రమత్తమై జీ20 సదస్సులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మిసైల్ దాడి రష్యా చేసినట్లు కన్పించడం లేదని ఆయన కూడా ఇప్పటికే సూత్రప్రాయం తెలిపారు. పోలాండ్ కూడా ఈ పని చేసింది రష్యానే అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే పేర్కొంది.
చదవండి: పోలాండ్‌లో మిస్సైల్ అటాక్.. టెన్షన్‌లో జో బైడెన్!
Comments
Please login to add a commentAdd a comment