Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి సుమారు రెండు వారాలు దాటింది. బాంబుల మోతతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్నాయి. ప్రాణాల కోసం లక్షలాది మంది ప్రజలు దేశాన్ని విడిచి పరాయి దేశాలకు పయనమవడం, కొందరు అక్కడే బిక్కుబిక్కుమంటూ బంకర్లలో తలదాచుకోవడం, ఓ చిన్నారి ప్రాణాలతో పోరాడుతుంటే.. తల్లి ఏడుస్తూ చూడటం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ విషాదాలకు అంతేలేదు.
తాజాగా ఈ తరహా ఘటనే ఉక్రెయిన్‌లో మరొకటి చోటు చేసుకుంది. రష్యా బలగాలు దాడి చేస్తుండగా మర్హాలివ్క ప్రాంతంలో ఓ ఇంటిపై రష్యా క్షిపణి పడింది. దీంతో ఆ ఇంటిలోని కుటుంబసభ్యులు 12 మంది ఉండగా అందులో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ట్విటర్‌లో షేర్ చేసింది.
ఆ వ్యక్తి కీవ్ నగరంలో ఉంటే ప్రాణాలు పోతాయనే భయంతోనే తన కుటుంబాన్ని మర్హాలివ్క ప్రాంతానికి తరలించాడని, కానీ బాంబుల దాడితో అక్కడ కూడా వారి ప్రాణాలకు రక్షణ లభించలేదని తెలిపింది. ఆ దాడిలో సదరు వ్యక్తి తన భార్యను, కుమార్తెను, అత్తగారిని, చెల్లెలిని, అల్లుడిని, మనుమళ్లు, మేనళ్లులు.. అందరినీ కోల్పోయి కన్నీటి పర్యంతమైన ఉన్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను కలవరపెడుతోంది.
📍Marhalivka.
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 11, 2022
This man and his family left Kyiv to be safe. The rocket hit his house, there were 12 people: children (two grandchildren and two nieces), wife, daughter, sister...
Only he and his cat survived.#closeUAskyNOW pic.twitter.com/02cNsfSN4W
Comments
Please login to add a commentAdd a comment