
కీవ్: ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్ ప్రాంతం లక్ష్యంగా రష్యా మిలటరీ బుధవారం రాత్రి ఎస్–300 దీర్ఘ శ్రేణి క్షిపణులతో విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోని పొక్రోవ్‌స్‌్క, నోవోహ్రోడివ్‌కా, మిర్నోహ్రాడ్ నగరాలపై జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా పదుల కొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి.
భవనాల శిథిలాల్లో కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలలుగా భీకర పోరాటం కొనసాగుతున్న అవ్‌డివ్కా నగరానికి సమీపంలోనే పై మూడు నగరాలున్నాయి. బఖ్‌ముత్ చుట్టుపక్కల ప్రాంతం, కీలకమైన అవ్‌డివ్కాలపై పట్టుసాధించేందుకు రష్యా బలగాలు వరుస దాడులకు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది.