వాషింగ్టన్/ఐరాస: సిరియా వివాదం అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. సిరియాలో ఇటీవల జరిగిన విష రసాయన దాడిని తీవ్రంగా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ దేశంలో క్షిపణి దాడికి వెనుకాడబోమని హెచ్చరించారు.
‘సిరియా వైపు వచ్చే ప్రతీ క్షిపణినీ కూల్చేస్తామని రష్యా అంటోంది. రష్యా.. సిద్ధంగా ఉండు. మా క్షిపణులు వస్తున్నాయి. అవి మామూలువి కావు.. అత్యంత ఆధునిక క్షిపణులవి. సొంతదేశ పౌరులను విషవాయువుతో చంపే జంతువుకు నువ్వు మద్దతివ్వకుండా ఉండాల్సింది’ అంటూ ఒక ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment