కీవ్: అమెరికా తయారీ లాంగ్‌రేంజ్ క్షిపణులు వాడేందుకు అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వగానే ఉక్రెయిన్ వాటి వాడకాన్ని మొదలు పెట్టింది. అమెరికా తయారీ లాంగ్‌రేంజ్ ఆర్మీ ట్యాక్‌టికల్(ఏటీఏసీఎంఎస్) మిసైల్‌ను మంగళవారం(నవంబర్ 19) రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించినట్లు సమాచారం. ఈమేరకు ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది.
రష్యా,ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు కథనాల సారాంశం. అమెరికా కంపెనీ లాక్‌హిడ్ మార్టిన్ తయారు చేసిన ఏటీఏసీఎంఎస్ లాంగ్‌రేంజ్ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను తాకడం వీటి ప్రత్యేకత. ఈ క్షిపణులతో రష్యాలోని ఎంత దూర ప్రాంతంపై అయినా ఉక్రెయిన్ దాడులు చేసే వీలుంది.
రష్యాపై లాంగ్‌రేంజ్ మిసైల్స్‌ను వాడేందుకు ఉక్రెయిన్ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్ తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుందనగా తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుందోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా
Comments
Please login to add a commentAdd a comment