
టెల్ అవీవ్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల దాడి మూడోరోజు బుధవారం కూడా కొనసాగింది. ఈ దాడుల్లో 51 మంది చనిపోగా, 223 గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబైద్ వెల్లడించారు. హెజ్బొల్లా అగ్రనాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో సోమ, మంగళవారాల్లో 564 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌పై భూతల దాడులకు సిద్ధమవుతున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి బుధవారం తెలిపారు.
మొస్సాద్ ప్రధాన కార్యాలయం పైకి.. హెజ్బొల్లా బుధవారం ఇజ్రాయెల్‌పైకి డజన్ల కొద్ది క్షిపణులను ప్రయోగించింది. ఏకంగా టెల్ అవీవ్‌లోని నిఘా సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైకి ఖాదర్–1 బాలిస్టిక్ మిసై్పల్‌ను ప్రయోగించినట్టు ప్రకటించింది. టెల్ అవీవ్‌లో, సెంట్రల్ ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మారుమోగాయి. దాంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భూతలం నుంచి భూతల లక్ష్యంపైకి ప్రయోగించిన క్షిపణిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి సెంట్రల్ ఇజ్రాయెల్‌ను చేరుకోవడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment