ఇజ్రాయెల్‌-హిజ్బుల్లా మధ్య మిసైల్స్‌ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన | Israel attacks southern Lebanon Hezbollah launches drones on them | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌-హిజ్బుల్లా మధ్య మిసైల్స్‌ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన

Aug 25 2024 10:49 AM | Updated on Aug 25 2024 11:48 AM

Israel attacks southern Lebanon Hezbollah launches drones on them

ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం మిసైల్స్‌తో మెరుపుదాడి చేసింది. హిజ్బుల్లా ఉగ్రసంస్థ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎందుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం లెబనాన్‌లో ముందస్తు దాడులను చేపట్టింది. సుమారు 40 మిసైల్స్‌ను లెబనాన్‌పై ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా వెంటనే  స్పందించిన హిజ్బుల్లా ఉగ్రసంస్థ.. ఇజ్రాయెల్‌పై సుమారు 320 కట్యూషా రాకెట్లతో దాడి చేసినట్లు ప్రకటించింది.  దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.

 

‘‘తమ సైనిక కమాండర్ ఫువాద్ షుక్ర్ హత్యకు ప్రతిస్పందనగా ఈ దాడులకు దిగాం. ప్రత్యేక సైనిక స్థావరాలే లక్ష్యంంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర సైనిక స్థావరాలపై దాడి చేశాం’’ అని ఉగ్రసంస్థ హిజ్బుల్లా ఓ ప్రకటనలో పేర్కొంది.

దీంతో ఇజ్రాయెల్‌లో 48 గంటల పాటు అత్యవసర పరిస్థితిని  రక్షణ మం​త్రి యోవ్ గల్లంట్ ప్రకటించారు. అయితే హిజ్బుల్లా లక్ష్వంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు ముందు  రక్షణ మంత్రి యోవ్‌  గల్లంట్‌ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఫోన్‌ లాయిడ్ ఆస్టిన్‌తో మాట్లడినట్లు తెలుస్తోంది. ‘‘ఇజ్రాయెల్ పౌరులపై దాడుల ముప్పును అడ్డుకోవడానికి లెబనాన్‌లోని హిజ్బుల్లా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించాం​. బీరూట్‌లోని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇజ్రాయెల్‌ పౌరుల రక్షణ కోసం మేము అన్ని మార్గాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం’’ అని గాలంట్ పేర్కొన్నట్లు ఇజ్రాయెల్‌ స్థానిక మీడియా  వెల్లడించింది.

 

ఇప్పటికే హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య దాడులతో భారీగా ప్రాణ, ఆస్తినష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో.. మరో యుద్ధం మొదలైతే మరింత  ప్రమాదం తప్పదన్న తీవ్ర భయాందోళనలు గతకొంత కాలంగా వ్యక్తమవుతున్నాయి. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై అప్పుడప్పుడూ దాడులకు దిగిన హిజ్బుల్లా  ప్రస్తుత దాడుల తీవ్రతను గమనిస్తే.. నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement