టెల్‌ అవీవ్‌పై హెజ్‌బొల్లా దాడి.. విమాన సర్వీసుల నిలిపివేత | Hezbollah says it bombed in Israel Tel Aviv flights halted | Sakshi
Sakshi News home page

టెల్‌ అవీవ్‌పై హెజ్‌బొల్లా దాడి.. విమాన సర్వీసుల నిలిపివేత

Published Tue, Oct 22 2024 11:59 AM | Last Updated on Tue, Oct 22 2024 11:59 AM

Hezbollah says it bombed in Israel Tel Aviv flights halted

ఇ‍జ్రాయెల్‌ రాజధాని టెల్ అవీవ్ శివారులోని నిరిట్ ప్రాంతంలో మిసైల్స్‌తో దాడి చేశామని లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా  గ్రూప్‌ ప్రకటించింది. హెజ్‌బొల్లా  మిసైల్స్‌తో దాడులకు తెగపడిన సమయంలో టెల్ అవీవ్‌లో వైమానిక దాడి సైరన్‌లు మోగాయి. అయితే ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టం గురించి పూర్తి సమాచారం తెలియరాలేదు.

మరోవైపు.. హెజ్‌బొల్లా  ఇజ్రాయెల్‌పై  మిసైల్స్‌తో దాడి చేసిన  సమయంలో చెలరేగిన పొగ.. లెబనాన్ మిడిల్ ఈస్ట్ ఎయిర్‌లైన్స్ (MEA) విమానానికి కమ్ముకుంది.  ఈ విమానం బీరుట్-రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొంత సమయానికి  ఆ విమానానికి పొగ కమ్ముకుంది. టెల్ అవీవ్ వైపు హెజ్‌బొల్లా క్షిపణులను ప్రయోగించటంతో బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలును అధికారులు నిలిపివేశారు. 

ఇజ్రాయెల్ 24 గంటల్లో లెబనాన్‌లోని 300 హెజ్‌బొల్లా లక్ష్యాలను ఢీకొట్టిన మరుసటి రోజే హెజ్‌బొల్లా దాడి చేసింది. మరోవైపు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం మధ్యప్రాచ్య పర్యటనను ఇజ్రాయెల్‌లో ప్రారంభించనున్నారు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని దక్షిణ శివారులోని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో సోమవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణించగా.. 24 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement