జెరూసలేం: జజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత హషేమ్ సఫీద్దీన్ మృతి చెందాడు. మూడు వారాల క్రితం దక్షిణ బీరుట్ సబర్బ్‌లో ఇటీవల మృతిచెందిన హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ తమ దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ధృవీకరించింది.
‘‘సుమారు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధిపతి హషీమ్ సఫీద్దీన్ , హెజ్‌బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీ హుస్సేన్ హజిమా, ఇతర హిజ్‌బొల్లా కమాండర్లు మరణించినట్లు ధృవీకరించాం’’ ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ మరణాలకు సంబంధించి హెజ్‌బొల్లా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవటం గమనార్హం.
#hashemsafieddine, Hezbollah's newly appointed leader, was killed in Israeli airstrikes on October 4 by #IDF
The body of Hashem #safieddine, #Hezbollah's new leader and successor to #Nasrallah, has been discovered#Israel #Beirut #Lebanon #Israel #IsraeliAirstrike #TelAviv pic.twitter.com/GjLlcQAvX2— know the Unknown (@imurpartha) October 22, 2024
మూడు వారాల క్రితం దక్షిణ బీరుట్ శివారు దహియేహ్‌లో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు చేశామని ఆలస్యంగా మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొంది. దాడి చేసిన సమయంలో 25 మందికి పైగా హెజ్‌బొల్లా మిలిటెంట్లు ప్రధాన కార్యాలయంలో ఉన్నారని, అందులో ఏరియల్ ఇంటెలిజెన్స్ సేకరణకు బాధ్యత వహించే బిలాల్ సైబ్ ఐష్ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
అక్టోబరు 8న, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. పేరు తెలపకుండా సఫీద్దీన్ మృతి చెందినట్లు ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దళాలు (హెజ్‌బొల్లా నేత హసన్ నస్రల్లా ), నస్రల్లా
స్థానంలో నియమించిన మరోనేతతో సహా వేలాది మంది ఉగ్రవాదులను అంతం చేశాం’ అని అన్నారు.
చదవండి: హెజ్‌బొల్లా రహస్య బంకర్‌లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు
Comments
Please login to add a commentAdd a comment