ఈనెల 18న రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ బొల్లారంలోని తన శీతాకాల విడిదికి వస్తుండటంతో.. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలీసు అధికారులతో పాటు రక్షణ శాఖ సీనియర్ అధికారులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 18 నుండి 31 వరకు రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని.. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
షెడ్యూల్ ఇదే..
ఈనెల 18న డిల్లీ నుండి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నర్సింహన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్ర పతికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 19న మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగులో నిర్వహించనున్న స్నాతకోత్సవానికి హజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తలపెట్టిన చండీ యాగానికి కూడా రాష్ట్ర పతి హాజరు కానున్నారు. రాషప్రతి నిలయానికి అవసరమైన అన్ని సౌకర్యలు రక్షణ శాఖకు చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కల్పిస్తున్నారు.
కాన్వాయ్ రిహార్సిల్..
రాషప్రతి రాక సందర్భంగా బుదవారం పోలీసులు హకీంపేట నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు కాన్వాయ్ రిహార్సిల్ నిర్వహించారు.