శుక్రవారం ఎట్‌హోం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, జస్టిస్ అలోక్ అరాధే దంపతులు, చెన్నమనేని విద్యాసాగర్, మంత్రి రాజనర్సింహ తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఎట్ హోం నిర్వహించారు. రాష్ట్ర ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు, విపక్ష నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆహూతులను పరిచయం చేసుకున్న ద్రౌపదీ ముర్ము కాసేపు వారి తో ముచ్చటించారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై శివుని కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుదీర్‌రెడ్డి, పర్ణికారెడ్డి, యశస్విని, రాగమయి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, మండలి, అసెంబ్లీ సభ్యులు పలువురు అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment