తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్‌ తమిళిసై ప్రసంగం ఇదే.. | Telangana Assembly Budget Session 2024 Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్‌ తమిళిసై ప్రసంగం ఇదే..

Published Thu, Feb 8 2024 7:41 AM | Last Updated on Thu, Feb 8 2024 3:07 PM

Telangana Assembly Budget Session Live Updates - Sakshi

Updates..

ముగిసిన బీఏసీ సమావేశం

  • ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో 4 రోజుల పాటు సమావేశం కానున్న అసెంబ్లీ
  • ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం
  • ఈ నెల 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • 11వ తేదీన అసెంబ్లీకి సెలవు
  • 12, 13వ తేదీన బడ్జెట్పై చర్చ
  • అసెంబ్లీలో ఇరిగేషన్ శ్వేత పత్రం, మేడిగడ్డ విజిలెన్స్ విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
  • శ్వేత పత్రం విడుదల ఉండదంటున్న అసెంబ్లీ వర్గాలు
  • ఇప్పటికే ప్రకటన చేశాము కాబట్టి ఖచ్చితంగా ఉంటుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్‌ కొత్త రాజ్యాంగామా ఇది: హరీష్‌ రావు ఫైర్‌

  • గతంలో ఇలాంటి సాంప్రదాయం ఉన్నట్టు నిరూపిస్తే నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా
  • గతంలో లేని సంప్రదాయాలు తీసుకోని వస్తున్నారు.
  • బీఏసీ జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు.
  • కాంగ్రెస్ కొత్త రాజ్యాంగం తీసుకోని వస్తున్నారు.
  • కడియం శ్రీహరితో పాటు హరీష్ రావు వస్తారని నిన్ననే స్పీకర్‌కు కేసీఆర్ తెలియజేశారు
  • స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను 
  • ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు.

జగ్గారెడ్డికి మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కౌంటర్‌

  • జగ్గారెడ్డి తన స్థానం నుండే ఆయన గెలవలేదు
  • ఆయన మాపార్టీ ఎమ్మెల్యేలని ఎలా తీసుకెళ్తారు
  • మా ఎమ్మెల్యేలను తీసుకెళ్లంతా దమ్మున్న వ్యక్తులు కాంగ్రెస్‌లో లేరు
  • ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
  • వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చడానికి మాకేం అవసరం ఉంది
  • ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అంతర్యుద్ధం తప్పదు
  • తీర్చలేని హామీలు ఇచ్చి మాపై నెపం నెడుతున్నారు
     

బీఏసీ మీటింగ్‌ నుంచి బయటకు హరీష్‌ రావు..

  • బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు
  • కేసీఆర్‌కు బదులుగా బీఏసీ సమావేశానికి వెళ్ళిన హరీష్
  • తనకు బదులుగా హరీష్ బీఏసీకి వస్తారని ముందే సమాచారం ఇచ్చిన కేసీఆర్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
  • కాసేపటి తర్వాత బీఏసీ నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు

హరీష్ రావు బయటకు.. సీఎం రేవంత్‌ లోపలికి..

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఏసీ సమావేశం
  • అసెంబ్లీ సమావేశాల అజెండాపై బీఏసీలో చర్చ
  • బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • బీఏసీ సమావేశానికి బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి హాజరు
  • బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్ధీన్

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

►ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

  • కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై
  • ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు. 
  • ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది.
  • ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. 
  •  ఆరు గ్యారంటీలను అందుబాటులోకి తీసుకుచ్చాం. 
  • త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం. 
  • అర్హులకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌
  • మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 
  • రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. 

  • రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు. 
  • రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం.
  • దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం. 
  • ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. 
  • TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం. 
  • గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం. 

  • ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది.
  • ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 
  • ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం. 
  • తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. 
  • ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం.

  • వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం. 
  • మౌళిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తాం. 
  • ఇంటర్నెట్‌ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. 
  • టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. 

  • మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం.
  • దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. 
  • కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. 
  • చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్‌ఎంఈ పాలసీ. 
  • వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు. 

  • మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించాం. 
  • ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్‌, లక్నవరం 
  •  త్వరలో గ్రీన్‌ ఎనర్జీని తీసుకువస్తాం. 
  • ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ అందిస్తాం. 
  • టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తాం.

బస్సులో బల్మూరి వెంకట్‌..

  • మొదటి రోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  • నాంపల్లిలో బస్సు ఎక్కి అసెంబ్లీకి వచ్చిన వెంకట్
  • ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రయాలు తెలుసుకున్న వెంకట్.

ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు వెళ్లనున్న బీజేపీ 

  • బీజేఎల్‌పీ లీడర్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న కమలం పార్టీ 
  • బీజేఎల్‌పీ నేతను నియమించకపోవడంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం
  • ఫ్లోర్ లీడర్ ఎంపిక అంశం జాతీయ పార్టీ చేతిలో ఉందటున్న రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు  
  • గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో రాజా సింగ్‌కి కాకుండా ఎవరికి ఫ్లోర్ లీడర్ ఇస్తే బాగుంటుందనే కసరత్తుల్లోనే బీజేపీ
  • ఫ్లోర్ లీడర్ పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు వెంకట రమణ రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్ 
  • గత సమావేశాల మాదిరిగానే పార్టీ హై కమాండ్ సూచన మేరకు అంశాన్ని బట్టి ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం
  • బీఏసీ సమావేశానికి వెళ్లనున్న ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి


►తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తారు.

►ఈ నెల 9న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.

►ఇక, నేడు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హాజరుకావడం లేదు. రేపటి నుంచి కేసీఆర్‌ అసెంబ్లీకి రానున్నారు. నేడు మిగతా బీఆర్‌ఎస్‌ సభ్యులంతా హాజరుకానున్నారు.

►బడ్జెట్‌లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తుండగా, గురువారం స్పీకర్‌ అధ్యక్షతన జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పార్టీల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.  

ప్రోటోకాల్‌లో తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్‌బాబు 
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించాలని సీఎస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్‌ విషయంలో తప్పిదాలు జరగవద్దని అన్నారు. ప్రోటోకాల్‌ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని గుర్తు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement