2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..! | Team India Schedule In 2025 | Sakshi
Sakshi News home page

2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..!

Dec 30 2024 7:54 PM | Updated on Dec 30 2024 8:06 PM

Team India Schedule In 2025

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన టీమిండియా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్‌తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది. సిడ్నీ టెస్ట్‌ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సాగనుంది. అనంతరం భారత్‌ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ భారత్‌లో పర్యటిస్తుంది.

ఇంగ్లండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా షెడ్యూల్‌
జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20 (చెన్నై)
జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్‌)
జనవరి 31- నాలుగో టీ20 (పూణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)

ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్‌)
ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్‌)
ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్‌)

ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ అనంతరం భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. 
ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్‌ ఇలా ఉండబోతుంది.

ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (దుబాయ్‌)
ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ (దుబాయ్‌)
మార్చి 2- ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ (దుబాయ్‌)

గ్రూప్‌ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో తదుపరి మ్యాచ్‌లు (సెమీస్‌, ఫైనల్‌) ఉంటాయి.

మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్‌ 2025 జరుగుతుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌ వచ్చే ఏడాది జూన్‌ 20న మొదలవుతుంది. ఈ సిరీస్‌ షెడ్యూల్‌ ఇలా ఉండనుంది.

జూన్‌ 20-24: తొలి టెస్ట్‌ (లీడ్స్‌)
జులై 2-6: రెండో టెస్ట్‌ (బర్మింగ్హమ్‌)
జులై 10-14: మూడో టెస్ట్‌ (లండన్‌, లార్డ్స్‌)
జులై 23-27: నాలుగో టెస్ట్‌ (మాంచెస్టర్‌)
జులై 31-ఆగస్ట్‌ 4: ఐదో టెస్ట్‌ (లండన్‌, కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌)

షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు.


2025లో టీమిండియా ఆడే వన్డేలు
ఇంగ్లండ్‌తో 3
ఛాంపియన్స్‌ ట్రోఫీలో 5
బంగ్లాదేశ్‌తో 3 (బంగ్లాదేశ్‌తో)
ఆస్ట్రేలియాతో 3 (ఆస్ట్రేలియాలో)
సౌతాఫ్రికాతో 3 (భారత్‌లో)

వచ్చే ఏడాది టీమిండియా ఆడే టెస్ట్‌లు
ఆస్ట్రేలియాతో ఒకటి (బీజీటీ)
క్వాలిఫై అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌
ఇంగ్లండ్‌తో 5 (ఇంగ్లండ్‌లో)
వెస్టిండీస్‌తో 2 (భారత్‌లో)
సౌతాఫ్రికాతో 2 (భారత్‌లో)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement