
ఉక్రెయిన్: సౌందర్యాన్ని పెంపొందిచుకోవడానికి చాలా మంది సెలబ్రిటీలు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటారు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వారు లైమ్‌లైట్‌లో ఉండాలంటే ఎప్పటికప్పుడు అందానికి మెరుగులు దిద్దుకోవాల్సిందే. గతంలొ చాలా మంది ఇలాగే చేశారు. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన ఒక మోడల్ కాస్మోటిక్స్ సర్జరీ, బోటెక్స్ ఇంజక్షన్‌లతో తన రూపాన్ని తనకిష్టమైన రీతిలో మలుచుకున్నారు. కాగా, తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత అని రెండు ఫోటోలను షేర్ చేశారు. ఇప్పుడివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
32 ఏళ్ళ అనస్టాసియా పోక్రెష్ చుక్‌కు గ్లామర్‌గా కనిపించడమంటే మహా ఇష్టం. ఇందుకోసం గత ఆరేళ్ళలో అనేక సర్జరీలు చేయించుకున్నారు. దాదాపు 1.5 లక్షల వరకు ఖర్చుచేశారు. ఇక సర్జరీ ఫలితంగా ఈ భామ బుగ్గలు, పెదాలు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. దీంతో, ఇంత పెద్ద, అందమైన బుగ్గలు ప్రపంచంలో వేరేవరికి లేవని అందుకే తాను తన బుగ్గలతో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చారు. అయితే, నెటిజన్లు మాత్రం సర్జరీ కంటే ముందే మీరు అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment