Military Vehicle Crushing Car In Ukraine: Man Survives After Accident, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

Viral Video: యుద్ధ ట్యాంక్‌ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి

Published Sun, Feb 27 2022 9:37 PM | Last Updated on Mon, Feb 28 2022 9:54 AM

Military Combat Vehicle Crushing Car And Its Ukraine Man Escape - Sakshi

Military Vehicle Crushing Car: గత నాలుగు రోజులుగా రష్యా బలగాల వైమానిక  క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌ అతలాకుతులం అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ వాహనం వేగంగా వస్తున్న కారు పైకి దూసుకువచ్చింది. ఆ సాయుధ వాహనం కింద కారు నుజ్జునుజ్జు అయిపోయింది. నిజానికి మనుషులు బతికి ఉండే అవకాశమే లేదు అన్నంతగా ఆ కారు ధ్వంసమైంది. విచిత్రమేమిటంటే ఆ కారులోని మనిషి బతికే ఉన్నాడు.

ఈ ఘటన రైల్వే ట్రాక్‌కి సమీపంలో చోటు చేసుకుంది. అయితే ఆ సాయుధ వాహనం వెనుక కూడా రెండు కార్లు వస్తున్నాయి. కానీ ఆ సాయుధ వాహనం స్కిడ్‌ అయ్యిందో లేక వేగంగా వాహనాన్ని అడ్డుకునే క్రమంలో అలా వచ్చిందా అనేది తెలియలేదు. పైగా ఆ సాయుధ వాహనానం రష్యాకి సంబంధించినదేనా  అనే దానిపై కూడా స్పష్టత లేదు.

కానీ ఆ కారులోని వృద్ధుడు క్షేమంగా బయటపడటం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అయితే సీసీటీవలో గ్రౌండ్ క్లియరెన్స్‌ ఎక్కువుగా ఉందని అదే మనిషి ప్రాణాలను కాపాడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

(చదవండి: నా కుక్కపిల్ల లేకుండా ఉక్రెయిన్‌ విడిచి రాను!: భారతీయ విద్యార్థి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement