Russia Ukraine War: Ukrainian Woman Assaulted By Russian Soldiers - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ మహిళపై రష్యా సైనికుల దురాగతం...ఆమె భర్తను చంపి, వివస్త్రను చేసి..

Published Tue, Mar 29 2022 12:15 PM | Last Updated on Tue, Mar 29 2022 4:27 PM

Ukranian Woman Assult By Russian Soldiers  - Sakshi

Ukrainian woman recalls horror: రష్యా ఉక్రెయిన్‌పై వైమానిక దాడులతో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోపక్క యథావిధిగా దాడులకు తెగబడుతోంది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం లేదంటూనే నివాసితుల ఇళ్లపై బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఒక ఉక్రెయిన్‌ మహిళ రష్యా సైనికులు తన ఇంటిపై దాడి చేశారని తెలిపింది.

తొలుత తమ పెంపుడు కుక్కను చంపారని, ఆ తర్వాత తన భర్తను చంపినట్లు వెల్లడించింది. తదనంతరం రష్యా సైనికులు తన తలపై గన్‌పెట్టి తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని బెదిరించి ఆత్యాచారం చేశారని తెలిపింది. ఆ సమయంలో తన నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్‌ రూమ్‌లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడంటూ ఆనాటి ఘటనను గుర్తుతెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమైంది. ఆ తర్వాత తాము అక్కడి నుంచి భయంతో పారిపోయామని, తన భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశామని చెప్పింది. ప్రస్తుతం అధికారులు ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టారు.

(చదవండి: పుతిన్‌ ధీమా... జెలెన్‌ స్కీ అభ్యర్థన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement