
వార్తలు చదువుతున్నప్పుడు యాంకర్లకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను చూసే ఉంటాం. మరి ముఖ్యంగా లైవ్‌లో వార్తలు చదువుతున్న సమయంలో ఎంతో సమయస్పూర్తిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్ని అవంతరాలు ఎదురైనా తప్పని సరిగా వార్తలు పూర్తి చెయ్యాల్సి వస్తుంది. తాజాగా ఉక్రెయిన్‌లో వార్తలు చదువుతున్న ఓ మహిళ న్యూస్ రీడర్‌కు వింత అనుభవం ఎదురైంది. మారిచ్కా పడల్కో అనే మహిళ వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ క్రమంలో నోటి నుంచి ఒక పన్ను ఊడిపడింది. దీంతో భయానికి గురవ్వకుండా సమయస్పూర్తితో స్పందించిన మహిళ చేత్తో పంటిని తీసి వార్తలను చదవడం కొనసాగించింది. (హృదయాన్ని తాకే వీడియో: నీళ్ల కోసం ఉడత..)
కాగా తన 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ఘటన ఎదురవ్వలేదని మారిచ్కా స్థానిక మీడియా ముందు పేర్కొంది. 10 సంవత్సరాల క్రితం అలారం గడియారంతో ఆడుకుంటున్న తన కుమార్తె అనుకోకుండా పంటిని సగం పడగొట్టంతో ఆమె దంతాలు ఊడిపోయినట్లు మహిళ పేర్కొంది. ఇక ఈ వీడియోను సదరు మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట్ల వైరల్‌గా మారింది. ఇప్పటికే దాదాపు 30 వేలకు పైగా లైకులు రాగా, అనేక మంది కామెంట్ చేస్తున్నారు. ‘లైవ్‌లో పన్ను ఊడిపోయినా పట్టు వదలకుండా వార్తలు పూర్తి చేసింది’ అని మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (‘నాకేంటి! కరోనా ఏంటి!!’)
Comments
Please login to add a commentAdd a comment