రష్యా సైన్యానికి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా చురకలంటించారు. పోయి పోయి మీరు వాళ్లతో ఎందుకు పెట్టుకున్నారయ్యా. కావాలంటే బ్రిటీషర్లను అడగండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ మారింది.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా సమకాలిన అంశాలపై సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై తన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తన బాల్యం యుద్ధానికి ఎలా ముడిపడింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్ధుల్ని కేంద్రం ఎంతమంది స్వదేశానికి తరలిచ్చిందనే విషయాలపై ఎప్పటికప్పుడూ అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా ఉక్రెయిన్ దేశ భూభాగాల్ని స్వాధీనం చేసుకుంటున్న రష్యా మిలటరీని నినదిస్తూ స్థానికులు ప్లకార్డ్‌లతో ఆందోళన చేస్తున్న విడియోల్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఉక్రెయిన్ నగరానికి చెందిన ఖేర్‌సన్ Kherson అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. అయితే ఆ బలగాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి.
When an army has to face unarmed civilians, they’re facing a weapon more powerful than tanks. Satyagraha will always prove an unconquerable force… Ask the British… https://t.co/2Xpk22b67w
— anand mahindra (@anandmahindra) March 5, 2022
ఆ వీడియోలను నెటిజన్లతో పంచుకున్న ఆనంద్ మహీంద్రా..రష్యా సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఒక సైన్యం నిరాయుధ పౌరులను ఎదుర్కోవలసి వస్తే..వాళ్లు యుద్ధ ట్యాంకుల కంటే శక్తివంతమైన ఆయుధాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సత్యాగ్రహాం జయించలేని శక్తి. కావాలంటే ఒక్కసారి బ్రిటిష్ వాళ్లని అడగండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.
చదవండి: యుద్ధం.. ఆ శబ్ధం వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది- ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment