ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రతిగా ఇటు అమెరికా కానీ నాటో దళాలు కానీ యుద్ధ రంగంలోకి దిగకుండా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ పోతున్నాయి. యుద్ధం చేయకుండా ఇలా ఆంక్షలతో అమెరికా, నాటో దేశాలు సాధించేది ఏంటీ అనే సందేహం చాలామందిలో కలుగుతోంది. అయితే ఆర్థిక ఆంక్షలు అనేవి ఎంత ప్రభావవంతమైనవనే అంశాన్ని ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా గుర్తించారు.
ఆమెరికా, యూరప్ దేశాలు వరుసగా విధిస్తున్న ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. తాజాగా ఆంక్షల ఎఫెక్ట్ అక్కడి పారిశ్రామిక రంగంపై కూడా పడుతోంది. రష్యాలో ఉన్న కార్ల తయారీ సంస్థల్లో లాడా ప్రముఖమైనది. అయితే తాజాగా కార్ల తయారీ నిలిపివేస్తున్నట్టు లాడా ప్రకటించింది.
లాడా కార్ల తయారీలో ఉపయోగించే అనేక కాంపోనెంట్స్ యూరప్‌తో పాటు వివిధ దేశాల నుంచి రష్యా దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం విధించిన ఆంక్షల కారణంగా కార్ల తయారీలో ఉపయోగించే అనేక స్పేర్ పార్ట్స్ రష్యాలో లభించని పరిస్థితి నెలకొంది. దీంతో కార్ల తయారు చేయలని పరిస్థితి ఎదురవడంతో లాడా ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ఆ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు వారి కుటుంబాలు చిక్కుల్లో పడతాయి.
ఆర్థిక ఆంక్షల కారణంగా లాడా కార్ల తయారీ ఆపేసినట్టు ది కీవ్ ఇండిపెండెంట్ సంస్థ పెట్టిన ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ... ‘సప్లై చెయిన్.. మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ ఆఫ్ వార్.. అంటూ కామెంట్ చేశారు. సప్లై చెయిన్లను దెబ్బ తీయడం ద్వారా అమెరికా మరో మార్గంలో రష్యాపై యుద్ధం ప్రకటించినట్టయ్యింది.
Supply chains. The most potent weapons of war… https://t.co/kaqNbbxKYZ
— anand mahindra (@anandmahindra) March 10, 2022
చదవండి: Anand Mahindra Tweet: చైనాకు చురకలు అంటించిన ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment